పెట్రోల్ బంకులు మూసివేత | Gas Stations closure due to Weights, measures attacks on officials | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంకులు మూసివేత

Published Sun, Mar 2 2014 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Gas Stations closure due to Weights, measures attacks on officials

ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్:  తూనికలు, కొలతల అధికారుల దాడుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని పెట్రోల్ బంకులను ఆదివారం సాయంత్రం మూసివేశారు. హైదరాబాద్‌లో, శివార్లలో అధికారులు పెట్రోల్ బంకులపై దాడులు జరుపుతున్నట్లు సమాచారం అందగానే ఇబ్రహీంపట్నంలో బంకులను బందుచేశారు.

పెట్రోల్ బంకుల్లో తప్పుడు మీటర్లతో వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఇటీవల ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. సాధారణంగా బంద్‌లు, ఆందోళనల సందర్భంగా మూసివేసే పెట్రోల్ బంకులను ఊహించని విధంగా మూసివేయడంతో ఇబ్రహీంపట్నంలో వాహనదారులు అయోమయానికి గురయ్యారు. పెట్రోల్ దొరక్క ఇబ్బందులుపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement