స్వాతి భయపెడుతుందా ? | Swathi Reddy may feature in 'Geethanjali' sequel | Sakshi
Sakshi News home page

స్వాతి భయపెడుతుందా ?

Published Wed, Jan 28 2015 1:50 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

స్వాతి భయపెడుతుందా ? - Sakshi

స్వాతి భయపెడుతుందా ?

అల్లరి, అమాయక పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన స్వాతి ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. కార్తికేయ చిత్రంతో మంచి జోష్ మీదున్న తెలుగమ్మాయి... ఓ సీక్వెల్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'గీతాంజలి' సీక్వెల్లో స్వాతి నటిస్తోంది.  గత ఏడాదిలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'గీతాంజలి' మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. 2014లో లాభాల బాట పట్టిన సినిమాల జాబితాలో ఇదొకటి. ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించి, తన నటనతో ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది.

ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే కథని కూడా సిద్దం చేసుకున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ గత ఏడాది డిసెంబర్లోనే పూర్తికాగా, అప్పటి నుంచి హీరోయిన్ కోసం చిత్ర నిర్మాతలు అన్వేషిస్తూనే ఉన్నారు.  గీతాంజలి సినిమాకు దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. కాగా సీక్వెల్లో కూడా అంజలిని నటించాలని కోరగా, అందుకు ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేయటంతో నిర్మాతలు స్వాతి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి అంజలి స్థాయిలో స్వాతి భయపెడుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇదే జోనర్ లో ఇటీవలే వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ‘గీతాంజలి’. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కోన వెంకట్ మాటలు అందించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే కథని కూడా సిద్దం చేసుకున్నారు.

మన తెలుగులో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న స్వాతి రెడ్డిని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా స్వాతి నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement