మొయినాబాద్, న్యూస్‌లైన్: ప్రజలపై భారాలు మోపడమే ప్రభుత్వాల పనిగా మారిందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్, చేవెళ్ల నియోజకవర్గం సమన్వయకర్త రాచమల్ల సిద్ధేశ్వర్ అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసరాల ధరలతోపాటు అన్ని రకాల చార్జీల పెంచి ప్రజలపై భారం మోపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు గ్యాస్ ధరను పెంచి నడ్డివిరుస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం, అధికార పక్షంతో కుమ్మక్కై ప్రజలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. 2008లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర రూ.50 పెంచితే ఆ భారం ప్రజలపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు డి.మహేందర్‌రెడ్డి, మండల కన్వీనర్ ముదిగొండ రాజయ్య, మహిళా కన్వీనర్ పుష్పలత, నాయకులు బాల్‌రాజ్, జొన్నాడ రాజు, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
సోనియా దిష్టిబొమ్మ దహనం...
ఇబ్రహీంపట్నం: పెంచిన వంటగ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఈసీ శేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మను ద హనం చేశారు. అనంతరం శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని, సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారని అన్నారు. బ్యాంకుల్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా జమ కావడం లేదన్నారు. సీఎం కిరణ్‌కు ప్రజల గురించి ఏమాత్రం పట్టడం లేదని, పదవి కాపాడుకోవడంతోనే ఆయనకు సరిపోయిందని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృత ం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ముత్యాల మధుసూదన్‌రెడ్డి, నాయిని సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకులు సాయిబాబా, జంగయ్యగౌడ్, నల్ల ప్రభాకర్, ముత్యాల శ్రీహరి, దార నర్సింహ, ప్రశాంత్, సుధీర్‌రెడ్డి, జమీర్, ఎస్‌కే పాషా, చెనమోని రాజు, బి.కృష్ణారెడ్డి, నదీం, సంతోష్, శోభ, సుగుణమ్మ, సుజాత, బాల్‌రాజు, హరిగౌడ్, దర్శన్‌గౌడ్, లక్ష్మణ్, శ్రీకాంత్, భాస్కర్ నాయక్, జయరాజ్ పాల్గొన్నారు.
ధరలు తగ్గించే వరకూ పోరాటం...
దిల్‌సుఖ్‌నగర్: నిత్యవసర, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయకర్త దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. సరూర్‌నగర్ డివిజన్ కొత్తపేట చౌరస్తాలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా దేప భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదవాడి నడ్డివిరిచిందన్నారు. పెంచిన ధరలపై ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని నిలదీ యాల్సిందిపోయి చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ధరలను తగ్గించేవరకు వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలను త గ్గించకపోతే భారీ ఎత్తున ఆం దోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి, నల్లెంకి ధన్‌రాజ్‌గౌడ్, డక్యార్‌నాయక్, గట్ల రవీంద్ర, రమేష్‌నేత, గాలయ్య, శ్రీనివాస్, యాదగిరిగౌడ్, రఫీ, సుదర్శన్, రమేష్‌గౌడ్, కృష్ణగౌడ్, తాజుద్దీన్, సూర్యపాల్, ఖదీర్, ఖలీల్, సంతోష్, చంటి, సూరి పాల్గొన్నారు.
ప్రజలపై మోయలేని భారం
Published Sat, Jan 4 2014 12:04 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement