goa polls
-
గోవాలో గెలుపెవరిదంటే..
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కబోదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేస్తున్నాయి. న్యూస్ ఎక్స్-ఎమ్మార్సీ సర్వే ప్రకారం 40 స్థానాలున్న గోవాలో బీజేపీకి 15 స్థానాలు, కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఆప్‌కు 7 స్థానాలు, ఇతరులకు 6 స్థానాలు దక్కనున్నట్టు అంచనా వేసింది. గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశముందని, ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఆప్, ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. బహుముఖ పోటీ నెలకొన్న గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం వెలువడ్డాయి. చానెల్ బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఇతరులు ఇండియా న్యూస్ 15-21 12-18 0-4 2-8 ఇండియా టీవీ 10 15 7 8 ఇండియా టుడే యాక్సిస్ 18-22 9-13 0-2 5-9 వీఎమ్మార్ -
ముఖ్యమంత్రిగా మళ్లీ వస్తున్నాడు!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే గోవాలో బీజేపీ ముందుకెళ్లనుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించి ఆ పార్టీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని నేరుగా చెప్పకుండా ఉండాలని అనుకుంటోంది. అయితే, ప్రస్తుతం రక్షణశాఖ నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గోవాకు కాబోయే ముఖ్యమంత్రి అని మరో కేంద్ర మంత్రి, బీజేపీలో కీలక నేత నితిన్ గడ్కరీ పరోక్షంగా చెప్పారు. 'ఢిల్లీలో ఉన్న ఒక నేత గోవా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి అవుతారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలే వారి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారు. అయితే, వారిలో ఒకరినే ముఖ్యమంత్రిగా చేయాలనేం లేదు.. ఢిల్లీ నుంచి మేం ముఖ్యమంత్రి అభ్యర్థిని పంపిస్తాం' అని గడ్కరీ ఓ పత్రికా సమావేశంలో చెప్పారు. పారికర్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకు కేంద్రం కూడా అనుకూలంగా ఉందని బీజేపీ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా చర్చిస్తున్నారంట. -
బీజేపీ గోవా తొలి జాబితా విడుదల
పనాజి: గోవాలో మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు 29మందితో తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు పార్టీ తరపున నియమితులైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ మొత్తం 40 సీట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. గోవా తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న మీడియా ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ ఆ నిర్ణయం పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని స్పష్టం చేశారు.