విద్యార్థి కృష్ణవంశీ అదృశ్యం... పట్టించుకోని పోలీసులు
విజయవాడ: నగరంలోని పాతబస్తీ సితార సెంటర్ వద్ద విద్యార్థి కృష్ణవంశీ అదృశ్యమయ్యాడని అతడి తల్లిదండ్రులు మంగళవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆడుకునేందుకు వెళ్లిన కృష్ణవంశీ ఆపై ఇంటికీ తిరిగి రాలేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి తమ కుమారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళనతో తెలిపారు. నగరంలోని జీఎన్ఆర్ఎంసీ పాఠశాలలో కృష్ణవంశీ తొమ్మిదో తరగతి చదువుతున్నాడని అతడి తల్లిదండ్రులు వెల్లడించారు.