girijanabhivrddhiki
-
మూత‘బడి’..
డేరు మండలంలోని పనసపల్లి గ్రామంలోని జీపీఎస్ (టీడబ్ల్యూ) ఏకోపాధ్యాయ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులున్నాయి. గతేడాది ఈ పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయిని పదవీ విరమణ చేశారు. దీంతో ఈ పాఠశాలకు టీచర్ కొర త ఏర్పడింది. వేసవి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో ఉపాధ్యాయుడు లేక మంగళవారం ఈ పాఠశాల తెరుచుకోలేదు. ఈ పాఠశాలలో గతేడాది 16 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది మరో ఆరుగురు బాలలు చేరవలసి ఉంది. పాఠశాల తెరుచుకోకపోవడంతో విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. సాక్షి, పాడేరు : గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 670 (జీపీఎస్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే మారుమూల గిరిజన గ్రామాల్లో బాలలకు ప్రాథమిక విద్యను అందించేందుకు 30 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన విద్యా వికాస కేంద్రాలు (జీవీవీకే) పేరుతో ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. జీపీఎస్ పాఠశాలలుగా పేరుమార్చి నేటికీ ఏకోపాధ్యాయులతోనే ఈ పాఠశాలలను నిర్వహిస్తోంది. 1 నుంచి 5 తరగతులుంటున్న ఈ పాఠశాలల్లో 30 నుంచి 50 వరకూ విద్యార్థులుంటున్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నా ఒక్క ఉపాధ్యాయుడే తరగతులలో బోధనతో నెట్టుకొస్తున్నారు. ఇదే మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అయితే అదనంగా టీచర్లను నియమిస్తున్నారు. కానీ జీపీఎస్ పాఠశాలల్లో మా త్రం 2వ ఉపాధ్యాయుడు నియామకమన్న ప్రశ్నే లేకుండా పోయింది. ఈ జీపీఎస్ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడి వల్ల విద్యాబోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం ఏజెన్సీలో 77 జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా ఈ పాఠశాలల్లో వలంటీర్లుగానీ, సీఆర్టీలను గాని నియమించే వరకూ ఈ పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా 22 వ్యక్తిగత సెలవులు ఉంటాయి. అదీగాక ప్రతీ నెల 2 రోజులు హెచ్ఎంల మీటింగ్, కాంప్లెక్స్ మీటింగ్‌లతోపాటు విద్యా ప్రణాళికలకు సం బంధించి అత్యవసర సమావేశాలు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సెలవులు అన్నీ కలిపి ఏడాదికి కనీసం 40 రోజులు పాఠశాల మూతపడుతున్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన ఈ జీపీఎస్ పాఠశాలలకు వర్తిం చడం లేదు. తరచూ పాఠశాలలు మూతపడుతుం డటం వల్ల గిరిజన ప్రాథమిక విద్య గాలివాటంగా మారింది. నేడు పాఠశాలలు పునః ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట ప్రాథమిక పాఠశాలలు మూతపడివున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏజెన్సీలోని 955 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 61 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 175 ఉన్నాయి. ఏజెన్సీలో ఉపాధ్యాయుల కొరత వల్ల గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. -
గిరిజనాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలి
ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు భద్రాచలం : అధికారులు గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలు అభివృద్ధి సాధించినప్పుడే స్వాతంత్య్ర ఫలాలు దక్కినట్లుగా భావించాలన్నారు. దీనికోసం అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఏజెన్సీ పరిధిలోని విద్యాసంస్థల ద్వారా 41,297 మంది విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది పదో తరగతిలో 91 శాతం ఫలితాలు సాధించామని, ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేలా తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా 25,436 మొక్కలను పాఠశాలల ప్రాంగణాల్లో నాటామన్నారు. సీజన ల్ వ్యాధుల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలకు 400 చొప్పున, ఇల్లెందుకు 380 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఏజెన్సీ పరిధిలోని 24 మండలాల్లో 1,12,688 కుటుంబాలకు చెందిన 1,89,995 మంది కూలీలకు 47.56 లక్షల పనిదినాలు కల్పించి.. వేతనాల కింద రూ.59.92కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రూ.13.87లక్షలతో ఆయిల్ ఇంజన్లు, సైకిళ్లు, పైపులు, కట్టుమిషన్లు అందజేశామన్నారు. అనంతరం ట్రైకార్ పథకంలో భాగంగా టాటా మేజిక్ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భద్రాచలంలోని లిటిల్æఫ్లవర్ విద్యార్థులు చేసిన జై తెలంగాణ గీతానికి పీఓతోపాటు ఇతర యూనిట్ అధికారులంతా హర్షధ్వానాలతో ఉత్తేజపరిచారు. ఐటీడీఏలోని వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులు, అధికారులకు పీఓ రాజీవ్ ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే లిటల్ ఫ్లవర్ విద్యార్థుల తరఫున విద్యాసంస్థల చైర్మన్ మాగంటి సూర్యంకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డీడీ జయదేవ్ అబ్రహం, ఏజెన్సీ డీఈఓ రవీందర్, ఏపీఓ జనరల్ కె.భీమ్రావు, ఐకేపీ ఏపీడీ జయశ్రీ, ఎస్పీహెచ్ఓ డాక్టర్ కోమల, డీఎంఓ రాంబాబు, డీసీఓ బురాన్, మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ నారాయణరెడ్డి, ఏజీపీ సాల్మన్ రాజు పాల్గొన్నారు.