Gautam Navalakha
-
Elgar Parishad case: నవ్లఖా గృహ నిర్బంధం
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన గౌతమ్ నవ్‌లఖాను అధికారులు శనివారం ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదల చేశారు. వెంటనే నవీముంబైలోని బెలాపూర్– అగ్రోలీ ప్రాంతంలోని ఓ భవనంలోకి మార్చారు. అక్కడే నెల రోజులపాటు ఆయన గృహ నిర్బంధంలో ఉంటారు. నవ్‌లఖాను గృహ నిర్బంధంలో ఉంచొద్దన్న ఎన్ఐఏ అర్జీని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల్లోగా గృహ నిర్బంధంలోకి తరలించాల్సిందేనంటూ ఆదేశించడం తెలిసిందే. -
నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్లుగా జైలులో గడుపుతున్న ఎల్గార్ పరిషత్–మావో సంబంధాల కేసులో నిందితుడు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రూ.2.4 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. గృహ నిర్బంధంపై 14 షరతులు విధించింది. 70 ఏళ్ల నవ్లఖా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా గృహ నిర్భంధానికి అనుమతిస్తున్నామని తెలిపింది. ఈ ఆదేశాలు తాత్కాలికమని నెల రోజుల తర్వాత సమీక్షిస్తామంటూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. గృహనిర్భంధానికి అనుమతి ఇవ్వాలన్న నవ్లఖా పిటిషన్‌ను గురువారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల సుప్రీం ధర్మాసనం విచారించింది. ‘నిందితుడు 2020 నుంచి కస్టడీలో ఉన్నారు. గతంలో గృహనిర్బంధం దుర్వినియోగం చేసిన ఫిర్యాదులేవీ లేవు. ఈ కేసు మినహా మరో నేరపూరిత ఆరోపణలు లేవు. అందుకే హౌస్అరెస్ట్కు అనుమతినిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీల ఏర్పాటు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నిఘా తదితరాల ఖర్చు మొత్తం నవ్లఖా భరించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులు.. ► పోలీసుల సమక్షంలో వారిచ్చిన ఫోన్ నుంచి రోజుకు 10 నిమిషాలు మాట్లాడొచ్చు. ► సహచరుడి ఇంటర్నెట్లేని ఫోన్ వాడొచ్చు. ఎస్ఎంఎస్లు, కాల్స్‌కు అనుమతి. వాటిని డిలీట్ చేయకూడదు. ముంబై వదిలి వెళ్లొద్దు. ► గరిష్టంగా ఇద్దరు కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి 3 గంటల పాటు సందర్శించొచ్చు. ► కేబుల్ టీవీ చూడొచ్చు. కేసులో సాక్షులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దు. -
కోరెగావ్ కేసులో స్టాన్ స్వామి అరెస్ట్
ముంబై: భీమా కోరెగావ్ హింసకు సంబంధిం చి మానవ హక్కుల నేతలు గౌతమ్ నవ్లఖా, 82 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి సహా 8 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వారు కుట్ర పన్నినట్లు అందులో ఆరోపించింది. ఇందులో మావోయిస్టులతో పాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందని పేర్కొంది. ఫాదర్ స్టాన్ స్వామి సహా ఆ 8 మంది సమాజంలో శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తున్నారని 10 వేల పేజీల చార్జిషీట్లో ఎన్ఐఏ వెల్లడించింది. గౌతమ్ నవ్ల ఖాకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయంది. వీరంతా వ్యవస్థీకృత మావోయిస్టు నెట్‌వర్క్‌లో భాగమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మావోలకు చేరవేసేవారని తమ దర్యాప్తులో తేలిం దని స్పష్టం చేసింది. స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఫాదర్ స్టాన్ స్వామిని రాంచీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చింది. శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీ షియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఎక్కువ వయస్సున్న వ్యక్తి 82 ఏళ్ల స్టాన్ స్వామినేనని అధికారులు తెలిపారు. మిలింద్ తెల్తుంబ్డే మినహా చార్జిషీట్లో పేర్కొన్న వారందరూ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్‌షీట్ దాఖలుచేయడం ఇది మూడోసారి. తొలిసారిగా పుణె పోలీసులు 2018 డిసెంబర్లో, రెండోసారి 2019ఫిబ్రవరిలో చార్జ్షీట్లు వేశారు. తర్వాత కేంద్రప్రభుత్వం ఈ కేసును ఈ ఏడాది జనవరిలో పుణే పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీచేసింది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్ పరిషత్ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్ఐఏ పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించా రని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్ స్టాన్ స్వామి మావో కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్ స్వామి ఖండించారు. -
నవలఖ విడుదలపై సుప్రీంకు మహారాష్ట్ర
న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ(65)ను గృహనిర్బంధం నుంచి విడుదలచేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిశాంత్ కట్నేశ్వర్ బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలుచేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 167(1), (2)లను తప్పుగా అర్థం చేసుకున్న హైకోర్టు పొరపాటున నవలఖను విడుదల చేసిందని, అతని ట్రాన్సిట్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సెక్షన్ 167(1) ప్రకారం నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటే సంబంధిత పోలీస్ అధికారులు కేస్ డైరీని రూపొందించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే తమ న్యాయపరిధిలో లేని నిందితుల ట్రాన్సిట్ రిమాండ్ కోరేటప్పుడు కేస్ డైరీని సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది.