General Manager Post
-
రంజీ, వినూ మన్కడ్ టోర్నీలు మాత్రమే!
ముంబై: దేశవాళీ క్రికెట్ సీజన్‌ను కరోనా మింగేయనుంది. దేశంలో వైరస్ విలయతాండవం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆటలకు బాటలే పడట్లేదు. దీంతో ప్రస్తుత కరోనా సీజన్లో దేశవాళీ టోర్నీలను రెండుకే పరిమితం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. 2020–21లో సీనియర్ల కోసం రంజీ ట్రోఫీ... కుర్రాళ్ల కోసం అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీల ను మాత్రమే నిర్వహిస్తారు. దులీప్, దేవధర్, విజయ్ హజారే, సీకే నాయుడు (అండర్–23) టోర్నీలు అసాధ్యమేనని బోర్డు భావించింది. వీలు ను బట్టి ముస్తాక్ అలీ టి20 టోర్నీకి చోటిచ్చింది. రంజీ కూడా ఇపుడున్న ఎలైట్, ప్లేట్ కాకుండా పాత పద్ధతిలోనే నిర్వహించే అవకాశముంది. అంటే ఐదు జోన్ల (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్)లోని జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. తదుపరి జోన్ విజేతలకు (పాయింట్ల పట్టికలో జోన్ టాపర్) నాకౌట్ పద్ధతిలో నిర్వహించి విజేతను తేలుస్తారు. సాబా కరీమ్ రాజీనామా మరోవైపు బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) పదవికి సాబా కరీమ్ రాజీనామా చేశాడు. ఇటీవల బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన పదవికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐలో కొత్త ప్రొఫెషనల్స్ టీమ్ రాబోతుందనే చర్చ మొదలైంది. భారత మాజీ వికెట్ కీపర్ అయిన సాబా కరీమ్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ బాధ్యతల్ని నిర్వర్తించేవాడు. -
హలో..నాథుడేరీ
బిఎస్ఎన్ఎల్లో భర్తీ కాని జిఎం పోస్టు తలెత్తుతున్న పాలనాపరమైన ఇబ్బందులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ః జిల్లా బీఎస్ఎన్ఎల్ను నడిపించాల్సిన నాథుడు లేకపోవడంతో ఇబ్బందులొస్తున్నాయి. జనరల్ మేనేజర్ పోస్టు కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. విశాఖ కేంద్రంగా పదోన్నతి పొందిన ఓ అధికారి ఇక్కడకు పక్షం రోజులకోసారి వచ్చి వెళ్లిపోతున్నారు. తాత్కాలిక అధికారిగా ఎలాంటి అర్హత లేని డీఈని సూపర్వైజింగ్ అధికారిగా వేశారు. శ్రీకాకుళం జిల్లా జీఎంగా ఉన్న మహంతి గత ఏడాది మేలో బదిలీపై వెళ్లారు. డీజీఎంగా పనిచే సిన ఉమామహేశ్వరరావు కూడా గతేడాది చివర్లో ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. డీఈగా కె.ఎన్.మూర్తి పనిచేస్తున్న కె.ఎన్.మూర్తికి ఎలాంటి అధికారాలూ ఇవ్వలేదు. దీంతో బీఎస్ఎన్ఎల్ జిల్లా పాలన కుంటుపడింది. ఆదాయం తగ్గిపోయింది. కనెక్షన్ల సంఖ్య తగ్గిపోతోంది. అక్కడలా..ఇక్కడిలా.. హైదరాబాద్‌లో 20మంది జీఎంస్థాయి అధికారులున్నా శ్రీకాకుళం పోస్టింగుపై సుముఖంగా లేరని తెలిసింది. ఇండియన్ టెలికాం సర్వీసెస్‌కు ఎంపికైన ఉద్యోగార్ధులు ఈ జిల్లాను చిన్నచూపు చూస్తున్నారు. ఇక్కడి జీఎం పోస్టు ఖాళీ అయి 9నెలలవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఔట్‌ఫీల్డ్ సిబ్బంది గతంలో 24మంది ఉంటే ఇప్పుడు 16కు చేరింది. ఏటా 30మంది రిటైరవుతున్నారు. ఈ యేడాది కూడా 32మంది ఉద్యోగ విరమణ చేస్తున్నారు. జిల్లాను నడిపించాల్సిన జీఎం లేకపోవడంతో పాలనాపరమైన అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బందికి కనీసం సెలవు కావాల్సినా విశాఖ వెళ్లి మంజూరు చేయించుకోవాల్సిన పరిస్థితి. లైన్మన్లు ఇక్కడి అడ్మిన్ విభాగంలోనే ఉండిపోతున్నారు. అప్పట్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించడంతో కనీస పర్యవేక్షణ బాధ్యత లేకుండా పోయింది. స్టాఫ్ మోనిటరింగ్ చూడాల్సిన బాధ్యత కొరవడింది. కేబుల్ పనిచేయకపోతే అది ఏ స్టేజ్‌లో ఆగిపోయిందో చూసే వ్యక్తే లేరు. సాప్ట్వేర్ అమలు, అభివృద్ధి చేయాల్సిన జీఎం పోస్టు ఖాళీగా ఉండడంతోనే ఇలా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. -జిల్లా వ్యాప్తంగా 100టెలీఫోన్ ఎక్స్చేంజీలున్నాయి. 2014లో 50వేలున్న ల్యాండ్‌లైన్ కనెక్షన్లు ఇప్పుడు 20వేలకే పరిమితమయ్యాయి. చాలా ప్రాంతాల్లో సిగ్నల్ టవర్లు లేకపోవడంతో సిమ్ కార్డులూ పనిచేయక ఖాతాదారులు ప్రత్యామ్నాయంగా ఇతర ఆపరేటర్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు.