girls sold
-
ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు..
సాక్షి, భువనేశ్వర్: ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి బాలికలను విక్రయించే ఓ ముఠా పోలీసులకు చిక్కింది. ఆ ముఠాలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ ప్రాంతం సునాబెడ గ్రామానికి చెందిన బాలికకు పని కల్పిస్తామని తల్లిదండ్రులను నమ్మించి తీసుకువెళ్లిన దుండగులు ఆ బాలికను వేరే వ్యక్తికి లక్షరూపాయలకు అమ్మివేశారు. ఆ బాలిక చాకచక్యంగా తప్పించుకుని ఇంటికి చేరింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ అమానుష సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మరకోట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మంగళ సింగ్ హరిజన్, మొణిత కుమార్‌లు సునాబెడ గ్రామానికి చెందిన బాలికకు పనులు ఇప్పిస్తామని తల్లి దండ్రులను ప్రలోభపెట్టి గత ఏడాది ఆగస్టు 8 వ తేదీన తమతో నవరంగపూర్ తీసుకువెళ్లారు. నవరంగపూర్‌లోని తోటవీధికి చెందిన నిర్మల సున, బసంత సున, జమున బాగ్, పూర్ణశాంత అనే మహిళలకు బాలికను అప్పగించి వెళ్లిపోయారు. ఆ బాలిక దాదాపు 3 నెలలు అక్కడే ఉంది. అనంతరం ఆ మహిళలు బాలికను ఢిల్లీ తీసుకు వెళ్లి ఒక వ్యక్తితో వివాహం చేశారు. ఆ వ్యక్తి నిందిత మహిళలకు లక్షరూపాయలు అందజేశాడు. డబ్బులు చేతికి అందిన తరువాత నిందిత మహిళలు నవరంగపూర్ తిరిగి వచ్చేశారు. ఆ వ్యక్తి వేధింపులు తాళలేక ఈ నెల 14 వ తేదీన బాలిక తప్పించుకుని అతి కష్టంపై ఉమ్మరకోట్ చేరుకుంది. ఈ విషయం తెలిసిన నిందిత మహిళలు ఈ నెల 21వ తేదీన బాలిక గ్రామానికి వచ్చి ఢిల్లీ తీసుకు వెళ్తామని, తమతో రమ్మని బలవంతం పెట్టారు. వారితో వెళ్లేందుకు బాలిక నిరాకరించి తనను లక్ష రూపాయలకు అమ్మివేశారని తల్లిదండ్రులకు వెల్లడించింది. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు అవాక్కయ్యారు. నిందితులపై ఆగ్రహించి బంధించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ అమానుష సంఘటన జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. చదవండి: ప్రియురాలి యాసిడ్ దాడి, ప్రియుడి మృతి -
అమ్మాయిలను అమ్మి.. వంద కోట్ల సంపాదన!
అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి, వారితో వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న ఓ జంటతో పాటు ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై అత్యంత కఠినమైన మోకా చట్టం కింద కేసు పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిషా, కర్ణాటక, అసోం రాష్ట్రాలు.. ఇంకా నేపాల్ నుంచి దాదాపు 5వేల మంది అమ్మాయిలను హుస్సేన్ (50), సైరా (45) అనే ఇద్దరూ ఢిల్లీకి అక్రమంగా తరలించేవాళ్లు. రూ. 50 వేలకు అమ్మాయిని కొనడం, తర్వాత వాళ్లను రూ. 2 లక్షలకు అమ్మేయడం.. ఈ వ్యాపారంతో ఇప్పటికి దాదాపు వంద కోట్లు ఆర్జించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అమ్మాయి వయసు ఎంత తక్కువైతే వీళ్ల ఆదాయం అంత ఎక్కువగా ఉండేది. తాము కొన్న అమ్మాయిలను ఇంట్లోని అల్మారాలలోను, సొరంగాలలోను దాచిపెట్టి ఉంచేవాళ్లని, చిన్న చిన్న క్యూబికల్స్‌లో ఉన్న విటుల వద్దకు బలవంతంగా పంపేవారని జాయింట్ కమిషనర్ (క్రైం) రవీంద్ర యాదవ్ తెలిపారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని, ఈ రాకెట్లో మరింతమంది ఉండొచ్చని ఆయన అన్నారు. హుస్సేన్ డ్రైవర్ రమేష్, చీఫ్ మేనేజర్ వాసులను కూడా ఇప్పటికే అరెస్టు చేశారు. వాళ్లతోపాటు శంషద్, శిల్పి, ముంతాజ్, పూజా థాపా అనే నలుగురు అమ్మాయిలను హ్యాండిల్ చేసే 'నాయికలు'గా ఉండేవారు. వాళ్లు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మొత్తం రాకెట్‌ను సైరాబేగం నడిపించేదని, ఇందులో పై నుంచి కిందివరకు నాయికలు, పెయిడ్ మేనేజర్లు, వాళ్ల అసిస్టెంట్లు, అమ్మాయిలను అక్రమంగా తీసుకొచ్చేవాళ్లు.. ఇలా అంతా ఉండేవాళ్లని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీనివెనుక చాలా పెద్ద క్రైం సిండికేట్ ఉందని అన్నారు. -
వాట్సప్, టెలిగ్రాంలలో.. అమ్మాయిల అమ్మకం!
టెలిగ్రామ్ యాప్‌లో ఈ మధ్య ఓ ప్రకటన వస్తోంది.. ‘‘అమ్మకానికి అమ్మాయి ఉంది.. కన్నెపిల్ల.. అందంగా ఉంటుంది.. 12 ఏళ్ల వయసు.. ఆమె ధర ఇప్పటికి రూ. 8.5 లక్షల వరకు వెళ్లింది.. త్వరలోనే అమ్ముడుపోతుంది.. తొందరపడండి’’ అంటూ అరబిక్ భాషలో ఈ ప్రకటన ఉంది. పిల్లిపిల్లలు, ఆయుధాల ప్రకటనలతో పాటే ఈ ప్రకటన కూడా వచ్చింది. మైనారిటీ యజీదీ వర్గం వాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న ఓ కార్యకర్త ఈ ప్రకటనను మీడియాకు పంపారు. యజీదీ మహిళలను, పిల్లలను ఉగ్రవాదులు బంధించి, వాళ్లను సెక్స్ బానిసలుగా అమ్మేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా దాదాపు 3వేల మంది మహిళలు, బాలికలను అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్మార్ట్ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రాం లాంటి యాప్‌ల సాయంతో మహిళలను, పిల్లలను ఇలా అమ్మకానికి పెడుతున్నారు. వాళ్ల ఫొటోలతో పాటు.. వాళ్ల ‘యజమానుల’ వివరాలు కూడా పెడుతున్నారు. ఎక్కడికక్కడ తమ సొంత చెక్‌పోస్టులు పెట్టి, వాటి నుంచి మహిళలు తప్పించుకోకుండా చూస్తున్నారు. బందీలుగా ఉన్న మహిళలను తప్పించేందుకు కొందరు స్మగ్లర్లు ప్రయత్నించగా, వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. 2014 ఆగస్టు నెలలో వందలాది మంది యజీదీ మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకున్న ఐఎస్ ఉగ్రవాదులు కుర్దిష్ భాష మాట్లాడే మైనారిటీ వర్గం మొత్తాన్ని నిర్మూలించాలన్న ఆలోచనలో ఉన్నారు. కొన్నాళ్ల పాటు అరబ్, కుర్దిష్ స్మగ్లర్లు మాత్రం ఎలాగోలా ప్రాణాలకు తెగించి నెలకు దాదాపు 134 మంది మహిళలను విడిపించారు. కానీ మే నెలలో ఐఎస్ ఉగ్రవాదులు వాళ్ల మీద విరుచుకుపడటంతో.. గత ఆరు వారాల్లో కేవలం 39 మందిని మాత్రమే విడిపించగలిగారు. ఎవరైనా పారిపోయే ప్రయత్నం చేసినా.. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో మందుపాతరలను ఏర్పాటుచేయడంతో వాళ్లలో చాలామంది చనిపోతున్నారు. వాటి బారి నుంచి అతి కొద్ది మంది మాత్రం ఎలాగోలా తప్పించుకుని.. బయట పడుతున్నారు.