Gay character
-
సుప్రీం చరిత్రాత్మక తీర్పు : టీవీలో సంచలన షో
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందటే చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర టీవీ కూడా ఈ సంబురాల్లో పాలుపంచుకుంటోంది. బుల్లి తెరపై మొట్ట మొదటిసారి ‘గే స్వయంవరం’ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఈ షోకు హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ సవ్యసాచి సత్పతి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. సవ్యసాచి సత్పతి కోసం మంచి ‘గే వరుడు’ కావాలంటూ ఈ గే స్వయంవరం కార్యక్రమం ప్రసారం కానుంది. ‘అవును, రెండు ప్రొడక్షన్ హౌజ్‌లతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అనంతరం ఈ షో చేయాలనుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన టెలివిజన్ రియాల్టీ షోల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా ఈ గే రియాల్టీ స్వయంవరం షో చరిత్ర సృష్టిస్తుంది’ అని సవ్యసాచి అన్నారు. బిగ్ బాస్ 11 హౌజ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సవ్యసాచి, తనకున్న హాస్య భావనతో హౌజ్ మేట్లను ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండే వాడు. కానీ బాధకరంగా అతను షోలో ఉండేందుకు తగిన ఓట్లు సంపాదించుకోలేక, హౌజ్ నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్ బాస్ 11కు ముందు, అతను ఒడిశా టెలివిజన్ ఇండస్ట్రిలో ఉండేవాడు. పలు కుకింగ్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించేవాడు. ఫెమినా మిస్ ఇండియా 2017 ఆడిషన్స్‌కు కూడా హోస్ట్‌గా ఉన్నాడు. ఇంతకుముందు వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా ‘రాఖీకీ స్వయంవర్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో తనకు తానే స్వయంవరం ప్రకటించుకుని, వచ్చిన వారిలో ఓ వరుడిని ఎంచుకుని కొద్దికాలం అతనితో ట్రావెల్ చేసింది. అలాగే ‘రాహుల్ కా స్వయంవర్’ పేరుతో కూడా ఓ టీవీ కార్యక్రమం ప్రసారమైంది. అది తీవ్ర వివాదాస్పదమైంది. వీటితో పోలిస్తే ‘సవ్యసాచి స్వయంవరం’ పూర్తిగా విరుద్ధం. సవ్యసాచి సత్పతి కోసం మంచి హైటు, వెయిటూ ఉన్న గే వరుడు కావాలంటూ కార్యక్రమం రూపొందించబోతున్నారు. భారతదేశంలో గే కల్చర్‌ను చూపిస్తూ ఇంతవరకూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందలేదు. -
గే పాత్ర వేసినా మావాళ్లు ఏమీ అనరు!
తాను సినిమాలో 'గే' పాత్రలో నటించినా.. తన కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ అనరని విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి చెప్పారు. 'అలీగఢ్' అనే సినిమాలో ఆయన శ్రీనివాస రామచంద్ర సిరస్ అనే గే ప్రొఫెసర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రొఫెసర్ మరో మగాడితో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియో బయటపడటంతో అతడు సస్పెండ్ అవుతాడు. అయితే మళ్లీ ఉద్యోగం ఎలా సాధిస్తాడు.. ఆ ప్రయత్నంలో ప్రాణాలు ఎలా కోల్పోతాడన్నదే సినిమా కథ. ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకుడు. ఇందులో రాజ్‌కుమార్ రావు జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. గే పాత్ర గురించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారని అడిగినప్పుడు.. తాను సినిమాలోనే చేస్తున్న విషయం వాళ్లందరికీ తెలుసని, అలాగే తాను సంప్రదాయ పాత్రలు పోషించనన్న విషయం కూడా తెలుసని, అలాంటప్పుడు వాళ్లకు తాను ఏ పాత్ర చేసినా సమస్య ఉండదని చెప్పారు. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లాడు అంతా ఎంతగానో ప్రేమిస్తారని, తాను చేసే పనిని కూడా వాళ్లు ప్రేమిస్తారని చెప్పారు. -
గుర్తింపు వచ్చే పాత్రలే చేస్తా!
నటుడు జోష్ రవి శివయ్య అనుగ్రహం కోసం వచ్చా! తొట్టంబేడు: నటుడిగా గుర్తింపు తెచ్చే పాత్రలే చేస్తానని సినీ నటుడు జోష్ రవి అన్నారు. జోష్ సినివూతో తనకు వుంచి నటుడిగా క్రేజ్ లభించిందని అన్నారు. శివయ్యును దర్శించుకునేందుకు ఆయన బుధవారం శ్రీకాళహస్తికి వచ్చారు. దర్శనానంతరం పట్టణంలోని తన మిత్రుడు, సి నీ నటుడు వీరభద్రాచారి ఇంట్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుుల సవూవేశంలో వూట్లాడారు. ఇప్పటివరకు 30 సినిమాల్లో పలు రకాల పాత్రల్లోనటించినట్లు చెప్పారు. మొ దటి సినివూ వుగధీర అరుునా, గుర్తింపు తెచ్చింది మాత్రం జోష్ సినివూ అన్నారు. దీంతో తన ఇంటి పేరు జోష్ రవిగా వూరిందన్నారు. ఇటీవల విడుదలైన గుండె జారి గల్లంతైందే సినిమాలో తాను చేసిన గే పాత్రకు విపరీతమైన గుర్తింపు వచ్చిందని, చిన్నదాన నీకోసంలో కూడా గే పాత్ర పోషించి వుంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. మాస్ పాత్రలే చేస్తా రెండు గే పాత్రలతో తనకు వుంచి గుర్తింపు లభించగా మళ్లీ అలాంటి పాత్రలో నటించబోనని స్పష్టం చేశారు. ప్రేక్షకులను మెప్పించే మాస్ పాత్రలే చేస్తానన్నారు. నటనలో నవరసాలు పండించి మంచి ఆర్టిస్ట్ కావాలన్నదే తన జీవిత లక్ష్యవుని అన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని, సినీరంగంలోకి అడుగుపెట్టానని, తాను హీరోగా నటించిన కాయ్ రాజా కాయ్ వచ్చే నెలలో విడుదల కాబోతుండగా హిట్ సాధించాలని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. కొత్తగా రవితేజ బెంగాల్ టైగర్ సినివూ, రామ్‌చరణ్ తేజ మైనేమ్ ఈజ్ రాజాలో నటిస్తున్నానని తెలిపారు. శివయ్యు ఆశీస్సులతో ప్రేక్షకులు తనను ఆదరించి పెద్ద నటుడ్ని చేయూలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రవుంలో సినీనటుడు సాంబ రషీద్ పాల్గొన్నారు.