బీజేపీ గోవా తొలి జాబితా విడుదల | BJP announces names of candidates for 29 seats for goa | Sakshi
Sakshi News home page

బీజేపీ గోవా తొలి జాబితా విడుదల

Published Thu, Jan 12 2017 4:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ గోవా తొలి జాబితా విడుదల - Sakshi

బీజేపీ గోవా తొలి జాబితా విడుదల

పనాజి: గోవాలో మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు 29మందితో తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం.

గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఈ ఎ‍న్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు పార్టీ తరపున నియమితులైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ మొత్తం 40 సీట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. గోవా తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న మీడియా ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ ఆ నిర్ణయం పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement