Gattu rama chandra rao
-
'వైఎస్సార్ సీపీ గెలుపు జగద్విదితం'
-
సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ ఖాయం
ఆచంట, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమాంధ్రలో కింగ్‌గా తెలంగాణలో కింగ్ మేకర్‌గా పాత్ర పోషించనున్నారని చెప్పారు. ఆదివారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో 140 ఎమ్మెల్యే సీట్లతో పాటు, 25 ఎంపీ స్థానాలలో విజయం సాధించబోతుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోడీ అనే పువ్వును తీసుకువచ్చి సీమాంధ్ర ప్రజల చెవిలో పెట్టాలని చూస్తున్నారని, అది కూడా ప్రజలు గమనించారన్నారు. వారి పప్పులు ఉడకకపోవడంతో పవన్ కల్యాణ్ అనే జోకర్‌ను తీసుకొచ్చారని రామచంద్రరావు విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరు, పవన్ అన్నదమ్ములిద్దరూ రూ.70 కోట్లకు పార్టీని అమ్మేసుకున్న ఘనులని ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పేరుతో తన సామాజిక వర్గాన్ని వారు వారు ముంచేశారన్నారు. వైఎస్సార్ సీపీ సీమాంధ్రలో కాపులకు 32 ఎమ్మెల్యే టికెట్లతో పాటు, ఆరు ఎంపీ స్థానాలు కేటాయించి సముచిత స్థానం కల్పించిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు కౌరు సర్వేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు మామిడిశెట్టి కృష్ణవేణి, జిల్లా కార్యకర్గ సభ్యుడు వైట్ల కిషోర్‌కుమార్, నెక్కంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ మానసిక రోగి: గట్టు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ రియల్ సైకోలు అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ... బాలకృష్ణకు టికెట్ ఇవ్వడంతో బాబు సైకాలజీ బయటపడింది అని అన్నారు. బాలకృష్ణ సైకో ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబం, ఆస్పత్రి వర్గాలే నిర్ధారించాయన్నారు. మానసిక రోగి అయిన బాలకృష్ణకు టికెట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని గట్టు రామచంద్రరావు అన్నారు. -
తెలంగాణలో అధికారం వైఎస్సార్ సీపీదే
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ బీసీ సెల్ ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల కోఅర్డినేటర్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ బీసీ విభాగం క న్వీనర్‌గా జాక్సన్‌ను నియమిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ర్ట బీసీ విభా గం కన్వీనర్ గట్టు రామచంద్రారావు నియామకపత్రాన్ని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం వైఎస్సార్‌సీపీతోనే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం చేసే సత్తా కేవలం వైఎస్సార్సీపీకే ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాడు రెండు పూటలా తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మహానేత వైఎస్సార్ ప్రజల మధ్య లేకున్నా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో గడపగడపకు వెళ్లి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ బీసీ విభాగం డివిజన్ కన్వీనర్ జాక్సన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. -
రెండూ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి: వైఎస్సార్సీపీ
* కాంగ్రెస్, బీజేపీలపై వైఎస్సార్సీపీ ధ్వజం * కాంగ్రెస్‌తో కుమ్మక్కు అవసరమేంటో బీజేపీ చెప్పాలి * కేవలం 23 నిమిషాల్లో రాష్ట్ర భవితవ్యం తేల్చేయడం కంటే ఘోరం ఉంటుందా? సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. రాష్ట్ర భవితవ్యంపై పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చిందో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఈ నలుగురూ దుష్ట చతుష్టయంగా ఏర్పడి దుర్మార్గపూరితంగా వ్యవహరించి తెలుగుజాతిని నిట్టనిలువుగా చీల్చారని మండిపడింది. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్‌రావు, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో టీ-బిల్లు ఆమోదించిన తీరును వారు ఎండగట్టారు. పార్లమెంట్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి, డాన్ మాదిరిగా చీకట్లో సభా కార్యకలాపాలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష నిదర్శనమైన పార్లమెంటులోనే దిక్కులేకపోతే ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజులకన్నా క్రూరంగా వ్యవహరించి దేశ పరువు తీశారని ధ్వజమెత్తారు. వారు ఇంకా ఏమన్నారంటే.. అధికారం చేతిలో ఉంది కదా అని కాంగ్రెస్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఎందుకు నిలువరించలేదు? పార్లమెంటులో చర్చ జరగాలని, ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని తదితర డిమాండ్లు చేసిన బీజేపీ ఎందుకు మౌనం దాల్చింది? కాంగ్రెస్‌తో ఎందుకు జతకట్టింది? ఈ విషయంలో బీజేపీ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే తెలుగుప్రజలను దారుణంగా వంచించింది. తెలుగుప్రజల వల్లే కేంద్రంలో అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్‌కు ఏపీ పట్ల కృతజ్ఞతాభావం లేకపోగా.. బీజేపీతో విందు రాజకీయాలు చేసి నిట్టనిలువునా చీల్చింది. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ భవితవ్యంపై పార్లమెంటులో కేవలం 23 నిమిషాల్లోనే ముగిస్తారా? ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? గడిచిన ఆరునెలలుగా మా అధినేత జగన్మోహన్రెడ్డి అన్ని రాష్ట్రాలు తిరిగి పార్టీల మద్దతు కూడగట్టడం వల్లే లోక్‌సభలో సీపీఎం, ఏఐడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన 100 మందికిపైగా సభ్యులు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. అయితే వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఒక్కటై రాష్ట్రాన్ని చీల్చాయి. తలా ఒక చెయ్యి వేసి... విభజనకు కారకులైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలుగు ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెబుతారు.