Goa Congress
-
గోవా కాంగ్రెస్‌లో ముసలం-బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవా కాంగ్రెస్‌లో ముసలం-బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు -
ఓ కేంద్రమంత్రి.. రేప్‌కు మతానికి లింకేంటి?
పనాజీ: పశ్చిమ బెంగాల్లో జరిగిన నన్‌పై లైంగికదాడి విషయంలో బీజేపీ నేత, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. అత్యాచారానికి, మతానికి సంబంధం పెడుతూ వ్యాఖ్యలు చేయడమేమిటని గోవా కాంగ్రెస్ పార్టీ ఆయనను తీవ్రంగా విమర్శించింది. బీజేపీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం స్పందించిన ఆయన బెంగాల్లో నన్‌పై జరిగిన లైంగికదాడిని ప్రస్తావించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అయితే, వీటికి పార్టీకి, పార్టీ సంస్థలకు, పార్టీ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సిద్ధాంతాలు, తమ విధానాలు అనుసరించేవారు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, ప్రతి దానికి తమను నిందించడం అలవాటుగా మారిందన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కేంద్రమంత్రి అయ్యి ఉండి లైంగికదాడిని మతంతో ముడిపెట్టడం సబబేనా అని ప్రశ్నించింది. ఎప్పటికీ అరెండు విషయాలకు జతకట్టకూడదని పేర్కొంది. లైంగికదాడి అనేది మానసిక వైకల్యంతో కూడిన ఓ వ్యక్తి చేసే దుశ్చర్య అని, ఆ వ్యక్తిని శిక్షించాలే తప్ప ఇలా మతాల విషయాలు తెరమీదకు తీసుకురాకూడదని చెప్పారు. -
ప్రపంచ పెద్ద పార్టీనా.. ఓట్లేవి.. అంతా మోసం
పనాజీ: ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. బీజేపీ ఎప్పుడూ నెంబర్ గేమ్ ఆడుతుందని, వాటితో మోసం చేస్తుందని ఆరోపించింది. గోవా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గా దాస్ కామత్ ఈ విషయంపై గోవాలో ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ చెప్పే సభ్యత్వ సంఖ్యకు అది పొందే ఓట్లకు సంబంధం లేకుండా ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గోవాలో ఓ జిల్లా పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీలో మొత్తం నాలుగు లక్షలమంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని చెప్పిందని, కానీ మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 1,50,674 మాత్రమేనని అన్నారు. అంటే వారు చెప్పిన ప్రకారం మిగితా వాళ్లంతా సొంతపార్టీకే ఓటెయకుండా వెనక్కి వెళ్లిపోయారా.. లేక సభ్యత్వం రద్దు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క చిన్న రాష్ట్రమైన గోవాలో సభ్యత్వాల విషయంలోనే ఆ పార్టీ ఇంత మోసం చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా సభ్యత్వ సంఖ్యపై మోసం చేసిందని అన్నారు. దీనికి వెంటనే స్పందించిన గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓట్లు తక్కువగానే వచ్చినా తమ పార్టీ సభ్యులు అలాగే ఉన్నారని చెప్పారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ప్రాంతాలు కవర్ కాలేదని అందుకే మిగితా ఓట్లు పడలేదని చెప్పారు.