german court
-
ఒప్పో, వన్‌ప్లస్‌కు భారీ షాక్.. ఇకపై ఆ కంపెనీ ఫోన్లు బ్యాన్!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్హీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది. ఏంటి ఆ వివాదం.. వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై పేటెంట్ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్‌ప్లస్‌లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్లపై నోకియా, ఒప్పో, వన్‌ప్లస్‌ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్‌ప్లస్‌లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి. చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్ మహీంద్రకు నెటిజన్లు ఫిదా! -
కోటిన్నర కార్ల భవిష్యత్ తేలేది నేడే
2015లో ఫోక్స్‌వాగన్ చీటింగ్ కేసు బయటికి వచ్చినప్పటి నుంచి డీజిల్ ఇంజిన్ కార్లపై ఇటు పర్యావరణవేత్తలు, అటు ప్రభుత్వాలు, కోర్టులు వాటిపై తీవ్ర దృష్టిసారించాయి. కర్బన్ ఉద్గారాలు ఎక్కువగా ఉన్న ఈ కార్లపై ప్రపంచవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జర్మన్‌లోని కోటిన్నర డీజిల్ కార్ల భవిష్యత్ నేడు తేలబోతుంది. ఈ కార్లు జర్మన్ నగర రోడ్లపై నడవాలో వద్దో జర్మన్ కోర్టు నేడు తేల్చబోతుంది. పర్యావరణ గ్రూప్ డీయూహెచ్ వేసిన దావాలో యూరోపియన్ యూనియన్ పరిమితులకు మించి సుమారు కోటిన్నర డీజిల్ కార్లు ఎక్కువ మొత్తంలో ఉద్గారాలను కలిగి ఉన్నట్టు తెలిసింది. తాజా ప్రమాణాలకు అనుగుణంగా లేని, కాలుష్యం భారీగా ఉన్న డీజిల్ కార్లపై నిషేధం విధించాలని స్థానిక కోర్టులు ఆదేశించాయి. ఈ ఆదేశాలపై జర్మన్ రాష్ట్రాలు అప్పీల్ పెట్టుకున్నాయి. దీనిపై నేడు జర్మన్ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. ఈ విషయం కేవలం జర్మన్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. మరికొన్ని అతిపెద్ద కార్ల తయారీదారుల ఖండాలకు కూడా విస్తరించింది. పారిస్, మెక్సికో సిటీ, అథెన్స్ అధికారులు కూడా 2025 నాటికి తమ నగరాల్లో డీజిల్ వాహనాలు తిరగకుండా నిషేధం విధిస్తామని తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి తమ నగరంలోకి కొత్త డీజిల్ కార్లు రాకుండా నిషేధం విధిస్తామని ఇటు కోపెన్హాగన్ మేయర్ కూడా చెప్పారు. ఫ్రాన్స్, బ్రిటన్లు కూడా 2040 నాటికి కొత్త పెట్రోల్, డీజిల్ కార్లను బ్యాన్ చేసి, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లోకి మారతామని తెలిపాయి. -
కూతురి ఎఫ్బీ అకౌంట్ పై ఎలాంటి హక్కులేదు
సోషల్ మీడియా అకౌంట్ యూజర్లు చనిపోతే దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? దీనికేమైనా వీలునామా ఉందా అంటే కొన్ని సామాజిక మాధ్యమాలు వీలునామాలకు అనుమతి ఇస్తున్నాయి. కానీ ఎలాంటి వీలునామా రాయకుండా ఒకవేళ యూజర్ మరణిస్తే మాత్రం దాన్ని ఆపరేట్ చేయడం ప్రైవసీ నిబంధనలకు భంగకరం. ఇదే విషయంలో ఓ కూతురి ఫేస్ బుక్ అకౌంట్ ను ఆమె తల్లిదండ్రులు వాడటానికి వీలులేదని పేర్కొంటూ జర్మనీ కోర్టు తీర్పునిచ్చింది. చనిపోయిన టీనేజ్ గర్ల్ అకౌంట్ వాడటానికి తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులేదని సంచలన తీర్పు వెల్లడించింది. 2012లో రైలు ప్రమాదంలో 15 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. తమ కూతురు ఆత్మహత్య ఏమైనా చేసుకుంది అని నిరూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కూతురు చాట్ మెసేజ్ లను, పోస్టులను తెలుసుకోవడం కోసం యాక్సస్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ టీనేజర్ల కాంట్రాక్ట్ ల ప్రైవసీ విషయంలో తాము రాజీపడబోమని ఫేస్ బుక్ చెబుతోంది. బెర్మిన్ లో తొలి కోర్టు తీర్పు ఆ అమ్మాయి కుటుంబసభ్యులకు అనుగుణంగా రాక, ప్రస్తుతం అప్పీల్స్ కోర్టు ఫేస్ బుక్ కు అనుకూలంగా తీర్పుఇచ్చింది. ఇది సోషల్ మీడియా, ఆ అమ్మాయికి సంబంధించిన కాంట్రాక్ట్ అని, ఆమె మరణంతో ఇది ముగిసిందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై మరో అప్పీల్ కు వెళ్లనున్నామని తల్లిదండ్రులు చెప్పారు. ఫేస్ బుక్ ఇటీవల ద్వేషపూరిత ప్రసంగం, నకిలీ వార్తలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో పరిశీలనను మరింత పెంచింది. -
తప్పుడు కేసు పెట్టిన మోడల్‌కు ఝలక్
జర్మనీ: తనపై లైంగిక దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ అధికారులను తప్పుదోవపట్టించిందని ఓ జర్మన్ మోడల్ కు అక్కడి కోర్టు ఝలక్ ఇచ్చింది. అసలు ఆమెపై లైంగిక దాడి జరగలేదనే, ఉద్దేశ పూర్వకంగానే ఆ వీడియో తయారు చేశారని, అందులో కొన్ని మాటలు కూడా వారే కావాలని చేసినట్లు ఉన్నాయని చెప్పింది. ఆమె దాదాపు 20 వేల యూరోలు కోర్టుకు జరిమానా కట్టాలని ఆదేశించింది. జినా లిసా లాఫింక్ అనే జర్మన్ మోడల్ తనపై సాకర్ ప్లేయర్ పార్డిస్ ఎఫ్, సెబాస్టియన్ పింటో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశారని ఆరోపించింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అందులో నో.. నో.. నో.. అనే అరుపులు వినిపించాయి. అయితే, ఆమెకు జరిపిన పరీక్షల్లో అసలు మత్తుమందే ఇవ్వనట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ వీడియో కూడా నిందితులకు వ్యతిరేకంగా కావాలనే తయారు చేసినట్లు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. కాగా, అక్కడి మహిళా సంఘాలు కూడా కేవలం పబ్లిసిట స్టంట్ కోసమే ఆ మోడల్ ఇలాంటి వీడియోను తయారుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫేస్‌బుక్‌పై భారీ జరిమానా
బెర్లిన్: యూజర్ల డాటాను ఎలా వినియోగించుకుంటున్నదో తెలిపేందుకు నిరాకరించడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై జర్మనీ కోర్టు భారీ జరిమానా విధించింది. ఫేస్బుక్లో యూజర్లు పోస్టుచేస్తున్న మేధో సంపత్తి అంశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నామో వారికి తెలియజేయాలని జర్మనీ కోర్టు ఆదేశించగా.. అందుకు ఫేస్బుక్ నిరాకరించిందని, అందుకే బెర్లిన్ రిజినల్ కోర్టు దానిపై 1.09 లక్షల డాలర్లు (రూ. 74 లక్షలు) జరిమానా విధించిందని వినియోగదారుల హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. ఫేస్బుక్ యూజర్ల డాటా పరిరక్షణ విషయంలో జర్మనీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కోర్టు ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఇప్పటికే ఫేస్బుక్ పై జర్మనీలో వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే గతవారం ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ జర్మనీలో పర్యటించారు కూడా. అయితే యూజర్ల మేధోసంపత్తి పరిరక్షణలో ఫేస్బుక్ కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదని, అది జర్మనీ, యూరప్‌లో వినియోగదారుల చట్టాలను తొంగతొక్కాలని భావిస్తున్ననది జర్మనీ వినియోగదారుల హక్కుల ఫెడరేషన్ (వీజెడ్బీవీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.