‘క్వీన్ ’కు 65 ఏళ్లు
లండన్ : ఇటీవలే 90 వసంతాలు పూర్తిచేసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్.. సోమవారం రాణిగా 65 ఏళ్లు (సఫైర్ జూబ్లీ) పూర్తి చేసుకున్నారు. దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్ రాజ వంశస్తురాలిగా నిలిచారు. ఈ సందర్భంగా శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో జరిగిన ప్రైవేటు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాణి నీలిరంగు (సఫైర్) దుస్తులు, ఆభరణాలు ధరించిన చిత్రాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసింది. క్వీన్ ఎలిజబెత్ తండ్రి జార్జ్–5 వర్థంతి కూడా సోమవారమే కావటం విశేషం.