కేధార్నాథ్లో మరో 68 మృతదేహలు లభ్యం
ఈ ఏడాది జూన్లో కేధార్నాథ్లో సంభవించిన వరదల వల్ల మరణించిన వారిలో మరో 68 మంది మృతదేహలను కనుగొన్నట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆర్ ఎస్ మీనా శనివారం ఇక్కడ వెల్లడించారు. అయా మృతదేహలను గౌరికుంద్, గౌర్చ్చట్టీ సరిహద్దు పరిసర ప్రాంత్రాల్లో కనుగొన్నట్లు చెప్పారు. కాగా మృతదేహలను వారివారి సంప్రదాయల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. అయితే మృతుల డీఎన్ఏ సేకరించి భద్రపరిచినట్లు పేర్కొన్నారు.
అలాగే మృతులకు సంబంధించిన నగలను కూడా భద్రపరిచామన్నారు. కేధార్నాథ్లో మరిన్ని మృతదేహాల ఆచూకీ లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసినట్లు వివరించారు. అయితే గత రెండు రోజులు క్రితం మృతదేహాల గాలింపు చర్యల్లో భాగంగా 64 మృతదేహాలను కనుగొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత రెండు సార్లుగా మృతదేహాల గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆ క్రమంలో 200 మందికి పైగా మృతదేహలు లభ్యమైనాయన్నారు. దాంతో ఆ నాటి నుంచి నేటి వరకు 1000కు పైగా మృతదేహలను కనుగొన్నామన్నారు. ఈ ఏడాది జూన్ మాసం మధ్యలో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరద వెల్లువ ముంచెత్తింది. దాంతో కేధార్నాథ్ పరిసర ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయయి. అంతేకాకుండా భక్తులు, పర్యాటకులు వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే.