Girlfriends murder case
-
HYD: ఐటీ ఉద్యోగిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి.. ప్రేమే కారణం?
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమై యువకుడు దాడి చేశాడు. ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. వాసవిపై గణేశ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటూ గణేశ్.. వాసవిని హోటల్ వద్దకు పిలిచాడు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చింది. వారిద్దరూ మాట్లాడుకున్న కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, ఆవేశానికి లోనైన గణేశ్.. తన బ్యాగులో ఉన్న కత్తిలో ఒక్కసారిగి ఆమెపై దాడి చేశాడు. మెడ, చేతిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేశ్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, వాసవి, గణేశ్.. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, గణేశ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఇక, వీరిద్దరూ గచ్చిబౌలి ఏరియాలోని ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు! -
పిస్టోరియస్కు ఆరేళ్లు
జైలు శిక్ష విధించిన దక్షిణాఫ్రికా కోర్టు ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దక్షిణాఫ్రికా పారా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు ఆరేళ్ల జైలు శిక్ష పడింది. రీవా స్టీన్కాంప్ హత్య కేసులో ప్రిటోరియా హై కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. నిజానికి దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం హత్య కేసులో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉన్నా.. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని పిస్టోరియస్కు తక్కువ శిక్షను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా జడ్జి థోకోజిలే మసిపా వ్యాఖ్యానించారు. పిస్టోరియస్ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడని జడ్జి భావించారు. ఈ కేసులో ఇదే అఖరు తీర్పు కాబోదు. తెల్ల రంగు చొక్కా, నల్లరంగు కోటు వేసుకున్న పిస్టోరియస్ కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి కోర్టుకు వచ్చాడు. ఈ తీర్పుపై పిస్టోరియస్ అప్పీల్‌కు వెళ్లాలని అనుకోవడం లేదని అతని న్యాయ సలహాదారుల బృందం తెలిపింది. 2013 ప్రేమికుల రోజున తన ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడని భావించిన పిస్టోరియస్ బాత్రుమ్ తలుపు వెనుక నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అతని ప్రియురాలు రీవా మరణించింది. -
బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు 15 ఏళ్లు జైలు
ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన దక్షిణాఫ్రికా హైకోర్టు ఈ మేరకు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2013 లో పిస్టోరియస్ తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్‌ను హత్య చేసినట్టు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. ఈ కేసును గురువారం విచారించిన న్యాయస్థానం పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది. అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసును ఈ రోజు విచారించింది. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా ప్రియురాలిని చంపలేదని, అయితే హత్య చేసింది అతనేనని పేర్కొంది. పిస్టోరియస్కు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. -
పిస్టోరియస్ కావాలని చంపలేదు
- ప్రిటోరియా హైకోర్టు తీర్పు - ప్రియురాలి హత్య కేసులో బ్లేడ్ రన్నర్‌కు ఊరట ప్రిటోరియా: బ్లేడ్ రన్నర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్కు తన ప్రియురాలి హత్య కేసులో కాస్త ఉపశమనం లభించింది. ఉద్దేశపూర్వకంగానే అతడీ హత్య చేసినట్టు నిరూపితం కాలేదని అతడిపై ఉన్న హత్యానేరాన్ని ప్రిటోరియా హైకోర్టు జడ్జి తొకోజిలే మసిపా కొట్టివేశారు. అలాగే అత్యంత కఠిన శిక్ష పడే అభియోగాలను సైతం తోసిపుచ్చారు. సంఘటన జరిగిన రోజు తనో హత్య చేయబోతున్నట్టు అతడేమీ ఊహించలేదని తెలిపారు. ‘ఈ హత్య కేసు స్పష్టంగా నిరూపితం కాలేదు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేశాడని చెప్పేందుకు ఆధారాలు లేవు. కచ్చితంగా ఆ రోజు ఇలా జరుగుతుందని పిస్టోరియస్ అనుకోలేదు. తలుపు వెనకాల ఉన్న వ్యక్తిని మాత్రమే తను చంపాడని భావించాడు. ఎందుకంటే ఆ సమయంలో తన ప్రియురాలు బెడ్ రూమ్‌లో ఉన్నట్టు అతడికి తెలుసు. కానీ ఆ సమయంలో తను చాలా ఆదరా బాదరాగా ప్రవర్తించాడు. విపరీతమైన శక్తిని ఉపయోగించాడు. ఓ విధంగా అతను నిర్లక్ష్యంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు వెలువడిన సమయంలో కోర్టు రూమ్‌లోనే ఉన్న పిస్టోరియస్ తల దించుకుని మౌనంగా రోదించాడు. అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసు పిస్టోరియస్పై అలాగే ఉంది. ఈ కేసు విచారణ నేడు (శుక్రవారం) కొనసాగనుంది. ఫిబ్రవరి 14, 2013న పిస్టోరియస్ ఇంట్లోని టాయిలెట్లో ఈ హత్య జరిగింది. ఎవరో ఆగంతకుడు ఇంట్లో చొరబడ్డాడనుకుని కాల్పులు జరిపినట్టు ఆది నుంచీ ఈ క్రీడాకారుడు వాదిస్తున్నాడు. అయితే తన ప్రియురాలితో గొడవ పడి కావాలనే చంపేసినట్టు ప్రాసిక్యూషన్ వాదించింది. కానీ ఆ జంట మధ్య గొడవ జరిగినట్టు ఆధారాలు లేవని జడ్జి తేల్చారు. మితిమీరిన మీడియా కవరేజి కూడా సాక్షులపై ప్రభావం చూపిందని చెప్పారు. ఘటన జరిగిన అనంతరం కొద్ది రోజులు జైల్లోనే ఉన్న ఈ 27 ఏళ్ల అథ్లెట్ తిరిగి బెయిల్‌పై విడుదలయ్యాడు.