గార్గేయపురం వద్ద విద్యుత్‌ప్లాంట్
కర్నూలు (టౌన్):
చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కర్నూలులో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని గార్గేయపురం వద్ద సర్వే నంబర్ 751, 180/2 లో 6 ఎకరాల 178 సెంట్లు కేటాయిస్తు శనివారం ప్రభుత్వం జీవో 204 జారీ చేసింది. బెంగళూరుకు చెందిన నెక్సాస్ నోవోస్ ఇంపోర్టు అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్త్రెవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఆర్. కరికాల్ వలవన్ పేర్కొన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబును ఆ ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది.