పాఠశాలలో ఏం జరిగింది?
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: అది చిత్తూరు నగరంలోని గిరింపేట నగర పాలక ప్రాథమిక పాఠశాల... సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వీపర్ పాఠశాలను శుభ్రం చేయడానికి వచ్చింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు పగిలిన దృశ్యం. రక్తపు మరకలు. దీంతో ఆందోళనకు గురైన ఆమె విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలికి సమాచారాన్ని అందచేసింది. వెనువెంటనే హెచ్ఎం, కార్పొరేషన్ కమిషనర్‌కు చెప్పడంతో ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్పొరేషన్ పాఠశాలలో చీకటి పడితే గుర్తుతెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
భయాందోళనలో స్థానికులు
గిరింపేట ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలను పగులగొట్టి గదులన్నింటిలోనూ గాజుపెంకులు పడేశారు. ఈ సంఘటనతో ఇటు విద్యార్థులు, అటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రధానంగా నగర పాలక పాఠశాలల్లో రాత్రి కాపలాదారుని పోస్టుల మంజూరు లేకపోవడం తో పరిస్థితి ఇలా తయారయింది. కొం దరు ఆటో డ్రైవర్లు పాఠశాల ఆవరణలో మద్యం సేవించి, వారిలో వారికి చిన్నపాటి గొడవలు వచ్చి కొట్టుకోవడంతో రక్తం వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల హెచ్ఎంని విచారించిన కమిషనర్ టూటౌన్ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. కమిషనర్‌తో పా టు మండల విద్యాశాఖాధికారి జయప్రకాష్ పరిస్థితిని జిల్లా కలెక్టర్‌కు రాత పూ ర్వకంగా నివేదించారు. పాఠశాల ప్రహరీగోడ ఎత్తు పెంచాలని, ప్రవేశద్వారానికి ఇనుపగేటు నిర్మించాలని ప్రతిపాదనలు పంపారు. ఈ సంఘటనపై టూ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.