విజ్ఞానాభివృద్ధికి సదస్సులు దోహదం
వెలుగుబంద (రాజానగరం) :
తరగతిలో పొందిన విజ్ఞానాన్ని మరింతగా వృద్ధి చేసుకునేందుకు సదస్సులు దోహదపడతాయని ఓఎ¯ŒSజీసీ జీఎం (హెచ్ఆర్) ఆర్కే శర్మ అన్నారు. గైట్ కళాశాలలో ‘మేగ్న 2కే16’ పేరిట నిర్వహించిన మేనేజ్మెంట్ ఫెస్ట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పారిశ్రామిక రంగంలో ఆటోమేష¯ŒS విధానం పెరుగుతోందని, తదనుగుణంగా యువ ఇంజనీర్లు కూడా తయారుకావాలని గైట్ కళాశాల ఎండీ కె.శశికిరణ్వర్మ అన్నారు. అప్పుడే ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయన్నారు. సదస్సు సందర్భంగా నిర్వహించిన వివిధ వైజ్ఞానిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే మిస్ మేగ్నస్గా సాయిప్రణవి, మిస్టర్ మేగ్నస్గా భానుశంకర్లను ప్రకటించారు. యమహా లక్కీ డ్రా విజేత కె.పద్మకు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.లక్ష్మి శశికిరణ్వర్మ, ఓఎ¯ŒSజీసీ జీఎం (హెచ్ఆర్) కాకినాడ డీకే కలోరా, గెయిల్ హెచ్ఆర్ రాజమహేంద్రవరం హెడ్ రెడ్డి, డీజీఎం కేవీఎస్ రావు, చీఫ్ మేనేజర్ రాజారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు పలు సంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు.