girl meena
-
బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో గత గురువారం బోరుబావిలో పడిన చిట్టితల్లీ మీనాను ప్రాణాలతో కాపడలేకపోయారు. దాదాపు 60 గంటల పాటు పలువురు సిబ్బంది ఎంతో శ్రమించినా మీనా కథ విషాదంగానే ముగిసింది. పాప మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చూడాల్సి రావడంతో తల్లిదండ్రులతో పాటు చూపరులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలే ఏం జరగిందంటే.. గురువారం సాయంత్రం తోటి చిన్నారులతో మీనా ఆడుకుంటూ ఉంది. తెరచిఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన చిన్నారిని అత్యాధునిక పరికరాలతో బయటకు తీయాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి బోరు బావి నుంచి దుర్వాసర వస్తుండటంతో మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ విధానాన్ని అనుసరించారు. దీంతో మొదట పాప దుస్తులు వచ్చాయి. అనంతరం పాప శరీర భాగాలను బయటకు తీసి చేవెళ్ల ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ ఇలా సాగింది.. జూన్ 22న (గురువారం) ఆడుకుంటూ సాయంత్రం 6:45 గంటలకు బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా సాయంత్రం 6:50 గంటలకు స్థానికులకు సమాచారం అదే రోజు రాత్రి 7:15 గంటలకు బోరుబావి వద్దకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. మరో ఐదు నిమిషాలకు ఘటనస్ధలంలో మంత్రి మహేందర్ రెడ్డి రాత్రి 7:45 గంటలకు జేసీబీల రాక. రాత్రి 11 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 11:30 గంటలకు ఘటనాస్థలానికి వచ్చి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రఘునందన్ గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అత్యాధునిక పరికరాలతో వచ్చిన మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ బృందం జూన్ 22 అర్థరాత్రి నుంచి జూన్ 23 ఉదయం వరకు బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బోరు బావి నుంచి మోటార్ వెలికితీత మధ్యాహ్నం నుంచి మళ్లీ కొనసాగిన తవ్వకాలు. పాప 40 అడుగుల నుంచి 100 అడుగులకు లోతుకు జూన్ 24 (శనివారం) ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా కనిపంచని పాప ఆనవాళ్లు మధ్యాహ్నం అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించిన కనిపించని పాప జాడ సాయంత్రం కొక్కెం లాంటి పరికరాలతో పాపను బయటకు తీసేందుకు సిబ్బంది యత్నం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పాప చనిపోయి ఉండొచ్చునని అనుమానాలు ఆదివారం వేకువజాములోగా కేఎల్ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని యత్నాలు దాదాపు 6 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి దుర్వాసన. అనంతరం పాప దుస్తులు, అవశేషాలు వెలికితీత చిన్నారి మీనా మృతిచెందినట్లు ఉదయం 6:25 గంటలకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటన. అనంతరం పాప అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలింపు సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! చిన్నారి మీనా ఘటన విషాదాంతం 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. అయితే అరవై గంటలకు పైగా శ్రమించినా కనీసం పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోవటం విచారకరం. కేవలం పాప అవశేషాలు ఒక్కొక్కటిగా చూడాల్సి రావడంతో కడసారి చూపును సైతం కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మరోవైపు గురువారం రాత్రి నుంచి అత్యాధునిక పరికరాలతో బయటకు తీసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు ఫలించలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఆదివారం వేకువ జాము నుంచి ఎయిర్ ప్రెషర్ ద్వారా బయటకు తీయాలని చేసిన చివరి ప్రయత్నం కొంత మేలని అధికారులు భావించారు. అయితే ఫ్లషింగ్తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరు బావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి దుస్తులు బయటకు వచ్చాయి. ఇది చూడగానే చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆపై మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రులకు తమ ముద్దుల చిన్నారి రూపాన్ని కడసారి చూపు సైతం దక్కలేదని స్థానికులు ఆవేదన చెందారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది. శవ పరీక్ష కోసం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఘటనా స్థలంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. చిన్నారి కుటంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు. సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే! చిన్నారి మీనా ఘటన విషాదాంతం 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
విషాదం: చిన్నారి మీనా మృతి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో దాదాపు 60 గంటలపాటు ఎంతో శ్రమించినా ఫలితం శూన్యమైంది. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని సిబ్బంది యత్నిస్తుండగా బోరు బావి నుంచి చిన్నారి అవశేషాలతో పాటు దుస్తులు(ఫ్రాక్) బయటకు వచ్చినట్లు తెలిపారు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోందని, అయితే మృతదేహాన్ని తల్లిందండ్రులకు అప్పగించి వారికి పాప చివరిచూపును కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటనతో చిన్నారి మీనా తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో బోరు బావి సమీప ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. గురువారం మీనా అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. గురువారం 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎయిర్ ప్రెషర్ ద్వారా యత్నించగా.. చిన్నారి ఫ్రాక్ బయటకు రావడంతో పాటు బోరు బావి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో చిన్నారి మీనా మృతి చెందినట్లు నిర్దారించారు. చిన్నారి మృతి బాధాకరం: మహేందర్ రెడ్డి 60 గంటలపాటు శ్రమించినా చిన్నారిని కాపాడలేకపోయాం. మీనా మృతి నిజంగా బాధాకరం. ఎంత శ్రమించినా మా శ్రమ ఫలించలేదు. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి దుస్తులు, అవశేషాలు రావడంతో మృతిచెందినట్లు గుర్తించాం. శవ పరీక్ష కోసం చిన్నారి మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించాం. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటాం. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే! 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం!
చేవెళ్ల: బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కనుక్కొనేందుకు త్రిడైమన్షన్ మ్యాట్రిక్స్ కెమెరాను బోరుబావిలోకి పంపామని, అయితే, 180 అడుగుల వద్ద నీళ్లు తగలడంతో చిన్నారి ఆచూకీ లభించలేదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ప్రత్యేక మోటారు ద్వారా నీటిని అంతటిని తోడిస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఇక జిల్లా వైద్యాధికారి బాలాజీ మాట్లాడుతూ చిన్నారిని బయటకు తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నిరంతరం బోరుబావిలోకి ఆక్సీజన్ పంపుతున్నామని, చిన్నారిని బయటకు తీయగానే వైద్యం అందించేందుకు చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామని బాలాజీ చెప్పారు. 'సాక్షి' ఉద్యమంలో నేనూ పాల్గొంటా: కొండా విశ్వేశ్వరరెడ్డి తెరిచి ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలంటూ 'సాక్షి' పిలుపునిచ్చిన ఉద్యమంలో తాను కూడా పాల్గొంటానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 30వేలకుపైగా తెరిచి ఉన్న బోరుబావులున్నట్టు అంచనా ఉందని, వీటిని వెంటనే మూసివేసేందుకు ఉచితంగా క్యాప్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. చిన్నారిని బోరుబావిలోంచి వెలికితీసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. -
బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న క్షణాలు!
47 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. అవి ఫలించడం లేదు. అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపినా.. పాప ఆచూకీ ఇంకా చిక్కలేదు. దీంతో బోరుబావిలో పడిన చిట్టితల్లిని క్షేమంగా చూస్తామా? సమయం గడిచేకొద్ది ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉత్కంఠ పెరిగిపోతున్నది. బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. కొక్కెంలాంటిది ఏర్పాటుచేసి.. బోరుబావిలో ఉన్న చిన్నారిని వెలికితీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన ప్రయత్నమూ విఫలమైంది. ఈ కొక్కెం వల్ల పాప బయటకు రావొచ్చునని సహాయక సిబ్బంది ఎంతగా ఆశించినా ఫలితం దక్కలేదు. దీంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వే పనిని వేగవంతం చేశారు. ప్రస్తుతం 30 అడుగుల మేర గొయ్యి తవ్వారు. 40 అడుగుల మేర గొయ్యి తవ్వి.. బోరుబావికి అనుసంధానం చేయాలని.. అప్పుడు చిన్నారిని వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 230 అడుగుల లోతులో పాప ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో పాపను వెలికితీసే ఆపరేషన్ చాలా కష్టతరంగా మారింది. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే.