German Police
-
లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత
న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్ సింగ్ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్ గగన్‌దీప్ బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు. ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్ గడ్డపై నుంచి ఖలిస్థాన్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్... జస్విందర్ సింగ్ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భారత్ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్ఫర్ట్ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్ గ్రెనేడ్లను పాక్ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. -
యువతిని ఫాలో అవుతోందని ఉడుతకు జైలు
బెర్లిన్: ఇదో విచిత్ర సంఘటన. జర్మనీలో జరిగిన అత్యంత అరుదైన దృశ్యం. వినేవాళ్లు హవ్వా అనాల్సిందే. ఎందుకంటే నేరం చేసిన వాళ్లనే పట్టుకునేందుకు చేతగాని పోలీసులు ఓ ఆటవిక ప్రాణిని అరెస్టు చేశారు. పోని ఓ భారీ ప్రాణినా అంటే అది కూడా కాదు. ఒక్కసారి చేయి విదిలేస్తే పారిపోయి చెట్టెక్కి కూర్చునే అల్పప్రాణిని. మరోసారి ఆ ఆ దిక్కు చూస్తే అదిరిపోయి గుండెచేతపట్టుకుని పారిపోయే చిన్నజీవిని. మనకు అత్యంత సుపరిచితమైన జీవిని. ఇంకా చెప్పాలంటే శ్రీరాముడికి తనకు చేతనైనంత సాయం చేసి ఆయన చేతి స్పర్శను తాకిన గొప్ప ప్రాణిని. అదే.. ఉడుత. అసలు విషయానికి వస్తే జర్మనీలో ఓ ఉడుత ఇప్పుడు జైలు పాలయింది. చక్కగా అక్కడా ఇక్కడా గెంతులు పెడుతూ హుషారుగా తిరగాల్సిన అది చెరసాలలో బిక్కుబిక్కుమంటూ తిండీతిప్పలు మాని కూర్చుంది. నార్త్ రైన్ వెస్ట ఫాలియాలోని బోట్రాప్ నగరంలో ఓ యువతి చేసిన ఫిర్యాదే దానికి శిక్షగా మిగిలింది. ఓ ఉడుత తనను బాగా ఫాలో అవుతుందని, తాను ఎటు వెళితే అటువస్తుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ముందు లైట్‌గా తీసుకున్న పోలీసులు ఆమె నాన్ స్టాఫ్‌గా ఫోన్ చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో వెళ్లి దానిని బంధించారు. అనంతరం తీసుకొచ్చి జైలు బోనులో పెట్టారు. అది చిక్కిపోయినట్లు కనిపించడంతో దానికోసం ప్రత్యేకంగా పోలీసు కాపలా ఉండి దానికి ఆహారం పెట్టి పోషిస్తున్నారు.