geetha phogat
-
ఒలింపిక్ పతక విజేతలకు షాకిచ్చిన రెజ్లింగ్ సమాఖ్య!
భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, గీతా ఫొగట్ కొత్త అవతారమెత్తారు. ఏకంగా రెజ్లింగ్ లీగ్ నిర్వహించే ఏర్పాట్లలో ఉన్నారు. భారత్‌లో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్ఎల్) పేరిట పెద్ద ఎత్తున టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, అమన్ సెహ్రావత్, ప్రపంచ చాంపియన్ప్ కాంస్య పతక విజేత గీతా ఫొగట్ ఈ మేరకు లీగ్‌పై ప్రకటన చేశారు.షాకిచ్చిన భారత రెజ్లింగ్ సమాఖ్యఅయితే ‘ఆదిలోనే హంసపాదు’లా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) లీగ్‌కు మోకాలడ్డుతోంది. రెజ్లర్లు నిర్వహించాలనుకునే ఈ టోర్నీకి ఆమోదం ఇవ్వబోమని ప్రకటించింది. సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ కొన్ని నెలల క్రితం సాక్షి... బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగట్‌లతో కలిసి ఢిల్లీ రోడ్లపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బజరంగ్, వినేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినేశ్ హరియాణా అసెంబ్లీ ఎన్నికలో బరిలో కూడా నిలిచింది.రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్కానీ రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాత్రం రాజకీయాల్లో చేరలేదు. ‘చాలా రోజులుగా ఈ లీగ్ కోసం నేను, సాక్షి సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే లీగ్‌కు తుదిరూపు తీసుకొస్తాం. అంతా అనుకున్నట్లు జరిగితే అప్పుడు క్రీడాకారులు మాత్రమే నిర్వహించే తొలి లీగ్‌గా రెజ్లింగ్ లీగ్ ఘనతకెక్కుతుంది. అయితే ఇప్పటివరకు సమాఖ్యతో మాట్లాడలేదు. కానీ ప్రభుత్వం, సమాఖ్య మాకు మద్దతు ఇస్తే బాగుంటుంది. పూర్తిగా రెజ్లర్ల ప్రయోజనాల కోసమే లీగ్ నిర్వహించబోతున్నాం’ అని గీతా ఫొగట్ తెలిపింది.త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంఅదే విధంగా... ప్రపంచస్థాయి రెజ్లర్లు, కోచ్‌లు ఇందులో పాల్గొంటారని, దీని వల్ల దేశీయ రెజ్లర్లకు ఎంతో లబ్ధి చేకూరుతుందని, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లతో తలపడే అనుభవం వారికి లభిస్తుందని ఆమె చెప్పింది. ఇదివరకే కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సాక్షి మలిక్ మళ్లీ ఈ లీగ్‌తో రెజ్లింగ్‌కు దగ్గరవడం ఆనందంగా ఉందని చెప్పింది. అంకితభావం, నిబద్ధతతో లీగ్ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామని తెలిపింది. వేదికలు, ప్రైజ్‌మనీ, విధివిధానాలు తదితర అంశాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామని గీత పేర్కొంది.లీగ్‌కు గుర్తింపు లేదు కానీ డబ్ల్యూఎఫ్ఐ వాదన మరోలా ఉంది. ‘సమాఖ్య ఈ లీగ్‌కు ఆమోదం తెలపడం లేదు. మేం మూలనపడిన ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నాం. త్వరలోనే పట్టాలెక్కిస్తాం. కావాలంటే రెజ్లర్లు వారి లీగ్ నిర్వహించుకోవచ్చు. క్రీడకు ప్రాచుర్యం తేవొచ్చు. అయితే మా లీగ్ వారి లీగ్‌తో కలువదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. చదవండి: కొరియాను కొట్టేసి... ఫైనల్లో భారత్ -
రెజ్లర్ తల్లి కాబోతున్నారు..
రెజ్లర్ గీతాఫొగట్ తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్లో ప్రకటించారు. ‘‘జీవితం నీ లోపల్నుంచి వృద్ధి చెందేవరకు జీవితం అంటే ఏంటో నువ్వు గుర్తించలేవు’’ అనే కామెంట్‌కి.. కడుపు కాస్త ఉబ్బెత్తుగా ఉన్న తన ఫొటోను గీత జత చేశారు. ముప్పై ఏళ్ల ఈ హర్యానా క్రీడాకారిణి 2010 కామెన్వెల్త్ గేమ్స్ ఫ్రీ స్టెయిల్ రెజ్లింగ్‌లో భారతదేశానికి తొలి బంగారు పతకం సాధించిపెట్టారు. 2016లో గీత వివాహం అయింది. రెజ్లర్ పవన్ కుమార్ ఆమె భర్త. -
ఇక రెజ్లింగ్‌లోనూ ప్రొ లీగ్...
నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని 6 నగరాల్లో పోటీలు న్యూఢిల్లీ: ఇప్పటికే క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ లీగ్‌లను చూసిన భారత క్రీడాభిమానులకు మరో లీగ్ కనువిందు చేయనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), ప్రొ స్పోర్టీఫై సంస్థ ఆధ్వర్యంలో తాజాగా రెజ్లింగ్ క్రీడలోనూ ప్రొ లీగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని ఆరు నగరాల్లో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. భారత మేటి రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్, అనూజ్ చౌదరీ, గీత ఫోగట్, బబితా కుమారి, గీతిక జక్కర్ పలువురు మోడల్స్‌తో కలిసి ఈ ఆవిష్కరణోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విఖ్యాత పాప్ సింగర్ అపాచీ ఇండియన్ పీడబ్ల్యూఎల్ థీమ్ సాంగ్‌ను పాడగా... పలువురు రెజ్లర్లు గ్రీకు యుద్ధవీరుల వేషాధారణలో ర్యాంప్‌పైకి వచ్చారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ భారత క్రీడారంగంలో చారిత్రక క్షణం అని ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ అన్నారు. ప్రొ లీగ్ భారత రెజ్లింగ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. ►భారత్‌లోని ఆరు నగరాల్లో మూడు వారాలపాటు ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహిస్తారు. ఉత్తర భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు.. పశ్చిమ, దక్షిణ, ఈశాన్య భారత్ నుంచి ఒక్కో ఫ్రాంచైజీ ఉంటాయి. ►{పతి జట్టులో 11 మంది రెజ్లర్లు (పురుషులు-6, మహిళలు-5) ఉంటారు. ప్రతి జట్టులో ఆరుగురు భారత రెజ్లర్లు, ఐదుగురు విదేశీ రెజ్లర్లు ఉంటారు. ► మొత్తం లీగ్ ప్రైజ్‌మనీ రూ. 5 కోట్లు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్-20 మంది రెజ్లర్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు తమ అంగీకారాన్ని తెలిపారు. ► {పతి ఫ్రాంచైజీ కనీస ధర రూ. 3 కోట్లు. సె ప్టెంబరు 7లోపు ఆరు జట్లను ఖరారు చేస్తా రు. ఆగస్టు 30లోపు ఈ లీగ్ ప్రసారకర్తను ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 15న రెజ్లర్ల వేలం నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఈ లీగ్‌ను ప్రసారం చేస్తారు. ► మూడు వారాలు జరిగే ఈ లీగ్‌లో ప్రతి జట్టు అన్ని జట్లతో కనీసం ఒక్కసారైనా ఆడుతుంది. ‘బెస్ట్ ఆఫ్-9 బౌట్స్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఒక్కో బౌట్లో మూడు నిమిషాల నిడివిగల మూడు రౌండ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ మధ్య నిమిషం విరామం ఉంటుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది.