సానియా మీర్జాకు హైకోర్టు ఝలక్
బెంగళూరు: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కర్ణాటక హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన అత్యుతన్న క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నపై స్టే విధించింది. పారా ఒలింపియన్ గిరీషా ఎన్ గౌడ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాల్చింది. అవార్డుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని గిరీషా కోర్టును ఆశ్రయించాడు.
తనకు అన్ని అర్హతలు ఉన్నా అవార్డు ఇవ్వలేదని న్యాయస్థానానికి మొర పెట్టుకున్నాడు. తనకు కాదని సానియాకు ఖేల్ రత్న ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేశాడు. 2011-2014 మధ్య కాలంలో సానియా ఒక్క టైటిల్ కూడా నెగ్గని సానియాకు ఖేల్ రత్న ఎలి ఇస్తారని ప్రశ్నించాడు.
కర్ణాటకకు చెందిన గిరీషా 2012 సమ్మర్ పారా ఒలింపిక్స్ లో హై జంప్ లో వెండి పతకం సాధించాడు. దీంతో పారాఒలింపిక్స్ మెడల్ సాధించిన 9వ క్రీడాకారుడిగా ఘనత సాధించాడు. అంతేకాదు వెండి పతకం సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు కెక్కాడు. 2013లో కేంద్ర ప్రభుత్వం అతడికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది.