Geethanjali sequel
-
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్‌పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్‌బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
స్వాతి భయపెడుతుందా ?
అల్లరి, అమాయక పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన స్వాతి ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. కార్తికేయ చిత్రంతో మంచి జోష్ మీదున్న తెలుగమ్మాయి... ఓ సీక్వెల్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'గీతాంజలి' సీక్వెల్లో స్వాతి నటిస్తోంది. గత ఏడాదిలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'గీతాంజలి' మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. 2014లో లాభాల బాట పట్టిన సినిమాల జాబితాలో ఇదొకటి. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించి, తన నటనతో ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే కథని కూడా సిద్దం చేసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ గత ఏడాది డిసెంబర్లోనే పూర్తికాగా, అప్పటి నుంచి హీరోయిన్ కోసం చిత్ర నిర్మాతలు అన్వేషిస్తూనే ఉన్నారు. గీతాంజలి సినిమాకు దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. కాగా సీక్వెల్లో కూడా అంజలిని నటించాలని కోరగా, అందుకు ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేయటంతో నిర్మాతలు స్వాతి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి అంజలి స్థాయిలో స్వాతి భయపెడుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదే జోనర్ లో ఇటీవలే వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ‘గీతాంజలి’. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే కథని కూడా సిద్దం చేసుకున్నారు. మన తెలుగులో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న స్వాతి రెడ్డిని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా స్వాతి నటిస్తున్నారు.