girl escape
-
నేరాల్లో దిట్ట.. జువైనల్ హోం సిబ్బంది కళ్లుగప్పి..
సాక్షి, కాచిగూడ: నింబోలి అడ్డలోని బాలికల జువైనల్ హోం నుంచి ఓ యువతి పారిపోయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్ కుమార్తె సమ్రీన్(18) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వివిధ నేరాలకు సంబంధించి నెల రోజుల క్రితం బాలికా సదన్‌కు తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో సమ్రీన్ సిబ్బంది కళ్లుగప్పి ప్రధాన గేట్ తాళం తీసుకుని పారిపోయింది. విషయం తెలుసుకున్న బాలికా సదన్ సిబ్బంది ప్రమీల కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అద్భుతం.. అమ్మాయి బతికిపోయింది!
అది ఓ చిన్న రైల్వే స్టేషన్. స్టేషన్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ ఓ బాలిక రైల్వే ట్రాక్‌పై ఉండగా గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. దిక్కుతోచని ఆ బాలిక ట్రాక్‌పై రెండు పట్టాల మధ్య పడుకుండిపోయింది. ఈ హఠాత్పరిణామానికి స్టేషన్లో ఉన్న ప్రయాణికులు షాకయ్యారు. ట్రాక్‌పై ఉన్న బాలిక పరిస్థితి ఏంటని అందరూ కన్నురెప్ప వేయకుండా అటువైపు వెళ్లి చూడసాగారు. గూడ్సు రైలు వెళ్లగానే అక్కడ అద్భుతం జరిగింది. ట్రాక్ మధ్యలో ఉన్న అమ్మాయి లేచి నిల్చుంది. ఏలాంటి గాయం కాలేదు. క్షేమంగా ఉంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు దిగి ఆ అమ్మాయిని ప్లాట్ ఫామ్‌పైకి చేర్చారు. కాగా ఈ అమ్మాయి ఎవరు? ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ప్రమాదానికి కారణమేమి వంటి వివరాలు తెలియరాలేదు. అక్కడున్న ప్రత్యక్షి సాక్షి ఈ దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేయగా యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. -
అత్యాచారం చేసేందుకు ఆటోడ్రైవర్ యత్నం
ఆటోలో నుంచి దూకి తప్పించుకున్న యువతి జడ్చర్ల(మహబూబ్ నగర్ జిల్లా): స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేందుకు ఆటోలో బయలుదేరిన ఓ యువతిని సదరు ఆటోడ్రైవర్ దారి మళ్లించి అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. ఆ యువతి తప్పించుకునేందుకు వేగంగా వెళ్తున్న ఆటోలోనుంచి దూకింది. ఈ ఘటన శుక్రవారం బాదేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లక్ష్మినర్సింహులు కథనం మేరకు..కావేరమ్మపేట పరిధిలోని జయప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ యువతి బాదేపల్లిలోని నేతాజీ చౌరస్తాలో గల ఓ గార్మెంట్ దుకాణంలో పనిచేస్తుంది. రోజులాగానే శుక్రవారం దుకాణానికి వెళ్లేందుకు తమ ఊరు నుంచి ఆటోలో బయలు దేరింది. ఆటోలో ఒంటరిగా ఉన్న యువతిని ఆటో డ్రైవర్ సిగ్నల్‌గడ్డ దగ్గర దారి మళ్లించి కల్వకుర్తి వైపు తీసుకెళ్తుండడంతో యువతి ఆటోడ్రైవర్‌ను ఇటు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించింది. దీంతో అతను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆటోవేగం పెంచాడు. తనపై ఆఘాయిత్యం చేసేందుకే ఆటోను దారి మళ్లించి తీసుకెళ్తున్నాడని భావించిన యువతి ఆటోలోనుంచి దూకి స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు వల్లూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.