gas sylender
-
వంట గ్యాస్‌పై సబ్సిడీనా? నగదు బదిలీనా?
హైదరాబాద్: గత కొనేళ్లుగా వంటింట్లో మంట పుట్టిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపుపై పార్టీల ఎన్నికల హామీలు ఊరట కలిగిస్తున్నా.. దాని చెల్లింపు మాత్రం ఎప్పటి మాదిరిగానే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు గుదిబండగా కానుందా? అంటే అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం చమురు సంస్థలు తమ అధీకృత డీలర్ల ద్వారా డోర్‌డెలివరీ చేస్తున్న 14.5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.955 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ. 40.71కు పరిమితం చేసి నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమచేస్తోంది. తాజాగా ప్రధాన రాజకీయ పక్షాలు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వంట గ్యాస్ ధర సగానికి సగం ధర తగ్గింపు ప్రకటించడం పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నప్పటికీ చెల్లింపు విధానంపై స్పష్టత లేకుండా పోయింది. మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ.400కు అందిస్తామని బీఆర్ఎస్, తాము అధికారంలోకి వస్తే సిలిండర్ రూ. 500 అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. వంట గ్యాస్ ధర ౖపైపెకి... గత నాలుగేళ్లలో వంట గ్యాస్ ధర ఏకంగా 56 శాతం పెరిగింది. 2019లో రూ.706.50గా ఉండేది. ఆ తర్వాత 2020లో రూ.744కు పెంచారు. 2021లో రూ.809, 2022లో 949.50కి చేరింది. 2023 మార్చి నాటికి సిలిండర్ ధర రూ.1,155కి పెరిగింది. సరిగ్గా పదేళ్ల క్రితం సబ్సిడీపై రూ.414కు వంట గ్యాస్ ధర వచ్చేది. క్రమంగా ధర పై పైకి ఎగబాగింది. వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం వర్తింపుచేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం రూ.697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65లను నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా... సబ్సిడీ మాత్రం రూ.40.71కు పరిమితమైంది. సబ్సిడీపైనే సరఫరా చేయాలి గత పదేళ్ల క్రితం మాదిరిగా వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ధర పై మాత్రమే సరఫరా చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. మార్కెట్‌ధర పై కాకుండా సబ్సిడీ ధర వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిలిండర్ధర తగ్గించి నగదు బదిలీ పద్ధతి వర్తింప జేస్తే ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడం తలకు మించిన భారం అవుతుందని పలు పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
సిలిండర్ లో నీళ్లు.. ఆందోళనకు దిగిన బాధితులు
-
గ్యాస్ సిలిండర్ల లోడు లారీ బోల్తా
గుంటూరు, ఇబ్రహీంపట్నం (మైలవరం) : రోడ్డుపై వెళ్తున్న బైకును తప్పించబోయి గ్యాస్ సిలిండర్ల లోడు లారీ బోల్తాకొట్టింది. కొండపల్లి ఎర్రకట్ట బ్రిడ్జి వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కంచకచర్లకు చెందిన రాజ్యలక్ష్మీదేవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన లారీ ఖాళీ గ్యాస్ బండల లోడుతో కొండపల్లిలోని హెచ్‌పీ గ్యాస్ కంపెనీకి వెళ్తోంది. కొండపల్లి ఎర్రకట్ట వద్దకు చేరుకునే సమయానికి జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన శివకృష్ణ తన బైకుపై ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నాడు. రెండు లారీల మధ్యకు వచ్చిన బైక్‌ను తప్పించబోయి గ్యాస్ బండల లోడు లారీ అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న శివకృష్ణకు, లారీ డ్రైవర్ రామకృష్ణకు స్వల్ప గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది ఇరువురిని ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీకి తరలించారు. గ్యాస్ బండలు ఖాళీవి కావటంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
కాపాడబోయి కాలిపోయాడు
షాబాద్(చేవెళ్ల) : ఇంట్లో వంటచేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన షాబాద్ మండలంలోని నాందార్‌ఖాన్‌పేట్ గ్రామంలో చోట్టు చేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని నాందార్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన గంగాపురం లక్ష్మీనారాయణగౌడ్(35) గురువారం ఉదయం ఇంట్లో అతడి భార్య లావణ్య, తల్లి అమృతమ్మలు గ్యాస్ పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు రావడంతో వారిద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. ఇది గయనించిన లక్ష్మీనారాయణగౌడ్ వారిని కాపాడేందుకు ప్రయత్నించగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో మంటల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్య లావణ్య, తల్లి అమృతమ్మలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారితో పాటు లక్ష్మీనారాయణగౌడ్ కుమారుడు త్రీశూల్కు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు చేవెళ్ల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలార్పారు. సంఘటన స్ధలాన్ని పరిశీలించిన చేవెళ్ల ఏసీపీ స్వామి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీం సిబ్బంది సంఘటన స్ధలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి సోదరుడు సురేష్‌గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్ధలానికి చేరుకున్న ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి... గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి నగరం నుంచి వెంటనే నాందార్ఖాన్పేట్కు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడున్న గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నెంటూరి రవీందర్‌రెడ్డి మృతుని ఇంటి వద్దకు వచ్చి ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట వివిధ పార్టీల నాయకులు నర్సింహారెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. -
విధి వక్రించి.. కళ తప్పింది
పశ్చిమ గోదావరి, భీమవరం టౌన్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన ఆనందం.. డిగ్రీలో చేరాలన్న ఉత్సాహంతో ఉన్న ఆ విద్యార్థినిని విధి చిన్నచూపు చూసింది. సోడా గ్యాస్ సిలిండర్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఇల్లు, కళాశాల తప్ప మరో లోకం తెలియని ఆ విద్యార్థిని గత ఐదు రోజులుగా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. స్థానిక వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో ఈనెల సోడా గ్యాస్ సిలిండర్ లీకై ఒత్తిడితో ఇంటి గోడను పగలగొట్టుకుని లోపలికి దూసుకువెళ్లిన ఘటనలో విద్యార్థిని చిట్టినీడి సూర్యకళ తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకళ ఆరోగ్య పరిస్థితిని ఈ ప్రాంత వాసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కోసం అందరి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. తల్లి నాగలక్ష్మి ఇడ్లీ అమ్ముతూ, తండ్రి వెంకట శివకుమార్ కాయకష్టం చేసుకుంటూ తమ ఇద్దరు ఆడపిల్లలు సూర్యకళ, లక్ష్మీ సాయిదుర్గను చదివిస్తున్నారు. సూర్యకళ ఇంటర్ పాసై డిగ్రీలో చేరేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. డిగ్రీ పాసై చిన్న ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న ఆమెను విధి ప్రమాదంలోకి నెట్టేసింది. ప్రమాదం నుంచి సూర్యకళ చెల్లెలు లక్ష్మీ సాయిదుర్గ అదృష్టవశాత్తూ త్రుటిలో తప్పించుకోగలిగింది. టీవీ చూస్తూ చెల్లెలితో పై చదువుల గురించి చర్చించుకుంటున్న సంతోష సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఇద్దరు ఆడపిల్లలూ చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉన్న తమ పెద్దకుమార్తెను చూసి దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతున్నారు. మనసున్న మారాజులు తమవంతు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరికొందరు విరాళాలు సేకరించి ఇస్తున్నారు. ప్రమాదంలో సూర్యకళ నడుము కింది భాగం బాగా దెబ్బతినడంతో వైద్యం నిమిత్తం రూ.10 లక్షలుపైనే వ్యయమవుతుందని తెలుస్తోంది. దెబ్బతిన్న భాగంలో తొలి ఆపరేషన్‌కు వైద్యులు ఎంతో శ్రమించారు. మానవతా దృక్పథంతో వైద్యులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో సూర్యకళకు నయం చేసేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వైద్యానికి పెద్ద మొత్తం అవసరం కావడంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితే ఆ నిరుపేద కుటుంబానికి కొంత ఊరడింపు కలుగుతుంది. సహాయం చేయాలనుకునే వారి కోసం... బాధితురాలి తల్లి చిట్టినీడి నాగలక్ష్మి బ్యాంకు అకౌంట్ నంబర్ 004610100038569 ఆంధ్రా బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్: ANDB0000046 బాధితురాలి బాబాయ్ జనార్దన్ ఫోన్ నంబర్లు 9177733995 7799024033 -
పేలిన సిలిండర్.. తప్పని ప్రమాదం
రంగారెడ్డి (ఘట్కేసర్): రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ఓ ఇంట్లో గ్యాస్ సిలీండర్ పేలింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఘట్కేసర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన మామిళ్ల సురేశ్ ఇంట్లో గురువారం రాత్రి గ్యాస్ సిలీండర్ పేలింది. అయితే ఈ ఘటనలో ఏలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.