పెట్రోల్ బంకులు మూసివేత
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: తూనికలు, కొలతల అధికారుల దాడుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం మూసివేశారు. హైదరాబాద్‌లో, శివార్లలో అధికారులు పెట్రోల్ బంకులపై దాడులు జరుపుతున్నట్లు సమాచారం అందగానే ఇబ్రహీంపట్నంలో బంకులను బందుచేశారు.
పెట్రోల్ బంకుల్లో తప్పుడు మీటర్లతో వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. సాధారణంగా బంద్‌లు, ఆందోళనల సందర్భంగా మూసివేసే పెట్రోల్ బంకులను ఊహించని విధంగా మూసివేయడంతో ఇబ్రహీంపట్నంలో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. పెట్రోల్ దొరక్క ఇబ్బందులుపడ్డారు.