GLS 400
-
మెర్సిడెస్ జీఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రముఖ ఎస్యూవీ ‘జీఎల్ఎస్’లో గ్రాండ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.86.9 లక్షలు. ఇది జీఎల్ఎస్ 350డీ గ్రాండ్ ఎడిషన్ (డీజిల్), జీఎల్ఎస్ 400 గ్రాండ్ ఎడిషన్ (పెట్రోల్) అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటిల్లో 3 లీటర్ వీ6 ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. జీఎల్ఎస్ గ్రాండ్ ఎడిషన్‌లో 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 10 స్పోక్ అలాయ్ వీల్స్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో రొనాల్డ్ ఫోల్గర్ తెలిపారు. -
మెర్సిడెస్ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘జీఎల్ఎస్ 400’లో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.82.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. తాజా వేరియంట్‌తో భారత్‌లో విక్రయిస్తున్న అన్ని మోడల్ వాహనాలకు డీజిల్‌తోపాటు పెట్రోల్ వెర్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు అయ్యిందని కంపెనీ తెలిపింది. ‘జీఎల్ఎస్ 400’ పెట్రోల్ వేరియంట్లో 3.0 లీటర్ వీ6 పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చామని పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల చేస్తున్న 5వ ఎస్యూవీ వేరియంట్ ఇదని, సమీప కాలంలో మరిన్ని ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తెస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో రోనాల్డ్ ఫాల్గెర్ తెలిపారు.