Gas Book online
-
సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్‌లో క్షణాల్లో డెలివరీ
సాక్షి, రాజమహేంద్రవరం: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొందరికి వంటింటి కష్టాలు తెచ్చి పెడుతోంటే.. కొంతమంది గ్యాస్ సరఫరా డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గ్యాస్ కొరతను బూచిగా చూపుతూ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసిన 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 45 రోజులకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి ధర గృహ వినియోగానికి అవసరమయ్యే ఒక్కో సిలిండర్ సాధారణ ధర రూ.900 ఉంటే.. ప్రస్తుతం అవసరాన్ని బట్టి రూ.2,000ల నుంచి రూ.2,500లకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.3,500కు పైగా పలుకుతోంది. అధిక ధరలైనా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా డీలర్లు బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొన్ని ఏజెన్సీలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చిన్నపాటి హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వంటివి నిర్వహించే చిరు వ్యాపారులపై వంట గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్ద హోటళ్లు, కేఫ్‌లు 1.20 లక్షలు ఉంటాయి. వీటిపై సుమారుగా 3 లక్షలకు పైగా శ్రామికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు మూసివేశారు. మరికొన్ని హోటళ్లు కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నాయి. వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయంతోనే బతుకుబండి లాగుతుంటారు. ప్రస్తుతం గ్యాస్ లభించకపోవడం, దొరికినా.. అధిక ధర వెచ్చించాల్సి వస్తుండటంతో ఆహార పదార్థాల ధరలను ఆ మేరకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వ్యాపారాలు ఆపేస్తే పస్తులు ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు చెల్లించే వారికి గ్యాస్ క్షణాల్లో ప్రత్యక్షం అవుతోంది. సాధారణ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం రోజుల సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్‌లు పెట్టుకుని బ్లాక్‌లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొందరు అధికారులు గ్యాస్ బ్లాక్ దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫారసుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్‌లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. దొంగ బుకింగ్‌లు వినియోగదారుల పేరుతో అక్రమంగా బుకింగ్‌లు చేసి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్‌లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో గ్యాస్ సరఫరా దారులు అడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.23 రోజులుగా అవస్థలు జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉండగా.. 18.32 లక్షల జనాభా ఉంది. 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. 8.67 లక్షల వివిధ రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 23 రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా బుకింగ్‌లు ఇప్పటికే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అధికారుల గణాంకాల మేరకు సాధారణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు 11,500 గ్యాస్ సిలిండర్లు బుక్ అవుతాయి. యుద్ధం ఆందోళనల నేపథ్యంలో రోజుకు 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు సగటున రూ.1,000 అధికంగా వసూలు చేస్తున్నారని భావించినా.. రోజుకు రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు అడ్వాన్స్‌గా బుక్ చేసి పెట్టుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ క్షణాల్లో ముగిసేది. ప్రస్తుం సర్వర్లు బిజీగా మారిపోవడంతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గ్యాస్ బుకింగ్ టైమ్‌లో మార్పు.. కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియాలో ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్‌పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.వైరల్ వార్తల్లో ఏముంది?గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్‌కు అయితే 35 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.కేంద్రం, ఐవోసీఎల్ వివరణఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్లతో సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Reports claiming changes in LPG refill booking timelines are incorrect. There is no change in the existing timelines (25 days in urban areas / 45 days in rural areas), and LPG supplies remain adequate across the country. Please rely only on official sources and avoid panic…— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 25, 2026 -
గ్యాస్ కొన్ని జ్ఞాపకాలు
‘ఇంట్లో బోర్ కొడితేబయట తినొచ్చు’ అనేవారు. ఇప్పుడు బయట తినడానికి దొరికేలా లేదు. కొన్నాళ్ల తర్వాత ఇంటి పరిస్థితీ తెలియదు. ఏమంటే యుద్ధం వల్ల గ్యాస్ లేదు. కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్ దాటి గ్యాస్ వచ్చాక అది ఇంటి ఊపిరిగా మారింది. ఇప్పటి తరానికి తెలియదు గాని గ్యాస్ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకు.‘వాళ్లు గ్యాస్ కొనుక్కున్నారట’... 1980లలో ఇది చిన్న ఊళ్లలో పెద్ద వార్త. గ్యాస్ కొనుక్కోవడం అంటే ఆడవాళ్లకు అతి పెద్ద రిలీఫ్ ఏమిటంటే– అది ఎప్పుడు పడితే అప్పుడు వెలుగుతుంది. వాన వచ్చినా, చలి ఉన్నా, అర్ధరాత్రయినా, తెల్లవారుజామున కానీ... ఎప్పుడైనా సరే... టప్.. వెలుగుతుంది. ఆడవాళ్లు ఈ వింతను చూడటానికి ఆ గ్యాస్ కొనుక్కున్న వారి ఇంటికి వెళ్లేవారు. అప్పటివరకూ వాళ్లకు కట్టెల పొయ్యి తెలుసు. కట్టెలు తెచ్చుకుని, పొయ్యిలో పెట్టుకుని, వాటిని కిరోసిన్ వేసి ముట్టించి, బాగా మండే వరకు ఆగి... ఆ తర్వాత ఊదుడు గొట్టంతో ఊది ఊది... ఇన్ని చేస్తే గాని వంట పూర్తి కాదు.ఇక కిరోసిన్ స్టవ్ ఉంటుంది గానీ అందుకు కిరోసిన్ కావొద్దూ! వొత్తులు ఉండే స్టవ్‌ను వొత్తులు సరి చేసుకుని వెలిగించి మెల్లగా వంట మొదలెడితే ఎప్పటికో అవుతుంది. పంప్ స్టవ్ కొంచెం డేంజర్. ఇది మగవారికి సౌకర్యంగాని ఆడవాళ్లకు బెరుకే. బుజ్‌మని నీలిరంగు మంట వచ్చే ఈ స్టవ్‌లు ఆ రోజుల్లో పేలేవి. ఈ స్టవ్‌లు వాడాలంటే తరచు పిన్‌తో నొక్కి బర్నర్‌ను యాక్టివేట్ చేయాలి. అది మరో తలనొప్పి. అయినా సరే. పెద్ద టెన్షన్ ఉండేది కాదు. కట్టెలు దొరుకుతాయి. కిరోసిన్ కూడా బ్లాక్‌లో బాగానే దొరికేది. వంట చేయాలనుకోవాలేగాని చేయొచ్చు. ఆ సమయంలో ఇదిగో ఇలా గ్యాస్ ఊడిపడింది.ఎన్నో అనుమానాలుమొదట గ్యాస్ స్టవ్‌ను ఎవరూ నమ్మలేదు. సిలిండర్ పేలి చచ్చిపోతారని భయపడుతూ స్తోమత ఉన్నవారు కూడా కొనలేదు. గ్యాస్ మంట మీద వొండేది రుచిగా ఉండదని మరో అభి్ర పాయం. గ్యాస్ స్టవ్‌ను ఎలా తుడవాలి, ఎలా శుభ్రం చేయాలి తెలియదు. ఇక రెగ్యులేటర్ది పెద్ద అవస్థ. అది బిగించడం తీయడం తెలియదు. రెగ్యులేటర్ ఆన్ ఆఫ్ బటన్‌తో కూడా భయం ఉండేది. ఇక గ్యాస్ లీక్ కావడం గురించి గగ్గోలు ఉండేది. గ్యాస్ వాసన వస్తే భయపడిపోయేవారు. ఇవన్నీ ఇలా ఉండగా గ్యాస్ డీలర్లు గ్యాస్ కొనమని ప్రచారం చేసేవారు. ఆ ఎర్రరంగు సిలిండర్ ఇంటిలోకి అడుగుపెట్టింది.సిలిండర్ వొచ్చిందాసింగిల్ సిలిండర్లే చాలా ఇళ్లలో. డబుల్ సిలిండర్ ఏ కొద్దిమంది దగ్గరో ఉండేది. సిలిండర్ అవుతూ ఉండగా గ్యాస్ బుక్ చేస్తే అయిపోయిన ఎన్నో రోజులకు అది వచ్చేది. అంతవరకు మళ్లీ రకరకాల పద్ధతుల్లో వంట సాగేది. ‘గ్యాస్ దొరకడం లేదట’ అనే వార్త అప్పటినుంచి ఇప్పటి వరకూ స్త్రీలను హైరానా పెడుతూనే ఉంది. గ్యాస్ అయిపోవడం కూడా గమ్మత్తుగా జరుగుతుంది. అదెప్పుడూ తీరుబడిగా ఉన్నప్పుడు అయిపోదు. ఉదయాన్నే అందరూ హడావిడిగా బయలుదేరుతూ వంట చేసుకుని టిఫిన్లు కట్టుకుంటూ ఉండగా అయిపోతుంది. ఆ క్షణంలో ఇంట్లో రేగే కలకలం శత్రుదేశాల సరిహద్దుల వద్ద కూడా ఉండదు.కాస్త సిలిండర్ ఇస్తారాసిలిండర్ చేతుల్లోకి కుటుంబాలు వెళ్లాక ఇరుగు పొరుగు మధ్య గ్యాస్ స్నేహం ఏర్పడింది. వీరు ‘సిలిండర్ ఇచ్చేవారు’ ‘సిలిండర్ ఇవ్వనివారు’గా విభజితం అయ్యాయి. మనకు సిలిండర్ ఇచ్చేవారే క్లోజ్ఫ్రెండ్సు. గ్యాస్ ఎప్పుడైపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి స్నేహం ఒక్కటైనా లేకపోతే మనుగడ కష్టమైపోతుంది. గతంలో పోస్టుమ్యాన్ వస్తే జనానికి ఆనందం ఉండేది. ఇప్పుడు గ్యాసు బండి వీధిలోకి వస్తే సంతోషం కలుగుతోంది. బంగారం ధర, గ్యాస్ ధర... ఇవే సగటు మధ్యతరగతి మహిళకు మోదం ఖేదం కలిగించే విషయాలుగా మారాయి. 1980లలో 40 రూ పాయలున్న సిలిండర్ నేడు 930కి చేరింది. -
గ్యాస్ సరఫరాపై యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బుకింగ్స్
-
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక సిలిండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి 15 రోజుల గడువు ఉండేది. ఇకపై ఈ వ్యవధిని 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ డెలివరీకి కనీసం 21 రోజుల విరామం ఉండాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన అమలుకు గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్డేట్ చేశారు. అయితే బుకింగ్ విధానం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా భవిష్యత్తులోనూ 21 రోజుల గడువు పూర్తైన తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే విధానాన్ని అమలు చేయాలనే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఏడాదికి 15 సిలిండర్ల కొనుగోలుకు అనుమతిదేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై చమురు సంస్థలు ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. వాటి ప్రకారం ప్రతి వినియోగదారు సంవత్సరానికి గరిష్టంగా 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే పొందగలరు. అదనంగా మూడు సబ్సిడీ రహిత సిలిండర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక్క గ్యాస్ కనెక్షన్‌పై మొత్తం 15 సిలిండర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.24 గంటల్లో సిలిండర్ డెలివరీవినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుకింగ్ చేసిన తర్వాత 24 గంటలలోపు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు ఏజెన్సీలకు సూచించాయి. ఈ నిబంధన వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది.21 రోజుల తర్వాతే రెండో సిలిండర్ డెలివరీకొత్త నిబంధన ప్రకారం మొదటి సిలిండర్ అందుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ డెలివరీ ఇవ్వబడుతుంది. దీనిని ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌లో లాక్ చేశారు. అయితే సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లిపారు. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ వారం బాట్లింగ్ ప్లాంట్లు ఆదివారాల్లో కూడా పనిచేయనున్నట్లు సమాచారం.గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో భారతదేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీలు) సిలిండర్ ధరలు మార్చి 7 నుంచి రూ.60 పెరిగాయి. ఈ పెంపు ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించదు. వారికి రూ.300 సబ్సిడీ కొనసాగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో రూ.913, ముంబైలో రూ.912.50, కోల్‌కతాలో రూ.939, చెన్నైలొ రూ.928.50, బెంగళూరులో రూ.915.50, హైదరాబాద్‌లో రూ.965లుగా ఉన్నాయి. -
మరింత ఈజీ: వాట్సాప్‌లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
బంజారాహిల్స్/ హైదరాబాద్: గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడంలో వినియోగదారులకు మరింత ఉపయోగపడే రీతిలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు సులభతరం చేశాయి. ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. గతేడాది గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ ఆన్లైన్ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గ్యాస్ ఏజెన్సీ వద్ద, డీలర్‌ను సంప్రదించడం లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా ఉండేది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎలా బుక్ చేసుకోవాలి... ఇండెన్ కస్టమర్లు 7718955555కు కాల్ చేసి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అయితే 7588888824కు సందేశం పంపించవచ్చు. హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు 9222201122కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నంబర్ మరిన్ని సేవా వివరాలను కూడా అందజేస్తుంది. భారత్ కస్టమర్లు సిలిండర్లను బుక్ చేసుకోవాలంటే తమ రిజిస్టర్ మొబైల్ నుంచి 1800224344 నంబర్‌కు మెసేజ్ చేయాలి. దీని తర్వాత వినియోగదారుల బుకింగ్ అభ్యర్థనను గ్యాస్ ఏజెన్సీ అంగీకరిస్తుంది. బుకింగ్ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే వాట్సాప్ పంపాలి. మరింత సులభం.. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో గల 8 గ్యాస్ ఏజెన్సీల వినియోగదారులకు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లభించింది. సుమారు లక్ష మందికి మేలు చేకూరనుంది. వాట్సాప్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉపయోగకరం వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఎంతగానో దోహదపడుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం, వాట్సాప్ వాడుతుండటంతో ఈ ప్రక్రియ వారికి బాగా దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పలు విధానాల ద్వారా కొంత ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తేలికగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. – బి.శ్రీనివాస్, బీఎస్ ఎంటర్ప్రైజెస్ -
7718955555
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: నవంబర్ 1 నుంచి ఇండేన్ గ్యాస్ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్ ద్వారానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆయిల్ డీజీఎం (ఎల్పీజీ) ఎల్పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ల నుంచి ఎస్ఎంఎస్ లేదా ఐవీఆర్ విధానంలో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్ నంబర్లు నమోదు చేసుకోని వారు 16 అంకెల గ్యాస్ కనెక్షన్ నంబర్ నమోదు చేయడం ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. అలాగే 75888 88824 నంబర్‌కు వాట్సాప్ ద్వారా రీఫిల్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కూడా గ్యాస్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్ సేవలు పొందవచ్చన్నారు. -
వంటింట్లో సంక్షోభం..! పక్షం రోజులైనా అందని సిలిండర్
నగరంలోని సైదాబాద్ కాలనీ జయనగర్‌కు చెందిన నవీద్ ఈ నెల ఐదవ తేదీన గ్యాస్ రీఫిల్లింగ్ కోసం ఆన్లైన్లో బుక్ చేశాడు. పక్షం రోజులు దాటినా సిలిండర్ ఇంటికి డెలివరీ కాలేదు. రెండు మూడు సార్లు సంబంధిత ఏజెన్సీకి తిరిగి గగ్గొలు పెడితే కానీ బిల్లింగ్ జనరేటై ఇంటికి సిలిండర్ చేరలేదు.. ఇది ఒక్క నవీద్ సమస్యే కాదు... బుక్ చేసిన సిలిండర్ సకాలంలో ఇంటికి రాక లక్షలాది మంది నానా అవస్థలు పడుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ వంటింట్లో సంక్షోభం తలెత్తుతోంది. గ్యాస్ సమస్యలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వంట గ్యాస్ రీఫిల్లింగ్ ‘భారం’గా మారడంతో పాటు సిలిండర్ సరఫరా ఆలస్యమవుతోంది. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసి పక్షం రోజులు దాటుతున్నా.. సిలిండర్ మాత్రం అందడం లేదు. ఎల్పీజీ డీబీటీ (ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) పథకంలో అస్పష్టతతోపాటు ఆన్లైన్ మొరాయింపే ఈ సమస్యలకు కారణాలు. ఫలితంగా ఈ నెలలో గ్యాస్ సిలిండర్ల సరఫరా గందరగోళంగా తయారైంది. మరోవైపు చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ కోటా కూడా తగ్గింది. దీంతో సింగిల్ సిలిండర్ వినియోగదారుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే ఆన్లైన్ మొరాయింపు ఇబ్బందులకు గురిచేస్తుండగా తాజాగా ఎల్పీజీ డీలర్ల సమ్మె పిలుపు మరింత బెంబేలెత్తిస్తోంది. మరోవైపు ఎల్పీజీని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నా.. లేకున్నా గ్యాస్ రీఫిల్లింగ్ ధర మాత్రం తలకు మించిన భారంగా తయారైంది. సబ్సిడీ నగదు బ్యాంక్‌లో పడినా, పడకున్నా వినియోగదారులు రూ.1024.50 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మొత్తం భారం భరించలేక ఇంటికి వచ్చిన సిలిండర్లను పలువురు వెనక్కి పంపిస్తున్నారు. ఫలితంగా బిల్లు రద్దు కావడంతో తిరిగి ఆన్లైన్లో గ్యాస్‌బుకింగ్ తప్పడం లేదు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరాల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోయినా చీటికీ మాటికీ ఆన్లైన్ మొరాయింపు, డబుల్ బుకింగ్ బిల్లింగ్ జనరేట్ అవడంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెండింగ్‌లో... గ్రేటర్లో పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం వినియోగంలో 25.38 లక్షలకు పైగా ఎల్పీజీ విని యోగదారులు ఉన్నారు. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీల కు చెందిన 135 డీలర్ల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. ప్రతి ఆయిల్ కంపెనీకి ఆన్లైన్ ద్వారా రోజుకు సగటున 50 వేల వరకు రీఫిల్లింగ్ కోసం కాల్స్ బుక్ అవుతుంటాయి. ఇందులో ప్రతినిత్యం 70 నుంచి 80 శాతం వరకు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ధరాభారం కారణంగా 20 నుంచి 30 శాతం పైగా సిలిండర్లు వెనక్కి రావడంతో జనరేట్ అయి న బిల్లింగ్ రద్దవుతున్నాయి. తిరిగి ఆన్లైన్లో బుకింగ్ కారణంగా ఆయిల్ కంపెనీల వద్ద కాల్స్ జాబితా పెరిగిపోతోంది. ఫలితంగా తాజా పరిస్థితి ప్రకారం సుమారు నాలుగు లక్షల కాల్స్ పెండింగులో ఉన్నాయి. కిరోసిన్ ధరలు భగ్గు సరఫరా తగినంత లేక సింగిల్ సిలిండర్లు ఉన్న వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. గ్యాస్ లేక జనం కిరోసిన్ కోసం వెంపర్లాడుతున్నారు. పైగా ప్రభుత్వం తెల్లకార్డులపై పేదలకు సరఫరా చేసే కిరోసిన్‌ను 4 లీటర్ల నుంచి లీటర్‌కు తగ్గించింది. దాంతో వాటి ధరలు కొద్ది రోజులుగా డీజిల్‌తో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా పాత నగరంలో కిరోసిన్ లీటర్ రూ. 45-55 మధ్య పలుకుతోంది. సిలిండర్ సరఫరాకు 10 రోజులు సిలిండర్ బుక్ చేసిన 10 రోజులకు వస్తుంది. దీంతో కిరోసిన్‌పై ఆధారపడాల్సి వస్తుంది. బుక్ చేసిన 3 రోజులకే సిలిండర్ సరఫరా అని ప్రకటనలు చేస్తున్నా అమలు కావటం లేదు. దీని అసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నారు. - సంపత్, విద్యార్థి మెసేజ్‌లే వస్తున్నాయి... గ్యాస్ బుక్ చేసిన వారం రోజుల తరువాత సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయే తప్ప సిలిండర్ మాత్రం రావడం లేదు. ఒక్కోసారి సిలిండర్ ఫలానా సమయంలో డెలివరి చేస్తున్నట్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ రోజంతా ఎదురు చూసినా సిలిండర్ రావడం లేదు. - మల్లేష్, బౌద్దనగర్ 30 శాతం సిలిండర్లు వెనక్కి వస్తున్నాయి గ్యాస్ కొరత లేదు. కానీ ఈ నెలలో 30 శాతం వరకు సిలిండర్లు వెనక్కి వచ్చాయి. వినియోగదారులు రూ. 1024.50 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడానికి భయపడి వెనక్కి పంపిస్తున్నారు. వారి బిల్లు రద్దయినా తర్వాత మళ్లీ బుక్ చేస్తున్నారు. దీంతో ఆన్లైన్ బుకింగ్‌పై ప్రభావం పడి సరఫరా అలస్యం అవుతోంది. - అశోక్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డీలర్ల సంఘం, గ్రేటర్ హైదరాబాద్ సబ్సిడీ డబ్బు జమ కావటం లేదు ఒక్క సిలిండర్‌కు రూ. 1040 చెల్లించినప్పటికి రెండు నెలలు గడుస్తున్నా సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. ఏజెన్సీ వారిని సంప్రదిస్తే సంబంధం లేదని బదులిస్తున్నారు. సరఫరాలో జాప్యం చేస్తూ బుకింగ్ లేని వారికి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. - శంకర్, ప్రైవేటు ఉద్యోగి


