GCC employees
-
హైదరాబాద్‌లో కొత్త జీసీసీ ఏర్పాటుకు ప్రణాళికలు
హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు హబ్‌గా మారుతోంది. హెల్త్ సెక్టార్లో సేవలందిస్తున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హైదరాబాద్‌లో కొత్తగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్(GCC)ను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఎలీ లిల్లీ సేవలందిస్తోంది. ఈ సంస్థ ఇప్పటికే 2016లో బెంగళూరులో జీసీసీను ఏర్పాటు చేసింది. త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించబోయే జీసీసీ ఇండియాలో రెండోది కావడం విశేషం. కొత్త జీసీసీ(Global Capability Center)ను హైదరాబాద్‌కు ఆహ్వానించడం సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్‌లో హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతోందని చెప్పారు.లిల్లీ కెపాసిటీ సెంటర్ ఇండియా (ఎల్‌సీసీఐ)గా పిలవబడే ఈ కొత్త జీసీసీ ద్వారా స్థానికంగా మరింత సాంకేతిక సేవలు అందించడంతోపాటు అంతర్జాతీయంగా కూడా ఈ సెంటర్ సేవలు ఎంతో కీలకం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఈ సెంటర్లో టెక్నాలజీ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులతో సహా సుమారు 1,000 నుంచి 1,500 మంది నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎలీ లిల్లీ(Eli Lilly) తెలిపింది. ఈ జీసీసీ 2025లోనే అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరుఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ డియోగో రావ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగ్గా మార్చాలనుకునే సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తీసుకొస్తాం’ అని చెప్పారు. కొత్త సాంకేతిక పురోగతిని ఉపయోగించుకుంటూ వినూత్న ఆవిష్కరణలతో సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి హైదరాబాద్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఎల్‌సీసీఐ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. -
వేతనాల్లో..ఐటీ కన్నా జీసీసీలే మిన్న!
విదేశీ కంపెనీలు భారత్‌లో పొలోమంటూ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు).. అదిరిపోయే వేతన ప్యాకేజీలతో టెక్ సిబ్బందిని ఆకర్షిస్తున్నాయి. భారీ విస్తరణ బాట నేపథ్యంలో టెక్ నిపుణులకు జీసీసీల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోపక్క, జీతాల విషయంలో జీసీసీలతో పోలిస్తే సంప్రదాయ ఐటీ సేవల కంపెనీలు వెనుకబడుతుండటం గమనార్హం.దేశంలో ప్రస్తుతం 1,600కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో 16.6 లక్షల మందికి పైగానే నిపుణులు పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని టెకీలతో పోలిస్తే అవే విధుల్లో పనిచేస్తున్న జీసీసీ ఉద్యోగులకు 12–20 శాతం మేర అధిక వేతనాలు లభిస్తున్నాయి. అంతేకాదు, టెక్నాలజీ యేతర కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులతో పోల్చినా కూడా జీసీసీల్లోనే భారీ వేతన ప్యాకేజీలు దక్కుతుండం విశేషం. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్–ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మిని్రస్టేషన్, డేటా మేనేజ్మెంట్–ఎనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ఎంట్రీ, మిడ్, సీనియర్ స్థాయిల్లో కూడా జీసీసీలు ప్యాకేజీల్లో ‘టాప్’లేపుతున్నాయి. మెరుగైన జీతాల నేపథ్యంలో జీసీసీల్లోకి వలసలు కూడా భారీగా పెరిగేందుకు దారితీస్తోంది. ఉదాహరణకు సాఫ్ట్వేర్ డెవలపర్, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్స్ జాబ్స్నే తీసుకుంటే, జీసీసీల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగి వార్షిక వేతనం రూ.9.7 లక్షలు కాగా, సీనియర్ లెవెల్ సిబ్బంది ప్యాకేజీ రూ.43 లక్షల్లో ఉంది. ఐటీ కంపెనీలను పరిశీలిస్తే, అవే విధులకు గాను ఎంట్రీ లెవెల్ ప్యాకేజీ రూ.5.7 లక్షల నుండి సీనియర్లకు గరిష్టంగా 17.9 లక్షలుగా ఉండడటం గమనార్హం.చిన్న నగరాల్లోనూ నిపుణులకు డిమాండ్ జీసీసీలు టెకీలకు భారీగా వేతన ప్యాకేజీలు ఇస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గురుగ్రా మ్, హైదరాబాద్, చెన్నై వంటివి ఉన్నాయి. అయితే, జైపూర్, ఇండోర్, కోయంబత్తూరు తదితర ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా జీసీసీలు, డేటా సెంటర్లు శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ డే టా సైన్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, డే టా ఇంజినీరింగ్ నిపుణులకు డిమాండ్ భారీగా ఉందని పరిశ్రమ చెబుతోంది. ‘జీసీసీలు ప్రధానంగా జెన్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాలపై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్పులకు దన్నుగా నిలవడంతో పాటు నవకల్పనల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి’ అని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్–ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. సాంప్రదాయ ఐటీ కంపెనీలతో పోలిస్తే జీసీసీల్లో 12–20 శాతం అధిక ప్యాకేజీలు, డిజిటల్ స్కిల్స్‌కు ఎంత డిమాండ్ ఉందనేదుకు నిదర్శనమని ఆమె అభిప్రాయపడ్డారు. విస్తరణ జోరు.. 2025 నాటికి జీసీసీల సంఖ్య 1900కు పెరగనుంది. సిబ్బంది 20 లక్షలను మించుతారని అంచనా. ముఖ్యంగా జెనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ), మెషిన్ లెరి్నంగ్/ఏఐ, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి విభాగాల్లో భారీగా నిపుణుల అవసరం ఉంటుందని టీమ్‌లీజ్ చెబుతోంది. గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ ప్రాధాన్యత అంతకంతకూ పెరుతుండటంతో వచ్చే 5–6 ఏళ్లలో ఏకంగా 800 కొత్త జీసీసీలు భారత్‌లో కొలువుదీరే అవకాశం ఉంది. ఇవి కేవలం మెట్రోలు, బడా నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరించే సన్నాహల్లో ఉండటం పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే టెకీలకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
విభజనపై వాయిదా పద్ధతే!
♦ గిరిజన కార్పొరేషన్ విభజనకు ఏపీ మెలిక ♦ షీలాభిడే కమిటీ నిర్దేశించినా పట్టించుకోని వైనం ♦ ఉమ్మడి ఆస్తుల పంపకానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట ♦ కొత్త పీఆర్సీ అమలుకాక నిరాశలో రాష్ట్ర ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ)ను విభజించకుండా ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. రాష్ర్ట విభజన జరిగి 17 నెలలు గడిచినా, జీసీసీ విభజనను ఎప్పటికప్పుడు వాయిదావేస్తోంది. విభజనను పూర్తిచేసి తెలంగాణకు చెందాల్సిన దానిని అప్పగించాలని షీలాభిడే కమిటీ ఏపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఈ విభజన జరిగితే వెంటనే తెలంగాణకు రూ.33 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉండటంతో, ఏవో సాకులతో విభజనను ఏపీ వాయిదా వేస్తోంది. దీంతో తెలంగాణ జీసీసీ ఉద్యోగులకు సవరించిన పీఆర్సీ అమలుకాలేదు. జీసీసీకి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది తదితర పది అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశమయ్యాయి. అయితే మూడు అంశాలు ప్రధానమైనవిగా పేర్కొంటూ తెలంగాణ జీసీసీ షీలాభిడే కమిటీ దృష్టికి తెచ్చింది. అందులో ఒకటి 2014,జూన్ 2 నాటికి రిటైరైన ఉద్యోగుల పదవీవిరమణ ప్రయోజనాలను అవశేష ఏపీ ప్రభుత్వమే చెల్లించాలి. రెండోది.. ఉమ్మడి జీసీసీలో తెలంగాణ నుంచి కొనుగోలు చేసిన రూ.3 కోట్ల విలువైన గమ్‌కరయ (తప్సిజిగురు)ను విక్రయించనందున ఆ మొత్తాన్ని 58:42 నిష్పత్తిలో తెలంగాణకు చెల్లించాలి. ఇక మూడోది, ఉమ్మడి జీసీసీ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉన్నందున గతంలో విశాఖలో కొనుగోలు చేసిన వెయ్యి గజాల ఖాళీ స్థలాన్ని 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై ఎలాంటి వివాదం లేదని షీలాభిడే ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించి విభజన పూర్తిచేయాలని గత ఆగస్టు 31న ఆదేశించింది. అయితే ఆ తర్వాత విభజనకు సంబంధించిన సమావేశాలకు ఏపీ ప్రతినిధులు హాజరుకాకుండా వాయిదాలు వేస్తున్నారు. కాగా, పదవీ విరమణ పొందిన జీసీసీ ఉద్యోగులు పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. కిందిస్థాయిలో పనిచేసిన ఉద్యోగులు తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకుని జీవనాన్ని గడపాల్సిన దుస్థితిలో ఉన్నారు. పింఛన్ కోసం హైదరాబాద్‌లోని జీసీసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.