giri babu wife
-
యర్రా శ్రీదేవికి ఘన నివాళులు
ఒంగోలు : ప్రముఖ టాలీవుడ్ నటుడు గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవికి శుక్రవారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జిల్లాలోని కొరిసపాడు మండలం రావినూతలలో గిరిబాబు నివాసంలో యర్రా శ్రీదేవి మృతదేహాన్ని జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుతోపాటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవి గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు శుక్రవారం రావినూతలలో జరపనున్నారు. -
నటుడు గిరిబాబుకు వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: సినీ నటుడు గిరిబాబు భార్య శ్రీదేవి మృతికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపాన్ని తెలిపారు. ప్రకాశం జిల్లా రావినూతలలోని స్వగృహంలో ఉన్న గిరిబాబుకు గురువారం సాయంత్రం వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం అర్థరాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. -
సినీ నటుడు గిరిబాబు భార్య కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నటుడు గిరిబాబు భార్య ఎర్ర శ్రీదేవి బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆమె గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గిరిబాబు, శ్రీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు రఘుబాబు ప్రముఖ కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు.