ఆటోలో నుంచి దూకి తప్పించుకున్న యువతి
జడ్చర్ల(మహబూబ్ నగర్ జిల్లా):
స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేసేందుకు ఆటోలో బయలుదేరిన ఓ యువతిని సదరు ఆటోడ్రైవర్ దారి మళ్లించి అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. ఆ యువతి తప్పించుకునేందుకు వేగంగా వెళ్తున్న ఆటోలోనుంచి దూకింది. ఈ ఘటన శుక్రవారం బాదేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మినర్సింహులు కథనం మేరకు..కావేరమ్మపేట పరిధిలోని జయప్రకాశ్ నగర్‌కు చెందిన ఓ యువతి బాదేపల్లిలోని నేతాజీ చౌరస్తాలో గల ఓ గార్మెంట్ దుకాణంలో పనిచేస్తుంది. రోజులాగానే శుక్రవారం దుకాణానికి వెళ్లేందుకు తమ ఊరు నుంచి ఆటోలో బయలు దేరింది.
ఆటోలో ఒంటరిగా ఉన్న యువతిని ఆటో డ్రైవర్ సిగ్నల్‌గడ్డ దగ్గర దారి మళ్లించి కల్వకుర్తి వైపు తీసుకెళ్తుండడంతో యువతి ఆటోడ్రైవర్‌ను ఇటు ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించింది. దీంతో అతను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆటోవేగం పెంచాడు. తనపై ఆఘాయిత్యం చేసేందుకే ఆటోను దారి మళ్లించి తీసుకెళ్తున్నాడని భావించిన యువతి ఆటోలోనుంచి దూకి స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడు వల్లూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అత్యాచారం చేసేందుకు ఆటోడ్రైవర్ యత్నం
Published Sat, Oct 8 2016 7:50 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement