Gauri Puja
-
పెళ్లిలో గౌరి పూజ ఎందుకు? ఏ సరస్వతినో, లక్ష్మీ దేవినో పూజించొచ్చు కదా!
వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు. ఈ ఆచారం ఇంచుమించు భారతదేశమంతటా ఉంది. శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతనినే వివాహము చేసుకోదలచిన రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అయితే గౌరీపూజ ఎందుకు చేయాలి? లక్ష్మీదేవినో, సరస్వతినో పూజించవచ్చు కదా? ఈ ప్రశ్నకు శ్రీ కంచి పరమాచార్యుల వారు ఇచ్చిన వివరణ!.. దాని సారాంశం ఏంటో చూద్దామా!. అన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించినప్పుడే.. లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న మహాప్రభువు. ఆయనతో కాపురం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతుంది. మరి శివుడు అలా కాదే అయన స్మశానవాసి. పాములు మెడలో వేసుకుంటాడు. చేతిలో కపాలం ధరిస్తాడు. చూడడానికి మహ భయంకరంగా ఉంటాఢు. ఇంత బూడిద తప్ప అయనకు ఐశ్వర్యమేముంది కనుక? ఆయనతో కాపురం చేయడం మాటలు కాదు. అందుకు ఎంతో ఓపిక ఉండాలి. ఎన్నో అవమానాలు దిగమింగాలి. ఇంకోవైపు అసంతృప్తి చిహ్నలు కనిపించకూడదు, చిరునవ్వు చెరగకూడదు. ఇది ఎప్ఫుడు సాధ్యమవుతుంది? వీటన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించి, ఆరాధించినప్పుడే. వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఎందరో అడపిల్లల అనుభవం చూడండి. పెళ్ళంటే అంతవరకు పరిచయం లేని కొత్త వ్యక్తి తాను కలగన్న రాకుమారుడు కాకపోవచ్చు. తాను కోరుకున్నంత సంపన్నడు కాకపోవచ్చు. కానీ, తన జీవితం అతనితో ముడిపడిపోయింది. అందుకే వివాహాలు స్వర్గంలో నిర్ణయమవుతాయని సామెత. నిజానికి ఈసూత్రం మన దేశానికీ, మన వివాహ వ్యవస్థకే కాదు ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. భర్త పట్ల భార్యకీ, భార్య పట్ల భర్తకి ఉన్న ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది. అందుకు అదర్శం సతీదేవి. కన్నతండ్రి దక్షుడు, తన భర్త రూపురేఖలను, దరిద్రాన్ని ఎత్తి చూపించి దూషించినప్పుడు భరించలేక సతీదేవిగా అగ్నిప్రవేశం చేసింది. అందుకు ప్రధాన కారణం మమేకభావమే. అందుకే ఈ గౌరి పూజ.. అటువంటి గౌరీదేవిని గుర్తు చేసుకుంటే వైవాహిక జీవితంలో కలతలు రావు. సంసారం స్వర్గతుల్యం అవుతుంది. పెళ్లికి ముందు ఆడపిల్లల చేత గౌరీపూజ చేయించడం అందుకే. ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి, సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన.. విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా ఆడ పెళ్ళి వారు వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వానిస్తారు. నాయనా! నా కుమార్తెను భార్యగా స్వీకరించి.. వరపూజలోనే ఇరువైపువారు ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం, సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం కోసం కన్యను వరించడానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లండి" అని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. (చదవండి: మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!) -
పెళ్లిలో గౌరీపూజ ఎందుకు?
• ఒక నిమిషం – ఒక విశేషం పెళ్లిళ్లలో గౌరీపూజ ప్రధాన క్రతువు. ఇంతకూ గౌరీపూజ ఎందుకు చేస్తారో తెలుసా? గౌరి అంటే గౌరవర్ణం కలది అని అర్థం. తెలుపు, ఎరుపు, పసుపు, బంగారం, కుంకుమపువ్వు వర్ణాలు కలగలసిన తల్లి గౌరి. నల్లగా ఉన్న పార్వతీదేవిని కాళి అని పరిహసించాడు పరమేశ్వరుడు. ఆ పరిహాసానికి ఆత్మాభిమానం దెబ్బతిని, స్వామివారిని వీడి, భూలోకానికి వచ్చి, తపస్సు చేసి, తన రంగును మార్చుకుని, శివుణ్ణి మెప్పించి వివాహమాడింది. అంటే భర్త తిరస్కరించినా, అదేవిధంగా పార్వతీదేవి మాంగల్యబలం చాలా గొప్పది. తన మాంగల్యబలం మీదున్న నమ్మకంతోటే తన పతి దేవుడు క్షీరసాగర మథనంలో వెలువడిన కాలకూట విషాన్ని ఉండగా చేసుకుని, మింగుతున్నా, వారించలేదు. ఆ నమ్మకం వమ్ముకాలేదు. బ్రహ్మవిష్ణువులు కూడా సాహసించని విషాన్ని మింగినా గరళకంఠుడు, విషకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకు ఏమీ కాలేదు. ఆ మాంగల్యబలం ఉండాలనే వివాహానికి ముందు కన్నెపిల్లల చేత గౌరీపూజ చేయిస్తారు. కాబోయే దంపతులు ఆదిదంపతులైన గౌరీశంకరుల ఆశీర్వాదాలతో ఆదిదంపతుల్లా నిలిచి ఉండాలన్న ఆకాంక్షతో. వాస్తు ఎందుకు? మన శరీరం పాంచభౌతికమైనది. అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది. మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి. ఇంటి వాస్తు సక్రమంగా ఉంటే, పంచభూతాలు తమ అనుకూల ప్రకంపనలతో ఇంటిని నందనవనం చేస్తాయి. గృహనిర్మాణ సమయం లోనే వాస్తు సూత్రాలను పాటిస్తే తర్వాత ఇబ్బందులు ఉండవు. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటిలో ఉండే వారిమీదే ఉంటుంది. ఆ ఇంటి యజమాని వేరొక నగరంలో ఉన్నా, ఇతర దేశాలలో ఉన్నా, ఆ ప్రభావం వారి మీద దాదాపు ఉండదని, కాకపోతే అదే ఊరిలో వారికి ఇల్లు ఉండి, వేరొకచోట అద్దెకు ఉంటే వారి మీద సొంత ఇంటి వాస్తుప్రభావం 20 శాతం వరకు ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఒక్క ఇంటివాస్తే కాకుండా, ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా ఆ ఇంటిమీద ఉంటుందని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. • సూక్తులు... సుభాషితాలు శాంతి, సౌఖ్యం నీలోనే ఉన్నాయి! ప్రపంచంలో మతానికి సంబంధించిన సిద్ధాంతాలు, శాస్త్రాలు అనేకం ఉన్నా, జాగ్రత్తగా పరిశీలిస్తే, ఉన్నది ఒక్క మతమే అన్న సంగతి బోధపడుతుంది. ఉన్నతమైన వ్యక్తిత్వం, మానసిక పరిశుద్ధత, భగవంతుని యెడల ప్రేమ, సత్యాన్ని చేరుకోవాలనే తపన ఈ ఒక్కమతంలో ఇమిడి ఉంది. ఎంత ఎక్కువగా నీవు భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తావో, అంత తక్కువగా నీవు అతణ్ణి అర్థం చేసుకుంటావు. జీవిత లక్ష్యం భగవంతుడిని ప్రేమించడం. జీవిత గమ్యం భగవంతుడిలో ఐక్యమవటం. భగవంతుడినుంచి ఏదో ఆశించి భగవంతుడిని ప్రేమించటం, నిజంగా అతణ్ణి ప్రేమించటం కాదు. భగవంతుడి నుండి నీవు ఏదో ఆశించి, నీవు దేనినో త్యాగం చేయడం ఎలా ఉంటుందంటే, గుడ్డివాడు చూపుకోసం తన కళ్లను త్యాగం చేయటంలా ఉంటుంది. శాంతి, సౌఖ్యం పోరాటం వలన సిద్ధించేవి కావు. తనలోనే వాటిని వెతకవలసి ఉంది. ఈ సత్యాన్ని ఎప్పుడయితే తెలుసు కుంటారో, అప్పుడే పోరాటాన్ని వదిలి, ప్రశాంతంగా ఉండగలరు. – అవతార్ మెహర్ బాబా -
యాగక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
-
నేటి నుంచే మహాయాగం
-
నేటి నుంచే మహాయాగం
* ఎర్రవల్లిలో ఉదయం 7.45 గంటలకు అయుత చండీయాగానికి శ్రీకారం * సర్వాంగ సుందరంగా ముస్తాబైన యాగ క్షేత్రం * శృంగేరీ పండితులతోపాటు 2 వేల మంది బ్రాహ్మణుల రాక * సీఎం దంపతులతో గౌరీపూజ చేయించిన వేద పండితులు * నేడు యాగానికి హాజరుకానున్న గవర్నర్ దంపతులు * ప్రతి నిత్యం 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా * ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్/జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం నేటి నుంచి ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 7.45 గంటలకు ప్రారంభం కానున్న ఈ మహా క్రతువు ఆదివారం వరకు అయిదు రోజుల పాటు సాగనుంది. ఇందుకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు మంగళవారం యాగశాలకు చేరుకున్నారు. వారందరికీ సీఎం దంపతులు దీక్షావస్త్రాలు, సామగ్రి అందజేశారు. 12 మంది రుత్వికులకు పాదాభివందనం చేసి వస్త్ర ప్రదానం చేశారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ సరిపడేలా అమ్మవారి పసుపు కుంకుమ, ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణగా వెళ్లి యాగాన్ని వీక్షేంచేలా యాగశాల చుట్టూరా బారికేడ్లతో మార్గాన్ని నిర్మించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ సీఎం స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అయుత చండీ మహాయాగానికి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి తన ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. శృంగేరీ జగద్గురు మహా సంస్థానం పండితుల ఆధ్వర్యంలోనే యాగం నిర్వహించేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈ యాగానికి నరహరి సుబ్రహ్మణ్య భట్టు ప్రధాన ఆచార్యులుగా, తంగిరాల శివకుమార శర్మను వాచకులుగా పంపించారు. మహారుద్ర యాగానికి ఆచార్యులుగా పురాణం మహేశ్వరశర్మ, యాగ పర్యవేక్షకులుగా శివసుబ్రహ్మణ్య అవధాని, గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్‌శర్మ వ్యవహరిస్తున్నారు. యాగంలో 1,100 మంది రుత్వికులు ఏకకంఠంతో పారాయణాలు చదవనున్నారు. మరో 400 మంది రుత్వికులు వారికి సహాయం చేయనున్నారు. గౌరీపూజతో యాగానికి అంకురార్పణ చండీయాగం అంకురార్పణలో భాగంగా మంగళవారం యాగస్థలిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభ గౌరీ పూజ చేశారు. ఉదయం 7.30 గంటలకు యాగస్థలికి చేరుకున్న వీరితో శృంగేరీ పండితులు పూజ చేయించారు. త్రైలోక్యమోహనగౌరి హోమం, గురు ప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదకశాంతి, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, సాయంకాలం పూట ఆచార్యాది రుత్విగ్వరణం, దుర్గాదీప నమస్కార పూజ, రక్షాసుదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చండీయాగ పనులను పరిశీలించారు. గౌరీపూజలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. నేడు ప్రముఖుల రాక అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగే పూజల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పాల్గొంటారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ దంపతులు ఎర్రవల్లికి బయల్దేరుతారు. 8.30కు యాగశాలకు చేరుకుంటారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం 24న కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, 25న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగ ర్రావు, 26న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. బందోబస్తుపై సమీక్ష ఐజీ మహేష్‌భగవత్, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మంగళవారం యాగస్థలి ముఖద్వారం వద్ద పోలీ సు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వీవీఐపీ, వీఐపీల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌తో చర్చించారు. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఐజీ నవీన్‌చంద్ బందోబస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బలగాలకు అవగాహన కల్పించారు. చండీయాగంలో నేటి పూజలిలవీ.. జగదేవ్‌పూర్: యాగంలో తొలిరోజు బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి గురుప్రార్థన, గణపతి పూజ, గోపూజ, మహామంటప స్థాపనం, చండీ యంత్రలేఖనం, యంత్ర ప్రతిష్ఠ, దేవతా అవాహనం, ప్రాణప్రతిష్ఠ, నవావరణార్చన, ఏకాదశన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం, పంచబలి, యోగినీబలి, మహారుద్రయాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పురశ్ఛరణ చతుర్వేదయాగ ప్రారంభం, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, మంత్రపుష్పం, విశేష నమస్కారములు, కుమారి సువాసిని, దంపతి పూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణం ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు ధార్మిక ప్రవచనం, సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్ఛరణం, విశేషపూజ ఆశ్లేషబలి, అష్టావధాన సేవ నిర్వహిస్తారు. రాత్రి శ్రీరామలీల హరికథ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. చండీయాగానికి ప్రత్యేక బస్సులు సాక్షి, సంగారెడ్డి: అయుత చండీయాగానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యాగం జరిగే ఐదు రోజులపాటు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. మంగళవారం ఆర్టీసీ మెదక్ రీజియన్ ఆర్ఎం వేణు.. గౌరారం, ప్రజ్ఞాపూర్ స్టేజీల ను పరిశీలించడంతో పాటు యాగశాల వర కు బస్సు సర్వీసులను నడపటానికి వీలుగా అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు నడిపేందు కు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. రెండు నిమిషాలకో బస్సు * హైదరాబాద్ జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌కు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు. * హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రజ్ఞాపూర్ లేదా గౌరారం వద్ద బస్సు దిగాల్సి ఉంటుంది. * ప్రజ్ఞాపూర్/గౌరారం నుంచి భక్తులను యాగశాల వరకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. * ప్రజ్ఞాపూర్/గౌరారం నుంచి యాగశాల వరకు మూడు బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. * గౌరారం, ప్రజ్ఞాపూర్ వద్ద ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.