కూతురి ఎఫ్బీ అకౌంట్ పై ఎలాంటి హక్కులేదు
కూతురి ఎఫ్బీ అకౌంట్ పై ఎలాంటి హక్కులేదు
Published Wed, May 31 2017 6:56 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM
సోషల్ మీడియా అకౌంట్ యూజర్లు చనిపోతే దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? దీనికేమైనా వీలునామా ఉందా అంటే కొన్ని సామాజిక మాధ్యమాలు వీలునామాలకు అనుమతి ఇస్తున్నాయి. కానీ ఎలాంటి వీలునామా రాయకుండా ఒకవేళ యూజర్ మరణిస్తే మాత్రం దాన్ని ఆపరేట్ చేయడం ప్రైవసీ నిబంధనలకు భంగకరం. ఇదే విషయంలో ఓ కూతురి ఫేస్ బుక్ అకౌంట్ ను ఆమె తల్లిదండ్రులు వాడటానికి వీలులేదని పేర్కొంటూ జర్మనీ కోర్టు తీర్పునిచ్చింది. చనిపోయిన టీనేజ్ గర్ల్ అకౌంట్ వాడటానికి తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులేదని సంచలన తీర్పు వెల్లడించింది. 2012లో రైలు ప్రమాదంలో 15 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. తమ కూతురు ఆత్మహత్య ఏమైనా చేసుకుంది అని నిరూపించడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే కూతురు చాట్ మెసేజ్ లను, పోస్టులను తెలుసుకోవడం కోసం యాక్సస్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ టీనేజర్ల కాంట్రాక్ట్ ల ప్రైవసీ విషయంలో తాము రాజీపడబోమని ఫేస్ బుక్ చెబుతోంది. బెర్మిన్ లో తొలి కోర్టు తీర్పు ఆ అమ్మాయి కుటుంబసభ్యులకు అనుగుణంగా రాక, ప్రస్తుతం అప్పీల్స్ కోర్టు ఫేస్ బుక్ కు అనుకూలంగా తీర్పుఇచ్చింది. ఇది సోషల్ మీడియా, ఆ అమ్మాయికి సంబంధించిన కాంట్రాక్ట్ అని, ఆమె మరణంతో ఇది ముగిసిందని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుపై మరో అప్పీల్ కు వెళ్లనున్నామని తల్లిదండ్రులు చెప్పారు. ఫేస్ బుక్ ఇటీవల ద్వేషపూరిత ప్రసంగం, నకిలీ వార్తలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో పరిశీలనను మరింత పెంచింది.
Advertisement