'సెబాస్టియన్ ను ఏ మతం, ఏ దేవుడూ క్షమించడు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ను ఏ మతం, ఏ దేవుడూ క్షమించడని రెవరెండ్ జార్జ్ కె హర్బట్ విమర్శించారు. సెబాస్టియన్ చరిత్ర క్రైస్తవులందరికీ తెలుసని.. బోరబండలో అద్దెకుంటూ ఇంటిని కబ్జా చేశారని హర్బట్ ఆరోపించారు. నీతిమాలిన పనులకు పాల్పడి అనైతిక చర్యలకు సెబాస్టియన్ దిగారని మండిపడ్డారు.
ఇలాంటి వ్యక్తిని ఏ మతం, ఏ దేవుడూ కూడా క్షమించడన్నారు. సెబాస్టియన్ ను చూసి క్రైస్తవ సమాజం అసహ్యించుకుంటోందని హర్బట్ పేర్కొన్నారు.