రైల్వే ట్రాక్‌పై వృద్ధుడి మృతదేహం
అనంతపురం న్యూసిటీ : గార్లదిన్నె-కల్లూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని ఓ వృద్ధుడి(65) మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తలకు బలమైన గాయాలై, రక్తస్రావం కాగా, రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు తెల్లరంగు పుల్హ్యాండ్ షర్టు, అందులో గ్రే కలర్ లైన్స్ ఉన్నాయి. రూపా కంపెనీకు చెందిన బిస్కట్ కలర్ పుల్ డ్రాయర్ ధరించి ఉన్నాడన్నారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.