girl stripped
-
ఆమె చెప్పే విషయాల్లో గందరగోళం: సీపీ
టాంజానియా యువతి కేసు విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎన్ఎస్ మేఘారిఖ్ చెప్పారు. కొంతమంది పోలీసులు కూడా ఉన్నట్లు చెప్పడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసు విషయం గురించి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పే విషయాలు చాలా గందరగోళంగా ఉన్నాయని.. కారులో నలుగురు ఉన్నట్లు ఆమె చెబుతుంటే, ఆమె స్నేహితులు మాత్రం కారులో ఐదుగురు ఉన్నారంటున్నారని సీపీ మేఘారిఖ్ అన్నారు. అసలు ఆ ఘటనా సమయంలో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని తాము నిర్ధారిస్తున్నామన్నారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో అక్కడ పోలీసులు కూడా ఉన్నట్లు చెప్పడంతోనే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామని తెలిపారు. దీనిపై కూడా విచారణ కొనసాగిస్తున్నామన్నారు. -
బెంగళూరులో తలదించుకునే ఘటన
బెంగళూరు: బెంగళూరులో సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన చోటుచేసుకుంది. టాంజానియాకు చెందిన యువతిపై దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు ఆ యువతిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు. వీధుల్లో పరుగెత్తించడంతోపాటు ఆమె కారును కూడా తగులబెట్టారు. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. అదే సమయంలో యాక్సిడెంట్ చేసినవారికోసం వెతుకుతున్నారు. అదే సమయంలో టాంజానియా మహిళ, ఆమె స్నేహితులు ఘటనా స్థలానికి వచ్చారు. దీంతో ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు ప్రమాదానికి కారణం వారే అనుకుని దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో చదువుతున్న ఆ విద్యార్థినిని బయటకులాగి చేయిచేసుకోవడంతోపాటు ఆమెను వివస్త్రను చేసి పరుగులు పెట్టించారు. ఆమె స్నేహితులపై దారుణంగా దాడి చేశారు. అనంతరం వారి కారును తగులబెట్టారు. అయితే, ఆ యాక్సిడెంట్ చేసింది మాత్రం సుడాన్‌కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేసే చర్యలకు దిగారు. -
గిరిజన యువతిని వివస్త్ర చేసి.. గుండు గీసిన అత్తమామలు
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి ఓ గిరిజన యువతి(19)ని ఆమె అత్తమామలే వివస్త్రను చేసి, గుండు గీశారు. ఈ సంఘటన ఆగస్టు 30వ తేదీన జరిగినా, ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయమై థానె జిల్లా షాహాపూర్ తాలూకా పడ్గా పోలీసు స్టేషన్లో ఆ యువతి శనివారం ఫిర్యాదుచేసింది. ఆరోజు వాళ్లు తనను వివస్త్రను చేసి, గుండుగీసి, తీవ్రంగా కొట్టారని తెలిపింది. వాళ్ల కొడుకు యోగేష్ పాటిల్‌ను పెళ్లి చేసుకున్నందుకే ఇలా చేశారని ఆరోపించింది. భివాండి పట్టణంలోని ఓ గోడౌన్లో తాను ప్యాకర్‌గా పనిచేస్తున్నప్పుడు యోగేష్‌తో పరిచయమై, అది ప్రేమగా మారిందని ఆమె తెలిపింది. పెద్దలు వద్దన్నా కూడా అతడు మే నెలలో ఆమెను పెళ్లి చేసుకుని, అత్తవారింట్లోనే ఉన్నాడు. అయితే, ఆగస్టు 30న వాళ్లు ఆ ఇంటికి వెళ్తుండగా యోగేష్ కుటుంబసభ్యులు వారిని బలవంతంగా భివాండీలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇద్దరినీ గుమ్మానికి కట్టేశారు. తర్వాత యువతి బట్టలు విప్పి, ఆమెకు గుండుచేశారు. అంతేకాదు.. యోగేష్ సోదరుడు తన ఫొటోలు కూడా మొబైల్ ఫోన్లో తీసుకున్నాడని ఆమె ఆరోపించింది. యువతి గ్రామ సర్పంచి సంతోష్ పాటిల్ ఆమెను రక్షించి, వారిని పడ్గా గ్రామానికి తీసుకెళ్లారు. దాంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది. అత్తమామలపై 498ఎ, 354, 353, 504, 506, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాల కింద కేసు నమోదు చేశారు.