నాకు తెలియకుండానే బిడ్డను కంటానా | Tapsee Pannu: If I had a baby, I'd have known! | Sakshi
Sakshi News home page

నాకు తెలియకుండానే బిడ్డను కంటానా

Published Mon, Jun 8 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

నాకు తెలియకుండానే బిడ్డను కంటానా

నాకు తెలియకుండానే బిడ్డను కంటానా

మీడియా హీరోయిన్లను పెళ్లి కాకుండానే తల్లుల్ని చేసేస్తోందా? వారి  ఆరోపణలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆ మధ్య నటి అంజలికి కూతురు ఉంది అంటూ ప్రచారం హల్‌చల్ చేసింది. తాజాగా నటి తాప్సీ బిడ్డను కన్నది అనే ప్రచారం దుమారం రేపుతోంది. నటి తాప్సీకి విదేశీ బాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూ బోకు మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని తాప్సీ ఖండించారు.
 
 మాథ్యూబో తనకు మంచి స్నేహితుడు మాత్రమే నని నొక్కి వక్కానిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అంతర్జాతీయ మీడియా నటి తాప్సీకి ఆమె ప్రేమికుడు మ్యాథ్యూబోకు ఒక బిడ్డ పుట్టినట్టు దీంతో మ్యాథ్యూబో తదుపరి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలో పాల్గొనకుండా వైదొలగినట్లు ప్రచారం హోరెత్తించింది. నిజానికి మ్యాథ్యూబో స్నేహితుడు కెర్‌స్టన్‌కు బిడ్డ పుట్టాడు.
 
  దాన్ని తప్పుగా ప్రచారం చేసింది. తాప్సీ స్పందిస్తూ తనకు తెలియకుండానే తమకు బిడ్డ పుట్టాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉన్నానని నిజానికి తనకు అమ్మ పాత్రలు పోషించడానికే తీరిక లేదని అన్నారు. మ్యాథ్యూబో సహ క్రీడాకారుడు కెర్‌స్టన్ తండ్రి కాబోతున్నట్టు తెలుసన్నారు. తాను  కంపెనీ పనుల్లోనూ తలమునకలై ఉన్నట్లు, తాను నటించిన హిందీ చిత్రం రన్నింగ్ షాది చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తాప్సీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement