glamorous roles
-
చాలా టెన్షన్ పడ్డాను!
‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ‘బెంగాల్ టైగర్’ వరకూ పక్కింటి అమ్మాయి పాత్రలతో పాటు గ్లామరస్ రోల్స్ చేశారు రాశీఖన్నా. ఈ 5న విడుదల కానున్న ‘సుప్రీమ్’లో పోలీసాఫీసర్‌గా నటించారు. ఈ సందర్భంగా రాశీఖన్నా మాట్లాడుతూ - ‘‘డెరైక్టర్ అనిల్ పోలీసాఫీసర్ పాత్ర గురించి చెప్పగానే ‘నేనా? కామెడీనా?’ అని భయపడ్డా. చేయడం మొదలుపెట్టాక ఆ భయం పోయింది. ఇందులో నా పాత్ర పేరు బెల్లం శ్రీదేవి. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ అని పేరు తెచ్చుకోవడానికి ఆమె పడే పాట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. నవ్వించడమే కాదు... రౌడీలను తుక్కు రేగ్గొట్టే సీన్స్ కూడా ఉన్నాయి. గతంలో చిరంజీవి గారు, రాధ చేసిన ‘అందం హిందోళం...’ పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చేసే ముందు ఆ పాట చూశా. ప్రతి ఫ్రేమ్‌లోనూ చిరంజీవి గారితో రాధగారికి స్టెప్స్ ఉన్నాయి. దాంతో టెన్షన్ అనిపించింది. చేయగలనా? అని భయ పడ్డా. సెట్లో చాలా సెలైంట్‌గా ఉండే సాయిధరమ్ కెమెరా ముందుకు రాగానే రెచ్చిపోతాడు. అతని డ్యాన్స్ చూసి నేనూ భయం లేకుండా చేసేశా. అందరూ బాగా చేశావని మెచ్చుకున్నారు’’ అని చెప్పారు. ఖాళీగా ఉన్నప్పుడు కవితలు రాస్తుంటాననీ, వాటిని పుస్తకరూపంలో తీసుకురావాలనుకుంటున్నాననీ రాశీఖన్నా అన్నారు. -
మూడోసారి ముచ్చటగా...!
గాసిప్ గ్లామరస్ రోల్స్ ఎంత బాగా చేయగలరో, సంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలనూ అంతే బ్రహ్మాండంగా చేయగలరు నయనతార. అందుకే, ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తూనే మరోవైపు ట్రెడిషనల్ క్యారెక్టర్స్, అప్పుడప్పుడూ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నారు. ‘అనామిక’ తర్వాత కథానాయిక ప్రాధాన్యంగా సాగే ‘మాయ’ అనే చిత్రంలో నటించారు నయనతార. ఈ రెండు చిత్రాల ద్వారా సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసే సత్తా తనకుందని నిరూపించుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి లేడీ ఓరియంటెడ్ మూవీ ఒప్పుకున్నారని చెన్నై టాక్. తమిళ దర్శకుడు సర్గుణం దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన దాస్ రామస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. విశేషం ఏంటంటే.. శిష్యుడు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సర్గుణమే నిర్మించనున్నారని సమాచారం. -
ఉత్తీర్ణతే లక్ష్యం
‘అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ప్రాముఖ్యత నిస్తాను. అంతకంటే ముందు ప్లస్-2లో మంచి మార్కులు సాధించాల్సిన్నదే నా ముందున్న లక్ష్యం’ అంటోంది నటి లక్ష్మీమీనన్. పదో తరగతి చదువుతూనే నటిగా తెరంగేట్రం చేసిన ఈ కేరళ కుట్టి కుంకి చిత్రంలో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించడం, తన నటనకు ప్రశంసల జల్లు కురవడంతో అమ్మడికి వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. అదృష్టం కూడా కలసివచ్చి లక్కీ హీరోయిన్ అయ్యింది. పాండియనాడు, నాన్శివప్పు మనిదన్, మంజాపై అంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ మలయాళి భామ తాజాగా నటించిన కొంబన్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్ కార్తీతో రొమాన్స్ చేసింది. కాగా ఈ అమ్మడుపై వదంతులు జోరుగానే సాగుతున్నాయి. ఆ మధ్య విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి కలకలానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ తరువాత ఆయనతో చెట్టాపట్టాలంటూ కూడా ప్రచారం హల్చల్ జోరందుకుంది. తాజాగా ఈ భామ నటనకు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టే విధంగా లక్ష్మీమీనన్ మాట్లాడారు. తనకు భవిష్యత్ ప్రణాళికలు చాలా ఉన్నాయని చెప్పారు. గ్లామరస్ పాత్రలను కోరుకుంటున్నానని, అందుకే కొన్ని చిత్రాల అవకాశాలను నిరాకరించినట్లు చెప్పింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం ప్లస్-2 పరీక్షలులో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నదేనని అంది. త్వరలో జరగనున్న పరీక్షలకు సిద్ధమవుతుండడంతో నటనకు చిన్న గ్యాప్ ఇచ్చినట్లు తెలిపింది. ఆంగ్ల లిటరేచర్ను కావాలన్నది తన కోరిక అని పేర్కొంది. అంతేకాదు ప్యాషన్ డిజైనర్ నవ్వాలనే ఆశ కూడా ఉందని చెప్పింది. ఇవి సినిమా పరిశ్రమలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పింది. ఇవన్నీ కావాలంటే చెన్నై కళాశాలలో చేరాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి ఆలోచనలేదన్నారు. తాజా చిత్రం కొంబన్ గురించిన విశేషాలేమిటన్న ప్రశ్నకు మరోసారి గ్రామీణ నేపథ్యంలో నటించిన చిత్రం కొంబన్ అన్నారు. -
నేనేం ఫూల్‌ని కాదు!
‘‘ఇక తాప్సీకి తిరుగులేదు. నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటే ఏ దర్శక, నిర్మాత అయినా కళ్లు మూసుకుని, తన పేరే చెబుతారు. గ్లామరస్ రోల్‌కి కూడా తనని తీసుకుంటారు’’ అని బాలీవుడ్లో బడా దర్శక, నిర్మాతలు ఈ బ్యూటీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. దానికి కారణం ఇటీవల విడుదలైన ‘బేబీ’ చిత్రం. ఈ చిత్రంలో తాప్సీ నటనను విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రవిజయంతో ఇక హిందీ రంగంలో తన కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకంతో తాప్సీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఏ ఆర్టిస్ట్‌కైనా సత్తా ఉన్న పాత్ర వస్తే తామేంటో నిరూపించుకుంటారు. ప్రతి ఒక్కరిలోనూ దమ్ముంటుంది. నేను గ్లామరస్ రోల్స్‌కే పనికొస్తానని చాలామంది అనుకుంటారు. కానీ, ‘బేబీ’ చూస్తే, ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు’’ అని పేర్కొన్నారు. గ్లామరస్ రోల్స్ గురించి ఇంకా మాట్లాడుతూ -‘‘రొమాంటిక్ మూవీస్‌లో కచ్చితంగా ‘బోల్డ్’ సీన్స్ ఉంటాయి. అవి చేయడానికి ఇష్టపడక ఆ సినిమాని వదులుకుంటే నా అంత ఫూల్ ఇంకొకరు ఉండరు. ఎందుకంటే, రొమాంటిక్ సీన్స్‌లో కూడా నటనకు అవకాశం ఉంటుంది. పైగా.. ఇవాళ ఎవరినైనా ప్రేమిస్తే.. ఆ ప్రేమను చిన్న చిన్న మాటలతో వ్యక్తపరిస్తే సరిపోవడంలేదు. అంతకు మించి ఎక్స్‌ప్రెస్ చేస్తేనే ప్రేక్షకులు ఆ ప్రేమకథకు కనెక్ట్ అవుతున్నారు. అందుకే చిన్నపాటి శృంగార సన్నివేశాలను పొందుపరుస్తున్నారు. అలాంటివాటిలో నటించడానికి నాకేం అభ్యంతరం లేదు’’ అని చెప్పారు. -
ఇప్పుడది లేదు
ఇప్పుడు ఆ సమస్య లేద ంటోంది నటి ఐశ్వర్య రాజేష్. ఇంతకీ ఏ విషయం గురించి ఈ బ్యూటీ మాట్లాడుతుందో తెలుసుకుందామా?. గ్రామీణ కథా పాత్రల నటిగా ముద్రవేసుకున్న ఐశ్వర్య ఆ ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటోందట. అయితే గ్లామరస్ పాత్రలు తన ఒంటికి సరిపడవు అంటున్న ఈ అమ్మడి చేతిలో నాలుగైదు చిత్రాలు వున్నాయి. వాటివివరాలు ఈమె తెలుపుతూ అట్టకత్తి, పణైయారుం పద్మినియుమ్ చిత్రాల తరువాత నటించిన చిత్రం తిరుడన్ పోలీస్ అని చెప్పింది. ఈ చిత్రంలో మోడరన్ పాత్రే అయినా గ్లామరస్‌గా నటించలేదని పేర్కొంది. నిజం చెప్పాలంటే గ్లామర్ తన శరీర కృతికి నప్పదని తెలిపింది. తిరుడన్ పోలీసు ఈ నెల 14న తెరపైకి రానుందని చెప్పింది. ప్రస్తుతం కాక్కముట్టై, ఇడంపొరుళ్ ఎవల్, కుట్రుముం దండనైయుం చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. కాక్కముట్టై చిత్రంలో చాలా వైవిధ్యభరిత పాత్ర చేస్తున్నట్లు చెప్పింది. ఇక కుట్రముందండనైయుం, చిత్రంలో ఇంతవరకు పోషించనటువంటి నటనకు సవాల్‌గా నిలిచే పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నటనా ప్రతిభను చాటుకునే మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. ఇడమ్ పొరుల్ ఎవల్ చిత్రంలో నందినితో కలిసి నటిస్తున్నట్లు చెప్పింది. ఇద్దరు హీరోయిన్ల కథాచిత్రంలో నటిస్తున్నప్పుడు ఎవరి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందనే విషయంలో మనస్పర్థలు ఏర్పడుతుంటాయని అయితే ఇప్పుడా సమస్య లేదని అంది. హీరోయిన్లు ఫ్రెండ్లీగా ఉండటమే ఇందుకు కారణం అని ఐశ్వర్య అంటోంది. -
అలా అనడానికి వాళ్ళెవరు?
‘‘పాత్ర అనేది కథను బట్టి ఉంటుంది. పాత్ర తీరుతెన్నులు దర్శకుని సృజనను బట్టి ఉంటాయి. ఒక కథను తయారు చేయడం, ఒక పాత్రను మలచడం.. సినిమా చూసి విమర్శించినంత తేలిక కాదు. ‘ఈ పాత్రను ఇంత ఘాటుగా తీయడం అవసరమా?’ అనీ, ఒకవేళ పద్ధతిగా కనిపిస్తే.. ‘ఈ పాత్ర ఇంకా మోడర్న్‌గా ఉంటే బాగుంటుంది’ అనీ తోచిన వ్యాఖ్యలు చేయడానికి బయటివాళ్లెవరు?’’ అని ఇటీవల శ్రుతీ హాసన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు కూడా చేస్తూ, ముందుకు దూసుకెళుతున్నారు శ్రుతి. తెరపై తారలు చేసే పాత్రల్ని బట్టి వాళ్ల గుణాన్ని, అభిరుచులను అంచనా వేయడం సరికాదని ఆ ఇంటర్వ్యూలో శ్రుతి చెబుతూ -‘‘గ్లామరస్ పాత్రల్లో నేను కనిపించినప్పుడు, నా శరీరాన్ని వేరే దృష్టితో చూస్తే, అది చూసేవాళ్ల తప్పు. మీరెలాగైనా కనిపించండి... ఎదుటి వ్యక్తి మనసులో ఏమీ లేనప్పుడు మీ గురించి లేనిపోనివి ఊహించుకోరు. నా మటుకు నా శరీరం నాకు గుడి లాంటిది. వేరేవాళ్లు వేరే రకంగా అనుకుంటే అది నా తప్పు కాదు. అలాంటివాళ్ల గురించి ఆలోచించి నా సమయాన్ని వృథా చేసుకోను. అలాగే, తెరపై మేం చేసే పాత్రలను మా నిజజీవితానికి ఆపాదించవద్దు. తెరపై కనిపించేది పాత్రలు మాత్రమే.. మేము కాదు’’ అన్నారు. -
అందాలకు హద్దులు
ఇకపై అందాలారబోతకు హద్దులుంటాయంటున్నారు శ్రుతి హాసన్. ఒక ప్రఖ్యాత నటుడు వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ భామ తొలిరోజుల్లోనే హిందీ చిత్రం లక్‌లో శ్రుతి మించిన అందాలను తెరపై ఆరబోసి విమర్శలు మూటకట్టుకున్నారు. ఆ తరువాత కూడా హిందీ, తెలుగు భాషల్లో అందాలొలక బోస్తూ గ్లామర్‌డాల్‌గా ప్రాచుర్యం పొందారు. అయితే తమిళ చిత్రాల్లో గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమె తమిళంలో 3, 7 ఆమ్ అరివు చిత్రాల్లో నటించారు. తాజాగా నటించిన పూజై చిత్రం దీపావళికి తెరపైకి రానుం ది. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ మాట్లాడుతూ తానెలా నటించాలన్న విషయమై సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేదన్నారు. ఆ విషయాన్ని పాత్రలే నిర్ణయిస్తాయన్నారు. ఇక గ్లామర్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుందన్నారు. అంతేగాని హిందీ, తెలుగు చిత్రాల్లో గ్లామరస్‌గా నటిస్తున్నానని, తమిళ చిత్రాల్లో అందాలారబోత విషయంలో అభిమానులను నిరాశపరుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఏదేమైనా ఇకపై ఇలాంటి విమర్శలకు దూరం అవడానికి ఏ భాషా చిత్రంలోనైనా గ్లామర్ విషయంలో కొన్ని పరిమితులు విధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. త్వరలో ఈ బ్యూటీ ఇళయదళపతి సరసన నటించడానికి సిద్ధం అవుతోంది.