నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
మదనపల్లె రూరల్: నిర్మాణ రంగంలో నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా భారతి సిమెంట్ నిలిచిందని మార్కెటింగ్ ఆఫీసర్ బాలకృష్ణ అన్నారు. స్థానిక కదిరి రోడ్డులోని సూరి టవర్స్‌లో విశ్వనాథ ట్రేడర్స్ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహిం చారు. వారు మాట్లాడుతూ భారతి సిమెంట్ అనంతి కాలంలోనే రికార్డు స్థాయిలో అమ్ముడుపోతోందన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే ఇది మూడు రెట్లు మేలన్నారు. నాణ్యతలో ఈ సిమెంట్‌కు సాటి లేదన్నారు.
జర్మన్ సాంకేతిక పరిజ్ఞానం, రోబోటెక్ క్వాలిటీ, ట్యాంపర్ప్రూఫ్ ప్యాకింగ్‌తో తయారవుతున్న ఏకైక సిమెంట్ ఇదన్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి కూడా భారతి సిమెంట్ యాజమాన్యం కృషి చేస్తోందన్నారు. నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాపీ మేస్త్రీలకు, కార్మికులకు సంస్థ అవగాహన కల్పిస్తోందని చెప్పారు.
తాపీమేస్త్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా ఇస్తున్న ఘనత తమ సంస్థదేనన్నారు. టెక్నికల్ మేనేజర్ ఛాయాపతి భారతి సిమెంట్ ప్రత్యేకతలను స్లైడ్షోలు, షార్ట్ వీడియోల ద్వారా కార్మికులకు వివరించారు. అనంతరం 50 మంది కార్మికులకు రూ.లక్ష బీమా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీని వాసులు, రమణ, కాంట్రాక్టర్లు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.