gas price hike
-
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎక్కడ.. ఎంత?
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల ధోరణులకు అనుగుణంగా నెలవారీ సవరణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధరను రూ. 6.5 పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలియజేశారు.రేట్ల సవరణ తర్వాత కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1,646, ముంబైలో రూ.1,605, కోల్‌కతాలో రూ.1,764.50, చెన్నైలో రూ.1,817, హైదరాబాద్‌లో రూ.1,872 గా ఉంది. నాలుగు నెలలుగా వరుస తగ్గింపుల తర్వాత ఈ నెలలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచారు. చివరిసారిగా జూలై 1న రూ. 30 మేర ధర తగ్గింది. నాలుగు నెలల్లో మొత్తంగా రూ.148 తగ్గింది. స్థానిక పన్నులకు అనుగుణంగా వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే, గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ ధర మాత్రం రూ.803 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ఇంధనం, సగటు ధర, విదేశీ మారక విలువ ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక!
క్యాలెండర్లో పేజీ ఎప్పుడు మారుతుందా? ఆశగా ఎదురుచూస్తాడు మధ్యతరగతి వ్యక్తి. నెలంతా కష్టపడి పనిచేసినందుకు గానూ ప్రతిఫలం దక్కేది ఆరోజే కాబట్టి. తీరా జీతం వచ్చాక ఖర్చైపోయిందంటూ నిట్టూరుస్తూ యథావిధిగా తన పనిలో నిమగ్నమైపోతాడు. అయితే, ప్రతి నెలా చోటుచేసుకునే కొన్ని మార్పులు మన జేబుపై ప్రభావం చూపేవి అయితే.. మరికొన్ని ఊరట కల్పిస్తాయి. అలా నవంబర్ 1 నుంచి కొన్ని మార్పులు రానున్నాయి. దీపావళికి ముందే వచ్చే కొన్ని మార్పులు సామాన్యుడికి తీపిని పంచేనా..? చేదు గుళికను అందిస్తాయా? చూసేయండి. గ్యాస్ ధరలు : చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్), పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) ధరల పెంపు, తగ్గుదలపై ప్రకటన చేస్తాయి. ఈ-చలాన్ : నేషనల్ ఇన్ఫ్రమెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ప్రకారం.. వ్యాపార లావాదేవీల విలువ రూ.100 కోట్లుంటే తప్పని సరిగా ఈ-పోర్టల్‌లో రానున్న 30 రోజుల్లోపు జీఎస్టీ చలాన్‌ను అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ల్యాప్‌ట్యాప్‌లపై ఆంక్షలు : ఆగస్ట్ 3న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా ఆయా సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే 7 రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆంక్షలు విధించింది. హెచ్ఎస్ఎన్ 8741 విభాగం కింద ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్లెట్స్లు ఉన్నాయి. కేంద్రం విధించిన ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పైన పేర్కొన్న 7 రకాల ఉత్పత్తులపై వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారికే పరిమిత సంఖ్యలో దిగుమతులు ఉంటాయని పేర్కొంది ల్యాప్స్డ్ ఎల్ఐసీ పాలసీలు : ఎల్ఐసీ 67వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లు కంపెనీ తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెప్టెంబరు 1 నుంచి విలువైన పాలసీదార్ల కోసం నిలిచిపోయిన (ల్యాప్స్డ్) పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎవరైతే ఏళ్ల కేళ్లు ప్రీమియం చెల్లించకుండా వదిలేస్తారో.. వాళ్లు ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునే అవకాశాన్ని అక్టోబర్ 31వరకు కల్పిచ్చింది. ఆ గడువు నేటితో ముగియనున్న తరుణంలో ఖాతా దారులు తమ పాలసీలను పునరుద్ధరించుకోవాలని ఎల్ఐసీ అధికారులు చెబుతున్నారు. లావాదేవీలపై అదనపు ఛార్జీలు: అక్టోబర్ 20న బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ (బీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది.స్టాక్ మార్కెట్లోని ఈక్విటీ డెరివేటివ్‌లపై నిర్వహించే లావాదేవీలపై విధించే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. -
సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను చమురు కంపెనీలు రూ.188కి పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం రూ.8.50కి తగ్గించాయి. సామాన్యులకు ధరాఘాతం ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా..మరోవైపు పెరిగిపోతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.50కి పెంచాయి. దీంతో జులై 2021 నుంచి ఇవాళ్టితో మొత్తం 8సార్లు గ్యాస్ ధరల్ని పెంచినట్లైంది. ఇదిలా ఉండగా, జూలైలో కమర్షియల్ సిలిండర్ల ధరల్ని రెండోసారి తగ్గించింది. అంతకుముందు జూలై 1న 19 కిలోల ఎల్పిజి సిలిండర్‌ను రూ.198 తగ్గించారు. సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది ఈ జూన్ నెలలో కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 16 నుంచి గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అంటే గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450 ఉండగా.. దాని పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించాలి. కాగా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, సోషల్ మీడియాలో మీమ్స్ మంట!
ఉప్పు నుంచి పప్పు దాకా..పెట్రోల్ నుంచి నిత్యవసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని బూచీగా చూపిస్తూ ఉత్పత్తి దారులు అన్నీ రకాల వస్తుల ధరల్ని పెంచడంతో..ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఇవేం సరిపోవన్నట్లు గ్యాస్ కంపెనీలు సైతం గ్యాస్ ధరల్ని పెంచి సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపించాయి. దీంతో పెరిగిన ధరలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టైల్లో మీమ్స్ వేస్తున్నారు. ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గురువారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.50పైసలు పెరగ్గా..కమర్షియల్ గ్యాస్ ధర రూ.8 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన సిలిండర్ ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవ్వాళ పెరిగిన ధరలతో ఢిల్లీలో 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,003, కోల్ కతాలో 1,029.50, ముంబైలో రూ.1,003, చెన్నైలో రూ.1,019 ఉంది 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,254, కోల్‌కతాలో రూ.2,453, ముంబైలో రూ.2,305, చెన్నైలో రూ.2,507గా ఉంది. విమర్శల వెల్లువ పెరిగిన గ్యాస్ ధరలపై నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్ ధరలు మధ్య తరగతి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. The price of domestic LPG cylinders is hiked by Rs. 3.50 & commercial cylinders by Rs 8. In Delhi, LPG used to cost Rs 414/cylinder in May 2014 under UPA & it now costs Rs 1003. Even when inflation is at its highest in decades, the BJP govt has no mercy on the people of India! — Dr. Shama Mohamed (@drshamamohd) May 19, 2022 అప్పుడు రూ.414..ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ రూ.8 పెరగడంపై కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి శర్మ డాక్టర్ షామా మొహమ్మద్ కేంద్రంపై మండిపడ్డారు. మే 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే గ్యాస్ ధర రూ.414 ఉంటే.. ఇప్పుడు రూ.1,003 ఉందని ట్వీట్ చేశారు. Domestic LPG cylinder is 1003rs today. Petrol Price is 113rs / ltr ACHE DIN Dear Indians, Open your eyes before it's too late.#LPGPriceHike#PetrolDieselPrice #GasCylinder pic.twitter.com/UeF4xYkVEd — Taj (@Taj_Taju1) May 19, 2022 LPG gas cylinder is the Mahesh Babu of commodities, hence proved🤭#LPG #lpgpricehike #MaheshBabu pic.twitter.com/JKFK7Sc1Lw — TejalTweets (@TweetsTejal) May 11, 2022 -
LPG cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలతో సామాన్యుడు ఆందోళనకు గురవుతుంటే గ్యాస్ బండ రూపంలో మరోసారి షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే (May 1st) మే ఒకటవ తేదీన కూడా సిలిండర్ ధరలను సవరించాయి. ఈ క్రమంలో సామాన్యులకు, వ్యాపారులకు మరోసారి షాకిచ్చాయి. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర (19 కేజీలు) రూ.102.5 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2355.5కి చేరింది. అంతకు మందు రూ. 2,253 ఉంది. కాగా, ఏప్రిల్ 1వ తేదీన 19 కేజీల సిలిండర్ ధరను ఒకేసారి రూ.250 పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,002గా కొనసాగుతోంది. కాగా, చిన్న గ్యాస్ సిలిండర్ (5కేజీలు) ధర రూ. 655గా కొనసాగుతోంది. ఇక పెరిగిన ధరల ప్రకారం.. - హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,563 - విశాఖపట్టణంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2, 413. - విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,501కి చేరుకుంది. The price of a 19-kg commercial LPG cylinder has been hiked to Rs 2355.50 from Rs 2253; a 5kg LPG cylinder is priced at Rs 655 now. — ANI (@ANI) May 1, 2022 ఇది కూడా చదవండి: కరోనా నష్టాలు పూడ్చుకోవడానికి పన్నెండేళ్లు: ఆర్బీఐ -
భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..తగ్గనున్న వినియోగం..!
న్యూఢిల్లీ: అధిక ధరల నేపథ్యంలో భారత్ గ్యాస్ వినియోగంలో వృద్ధి తగ్గనుందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) గ్యాస్ వినియోగ వృద్ధి 5 శాతానికి పరిమితం అవుతుందని వివరించింది. ఇంతక్రితం ఈ అంచనా 7 శాతం. దేశీయ గ్యాస్ ధరలలో ఇటీవలి పెరుగుదల అధిక ఎన్ఎన్జీ రేట్ల వంటి అంశాలు వినియోగదారుల ధోరణిలో మార్పును తీసుకువస్తాయని, పర్యావరణ అనుకూల ఇంధనం వైపునకు వారు దృష్టి సారించేలా చేస్తాయని నివేదిక అభిప్రాయపడింది. దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరను రెట్టింపు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు కొత్త రేట్లు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం .. ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు రికార్డు స్థాయిలో యూనిట్‌కు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) 6.10 డాలర్ల స్థాయికి పెరిగింది. ఏప్రిల్‌కు ముందు ఇది 2.90 డాలర్లుగా ఉండేది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర (యూనిట్‌కు) 6.13 డాలర్ల నుంచి 9.92 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు ఎగిసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలను సవరిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫిచ్ రేటింగ్స్ తాజా నివేదిక ఇచ్చింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. దేశీయ గ్యాస్ ధరలు, అధిక ఎల్ఎన్జీ ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో సహజ వాయువు వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధికి పరిమితమవుతుందని మేము భావిస్తున్నాము (2021–22లో ఈ వినియోగ అంచనా 6.5 శాతం). ఇది క్రితం అంచనా 7 శాతంకన్నా తక్కువ. దేశీయ గ్యాస్ ఉత్పత్తి ప్రస్తుత వినియోగంలో దాదాపు సగం ఉంది. మిగిలినది ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి అవుతోంది. ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ గెయిల్ (ఇండియా)కు తన సహజ వాయువు మార్కెటింగ్ సెగ్మెంట్ నుండి వచ్చే ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో స్పాట్ ఎల్ఎన్జీ ధరలు (అమెరికా నుండి దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఎల్ఎన్జీ ధర కంటే అధికంగా) భారీగా పెరగడం దీనికి కారణం. అయితే అధిక ఎల్ఎన్జీ ధరలు భారతదేశంలో గ్యాస్ వినియోగ వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయి. 2021–22, 2022–23లో బలమైన లాభదాయకత గెయిల్ వాటాదారుల రాబడుల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది. అయితే గెయిల్ ఆర్థిక క్రెడిట్ ప్రొఫైల్ ’బీబీబీ’కి అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నాం. ఏడాది ఏప్రిల్‌లో రూ. 1,080 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు గెయిల్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ నష్టాలు భర్తీ... కాగా, ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) పెట్రోలు, డీజిల్ ధరల్లో పెరుగుదల ఉన్నప్పటికీ మార్కెటింగ్ నష్టాలను చవిచూడవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. అయితే బలమైన రిఫైనింగ్ మార్జిన్లు, భారీ ఇన్వెంటరీ లాభాలు ఈ నష్టాలను భర్తీ చేస్తాయని ఫిచ్ అంచనావేసింది. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు దాదాపు 27 డాలర్లు (లీటరకు రూ.13) పెరిగినప్పటికీ, సంబంధిత మూడు ఇంధన రిటైలర్లు నవంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య రికార్డు స్థాయిలో 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చకుండా యథాతథంగా కొనసాగించిన విషయాన్ని ఫిచ్ తాజా నివేదిక ప్రస్తావించింది. మూడు కంపెనీలు మార్చి 22 నుండి 16 రోజుల పాటు లీటరుకు రూ. 10 చొప్పున పెంచాయి. దేశీయ మార్జిన్లు ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ప్రైవేట్ ఇంధన రిటైలర్లు ఎగుమతులను మెరుగైన మార్జిన్లతో పెంచుకుంటారని భావిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. భారతదేశం డీజిల్ ఎగుమతి ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో 2021 ఇదే కాలంతో పోల్చితే 12 శాతం పెరిగింది. చదవండి: అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..! -
వినూత్న నిరసన.. ఇళ్ల ముందు 31న డప్పులు కొడుతూ బెల్స్ మోగించండి..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడి తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ తీరును ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ పార్టీ పోరుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దశల వారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పెరుగుతున్న ధరలకు నిరసనగా.. మార్చి 31వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రజలందరూ తమ ఇళ్లు ముందు, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు ముందు పెట్టుకొని, డప్పులు కొడుతూ బెల్స్ మోగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సూర్జేవాలా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో లీటరు పెట్రోల్ ధర రూ.29లు, డీజిల్ ధర రూ.28.58లు పెంచారని స్సష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.3.20 పెంచారని మండిపడ్డారు. మరోవైపు.. ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 531శాతం, పెట్రోల్‌పై 203 శాతం పెంచినట్టు ఆరోపించారు. -
రాయితీ పెంచినా తప్పని భారం..!
సాక్షి, నల్లగొండ : వంటగ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను అనుసరించి ఇంధన కంపెనీలు వంటగ్యాస్ ధరలు పెంచాయి. దీంతో సామాన్యుడిపై గ్యాస్ ధర భారం పడింది. కంపెనీలు పెంచిన ధరలకు అనుగుణంగా పేదలపై భారం పడకుండా సిలిండర్లకు ఇచ్చే రాయితీని కూడా కేంద్రం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దఝెత్తున ఊరట కలిగినా భారం మాత్రం కొద్ది మొత్తంలో తప్పడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ.6.50 భారం పడనుంది. ప్రతి నెలా జిల్లాలో రూ.6లక్షలపైగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 1,56,200 రెగ్యులర్, 40వేల దీపం కనెక్షన్లు ఉన్నాయి. ఇండేన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 31 మండలాల పరిధిలో 33 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతోంది. అయితే రోజూ 4,140 సిలిండర్ల వరకు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. భారీగా పెంచిన సిలిండర్ ధర... ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.788 ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.206 రాయితీ కల్పిస్తూ లబ్ధిదారుని అకౌంట్లో ఆ మొత్తం జమచేస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ వినియోగదారుడికి రూ.582కి అందుతుంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు సిలిండర్ దరను పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.148.50 పెంచాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.936.50కి చేరింది. అయితే ఇందులో ప్రభుత్వం సబ్సిడీని రూ.348కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుడికి కాస్త ఊరట ఓ పక్క ఇంధన కంపెనీలు సిలిండర్ ధర పెంచగా ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా రాయితీని కూడా పెంచింది. దీంతో కంపెనీలు పెంచిన ధర మొత్తం వినియోగదారులపై పడడం లేదు. కేవలం రూ.6.50 అదనంగా పెరిగిన ధరతో చెల్లించాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి నెలా జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.6 లక్షల పైచిలుకు భారం పడనుంది. జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఈ స్వల్ప భారం తప్పడం లేదు. -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర
ఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. సుమారు రూ.4.50 పెరగటంతో ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ ధర రూ.495.69 కాగా, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.742 అయింది. సరాసరి పెట్రోలియం ధర, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేట్‌ను బట్టి నెలవారీగా పెట్రోలియం మంత్రిత్వశాఖ గ్యాస్ ధరలను నిర్ణయిస్తోంది. ఈ మేరకు గత మే 30వ తేదీ నుంచి నెలకు రూ.4 చొప్పున 19 సార్లు పెరిగి సిలిండర్‌పై రూ.76.51 వరకు చేరుకుంది. దేశంలో సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులు 18.11 కోట్ల మంది, ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన కింద ఏడాదిలో ఇచ్చిన మూడు కోట్ల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లతోపాటు సబ్సిడీయేతర వంటగ్యాస్ వినియోగదారులు 2.66 కోట్ల మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వినియోగదారుడు 14.2కిలోల గ్యాస్ సిలిండర్లను ఏడాదిలో 12వరకు సబ్సిడీపై వాడుకునే వీలుంటుంది. ఆ తర్వాత వాడుకోవాలంటే మాత్రం సబ్సిడీ వర్తించదు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ నిబంధనలు కూడా ఉండవు. వంటగ్యాస్‌కు సబ్సిడీయే ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. -
ప్రజలపై మోయలేని భారం
మొయినాబాద్, న్యూస్‌లైన్: ప్రజలపై భారాలు మోపడమే ప్రభుత్వాల పనిగా మారిందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్, చేవెళ్ల నియోజకవర్గం సమన్వయకర్త రాచమల్ల సిద్ధేశ్వర్ అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసరాల ధరలతోపాటు అన్ని రకాల చార్జీల పెంచి ప్రజలపై భారం మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు గ్యాస్ ధరను పెంచి నడ్డివిరుస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం, అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 2008లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర రూ.50 పెంచితే ఆ భారం ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.మహేందర్‌రెడ్డి, మండల కన్వీనర్ ముదిగొండ రాజయ్య, మహిళా కన్వీనర్ పుష్పలత, నాయకులు బాల్‌రాజ్, జొన్నాడ రాజు, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. సోనియా దిష్టిబొమ్మ దహనం... ఇబ్రహీంపట్నం: పెంచిన వంటగ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను ద హనం చేశారు. అనంతరం శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని, సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారని అన్నారు. బ్యాంకుల్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా జమ కావడం లేదన్నారు. సీఎం కిరణ్‌కు ప్రజల గురించి ఏమాత్రం పట్టడం లేదని, పదవి కాపాడుకోవడంతోనే ఆయనకు సరిపోయిందని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృత ం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముత్యాల మధుసూదన్‌రెడ్డి, నాయిని సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు సాయిబాబా, జంగయ్యగౌడ్, నల్ల ప్రభాకర్, ముత్యాల శ్రీహరి, దార నర్సింహ, ప్రశాంత్, సుధీర్‌రెడ్డి, జమీర్, ఎస్కే పాషా, చెనమోని రాజు, బి.కృష్ణారెడ్డి, నదీం, సంతోష్, శోభ, సుగుణమ్మ, సుజాత, బాల్‌రాజు, హరిగౌడ్, దర్శన్‌గౌడ్, లక్ష్మణ్, శ్రీకాంత్, భాస్కర్ నాయక్, జయరాజ్ పాల్గొన్నారు. ధరలు తగ్గించే వరకూ పోరాటం... దిల్సుఖ్నగర్: నిత్యవసర, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. సరూర్‌నగర్ డివిజన్ కొత్తపేట చౌరస్తాలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదవాడి నడ్డివిరిచిందన్నారు. పెంచిన ధరలపై ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని నిలదీ యాల్సిందిపోయి చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ధరలను తగ్గించేవరకు వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలను త గ్గించకపోతే భారీ ఎత్తున ఆం దోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి, నల్లెంకి ధన్రాజ్గౌడ్, డక్యార్‌నాయక్, గట్ల రవీంద్ర, రమేష్‌నేత, గాలయ్య, శ్రీనివాస్, యాదగిరిగౌడ్, రఫీ, సుదర్శన్, రమేష్‌గౌడ్, కృష్ణగౌడ్, తాజుద్దీన్, సూర్యపాల్, ఖదీర్, ఖలీల్, సంతోష్, చంటి, సూరి పాల్గొన్నారు. -
పాల ‘పిడుగు’
కొత్త ఏడాదిలో గ్యాస్ ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, పాల ధర పెంచుతూ సహకార సంఘాలు పాల ధరను పెంచేశాయి. లీటరు పాలకు రెండు నుంచి నాలుగు రూపాయల వరకు పెంచేసి విక్రయించడం గమనార్హం. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధరల పిడుగును ఎలా తట్టుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా విని యోగదారులకు పాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆవిన్ ద్వారా సరఫరా సాగుతోంది. సహకార సంఘాలు పాడి రైతుల నుంచి పాలను సేకరించి ఆవిన్‌కు అందజేస్తాయి. కొందరు రైతులు తమ పాల దిగుబడిని శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసుకుని క్యాన్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తుంటారు. గత ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు ఆవుపాలు లీటరు 21కే అమ్మారు. జనవరి 1వ తేదీ నుంచి లీటరుకు 2, 3, మరికొన్ని చోట్ల 4లు పెంచి అమ్మారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఆవుపాలు లీటరు 23 నుంచి 25 వరకు అమ్ముతున్నారు. పాలసేకరణ ధరను పెంచాలని రాష్ట్రంలోని పాడిరైతులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి కోరికమేరకు ప్రభుత్వం ఇటీవలే పాలసేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుపై 3 పెంచింది. సేకరణ ధరను పెంచినా వినియోగదారులపై ఆ (కొనుగోలు)భారం మోపబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం పెంచిన ధర ఎంత మాత్రం సరిపోదంటూ రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తిని నిలిపివేసి ఫిబ్రవరి మూడో వారం నుంచి ఆందోళనకు పూనుకుంటామని పిలుపునిచ్చారు. తిరువారూరు జిల్లా మన్నార్‌కుడిలో పాల అమ్మకందారుల సంఘాలున్నాయి. వీరు ఇల్లిల్లూ తిరిగి పాలను సేకరించి మన్నార్‌కుడిలోని పాలశీతల కేంద్రంలో నిల్వ చేసుకుంటారు. ఆ తరువాత పాలను క్యాన్లలో పెట్టుకుని వినియగదారులకు సరఫరా చేస్తారు. వీరంతా వినియోగదారులకు హెచ్చుధరకు పాలు సరఫరా చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం పెంచిన పాల ధర తమకు ఎంతమాత్రం గిట్టుబాటు కాదని పాడి రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పాలను అమ్మితే పాల సొసైటీలను ఎంతమాత్రం నడుపలేమని చెప్పారు. దీంతో పాల ధరను పెంచక తప్పలేదని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా పాలధర పెంపుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేకరణ ధరను పెంచినా అమ్మకం ధరను పెంచబోమని సీఎం ఇచ్చిన హామీకి విరుద్ధంగా పాలను హెచ్చు ధరకు అమ్మడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఏమాత్రం ముందు ప్రకటనలు లేకుండా పెంచిన ధరను వెంటనే అమలు చేయడంపై మండిపడుతున్నారు.