పారిశుధ్య కార్మికుల సమ్మె, ఎక్కడ చెత్త అక్కడే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్‌ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో చెత్తను తరలించే 850 వాహనాలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.
కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్....గురువారం ఉదయం పారిశుధ్య కార్మికు సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. సమ్మె విరమించాలని ఆయన కోరారు. మరోవైపు కార్మికుల సమ్మె కారణంగా చెత్త తరలింపు విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.