సింగరేణి అభివృద్ధితోనే పారిశ్రామిక ప్రగతి
జీఎం విజయపాల్‌రెడ్డి
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి అభివృద్ధితో తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమని ఆర్జీ–2 జీఎం విజయపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసి మాట్లాడారు. ప్రస్తుతం బొగ్గు పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, దీన్ని అధిగమించేందుకు ప్రతీఒక్కరు సమష్టిగా కృషి చేయాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాలపై యాజమాన్యం ప్రత్యేక దష్టి సారించిందన్నారు. అనంతరం ఆర్జీ–2 డివిజన్లో ఉత్తమ కార్మికులుగా ఎంపికైన 8మందిని జీఎం సన్మానించారు. ఎస్‌ఓటూ జీఎం రవీందర్ అధికారులు రమేష్, చింతల శ్రీనివాస్, ఆర్వీ.రావు, ప్రసాద్, ఓదెలు, వెంకటయ్య, జానకీరాం, కార్మిక సంఘాల నాయకులు ఐలి శ్రీనివాస్, దశరథంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.