
సినీ నటుడు గిరిబాబు భార్య కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నటుడు గిరిబాబు భార్య ఎర్ర శ్రీదేవి బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆమె గత మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గిరిబాబు, శ్రీదేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడు రఘుబాబు ప్రముఖ కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి మృతదేహాన్ని గిరిబాబు స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలకు తరలించారు.