సీఎం స్నేహితుడిని విచారించిన ఏసీబీ
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్నేహితుడు గిరీష్చంద్ర వర్మాను బుధవారం అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులు విచారించారు. అత్యంత ఖరీదైన హొబ్లోట్ వాచ్ను గిరీష్చంద్ర వర్మా తనకు బహుమతిగా ఇచ్చినట్లు సీఎం సిద్ధరామయ్య స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.
అంత ఖరీదైన వాచ్ ఇవ్వాల్సిన అవసరం ఏమెచ్చిందని?, ఆ వాచ్ దొంగలించి సీఎం సిద్ధుకు ఇచ్చారని.. ఇలా ఫిర్యాదలు ఏసీబీలో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గిరీష్ చంద్రవర్మాను ఏసీబీ పోలీసులు తమ కార్యాలయానికి పిలిపించి విచారించారు.