నేనేం ఫూల్‌ని కాదు! | I am not fool says taapsee pannu | Sakshi
Sakshi News home page

నేనేం ఫూల్‌ని కాదు!

Published Sat, Jan 24 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

నేనేం ఫూల్‌ని కాదు!

నేనేం ఫూల్‌ని కాదు!

 ‘‘ఇక తాప్సీకి తిరుగులేదు. నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటే ఏ దర్శక, నిర్మాత అయినా కళ్లు మూసుకుని, తన పేరే చెబుతారు. గ్లామరస్ రోల్‌కి కూడా తనని తీసుకుంటారు’’ అని బాలీవుడ్‌లో బడా దర్శక, నిర్మాతలు ఈ బ్యూటీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతున్నారు. దానికి కారణం ఇటీవల విడుదలైన ‘బేబీ’ చిత్రం. ఈ చిత్రంలో తాప్సీ నటనను విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రవిజయంతో ఇక హిందీ రంగంలో తన కెరీర్ ఊపందుకుంటుందనే నమ్మకంతో తాప్సీ కూడా ఉన్నారు.
 
 ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ - ‘‘ఏ ఆర్టిస్ట్‌కైనా సత్తా ఉన్న పాత్ర వస్తే తామేంటో నిరూపించుకుంటారు. ప్రతి ఒక్కరిలోనూ దమ్ముంటుంది. నేను గ్లామరస్ రోల్స్‌కే పనికొస్తానని చాలామంది అనుకుంటారు. కానీ, ‘బేబీ’ చూస్తే, ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు’’ అని పేర్కొన్నారు. గ్లామరస్ రోల్స్ గురించి ఇంకా మాట్లాడుతూ -‘‘రొమాంటిక్ మూవీస్‌లో కచ్చితంగా ‘బోల్డ్’ సీన్స్ ఉంటాయి. అవి చేయడానికి ఇష్టపడక ఆ సినిమాని వదులుకుంటే నా అంత ఫూల్ ఇంకొకరు ఉండరు.
 
 ఎందుకంటే, రొమాంటిక్ సీన్స్‌లో కూడా నటనకు అవకాశం ఉంటుంది. పైగా.. ఇవాళ ఎవరినైనా ప్రేమిస్తే.. ఆ ప్రేమను చిన్న చిన్న మాటలతో వ్యక్తపరిస్తే సరిపోవడంలేదు. అంతకు మించి ఎక్స్‌ప్రెస్ చేస్తేనే ప్రేక్షకులు ఆ ప్రేమకథకు కనెక్ట్ అవుతున్నారు. అందుకే చిన్నపాటి శృంగార సన్నివేశాలను పొందుపరుస్తున్నారు. అలాంటివాటిలో నటించడానికి నాకేం అభ్యంతరం లేదు’’ అని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement