ఫేస్‌బుక్‌పై భారీ జరిమానా
బెర్లిన్: యూజర్ల డాటాను ఎలా వినియోగించుకుంటున్నదో తెలిపేందుకు నిరాకరించడంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై జర్మనీ కోర్టు భారీ జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌లో యూజర్లు పోస్టుచేస్తున్న మేధో సంపత్తి అంశాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నామో వారికి తెలియజేయాలని జర్మనీ కోర్టు ఆదేశించగా.. అందుకు ఫేస్‌బుక్ నిరాకరించిందని, అందుకే బెర్లిన్ రిజినల్ కోర్టు దానిపై 1.09 లక్షల డాలర్లు (రూ. 74 లక్షలు) జరిమానా విధించిందని వినియోగదారుల హక్కుల సంస్థ ఒకటి తెలిపింది.
ఫేస్‌బుక్ యూజర్ల డాటా పరిరక్షణ విషయంలో జర్మనీలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కోర్టు ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఇప్పటికే ఫేస్‌బుక్ పై జర్మనీలో వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే గతవారం ఫేస్‌బుక్ స్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ జర్మనీలో పర్యటించారు కూడా. అయితే యూజర్ల మేధోసంపత్తి పరిరక్షణలో ఫేస్‌బుక్ కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదని, అది జర్మనీ, యూరప్‌లో వినియోగదారుల చట్టాలను తొంగతొక్కాలని భావిస్తున్ననది జర్మనీ వినియోగదారుల హక్కుల ఫెడరేషన్ (వీజెడ్‌బీవీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.