బాలికపై బాలుడు అత్యాచారయత్నం
రాయదుర్గం అర్బన్ : పట్టణంలో ఆరేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వివరాల మేరకు... మునిసిపల్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలిక ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన వాల్మీకి నగర్‌కు చెందిన బాలుడు మీ మేడం ఇల్లు చూపించాలని కోరాడు. ఇందుకు సరేనన్న బాలికను టీవీఎస్ మోపెడ్‌పై ఎక్కించుకుని కణేకల్లు రోడ్డు ఎంసీఏ లేఅవుట్ వైపు తీసుకెళ్లాడు.
అక్కడ నిర్మాణంలో ఉన్న కొద్దిసేపటి తర్వాత బాలిక ఏడుస్తుండటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అత్యాచారం చేయడానికి సిద్ధమైన బాలుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పాఠశాల హెచ్ఎంకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు.