candidates first list
-
39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో 39 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. ఈ 39 మందిలో రాహుల్ గాంధీ, శశిథరూర్‌లాంటి కీలక నేతలు ఉన్నారు. తొలి జాబితాలో ఉన్న 39మందిలో 15మంది జనరల్.. 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారేనన్నారు. ఆ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్‌ను.. రాజ్‌నంద్‌గావ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించబోతోంది కాంగ్రెస్. అలాగే కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ టికెట్‌ను కేటాయించింది ఏఐసీసీ. కిందటి ఏడాదే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెల 11వ తేదీన మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశమై తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌మున్షీతోపాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేశ్, అధీర్‌రంజన్ చౌధరి, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్, టీఎం సింగ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వర్చువల్‌గా హాజరయ్యారు. తెలంగాణకు నాలుగు.. ఇక తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి నల్లగొండ నుంచి కందూరు రఘువీర్‌రెడ్డి, జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి, మహబూబాబాద్ బలరామ్ నాయక్ పేర్లు ఉన్నాయి. అంతకు ముందు కాంగ్రెస్ సీఈసీ నుంచి వచ్చిన జాబితాలో చేవెళ్ల అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి ఉన్నప్పటికీ.. తుది జాబితాలో ఆ స్థానం అభ్యర్థి పేరును ప్రకటించకపోవడం గమనార్హం. 39 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా -
బీజేపీ లోక్‌సభ ‘సై’రన్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అందరి కన్నా ముందుగా లోక్‌సభ ఎన్నికలకు ‘సై’రన్ మోగించింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సీట్లకుగాను 9 స్థానాలకు అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్)లకు తిరిగి అవే స్థానాలు ఇచ్చారు. తాజాగా పార్టీలో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో బీబీ పాటిల్‌కు జహీరాబాద్, పి.రాములు కుమారుడు భరత్‌కు నాగర్‌కర్నూల్ సీటు దక్కాయి. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌కు మల్కాజిగిరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చేవెళ్ల, బూర నర్సయ్యగౌడ్‌కు భువనగిరి, పార్టీ నేత మాధవీలతకు హైదరాబాద్ టికెట్లను ప్రకటించారు. ఏకాభిప్రాయం రాక.. పెండింగ్ తొలి జాబితాలో ప్రకటించిన 9 సీట్లలో 5 బీసీలకు కేటాయించారు. దీనితో మిగతా 8 సీట్లలో ఒకటి మాత్రమే బీసీలకిచ్చే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెండింగ్‌లో పెట్టిన సీట్లలో 4 జనరల్, 4 రిజర్వ్డ్ (రెండేసి చొప్పున ఎస్సీ,ఎస్టీ) స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ సీట్లలో అభ్యర్థులపై ఏకాభిప్రా యం కుదరకపోవడంతో పెండింగ్ లో పెట్టాలని జాతీయ నాయకత్వ ం నిర్ణయించింది. ఈ సీట్లలో ఒకరి కంటే ఎక్కువ మంది పోటీపడుతుండడం, రాష్ట్ర పార్టీ నేత లు వేర్వేరు వ్యక్తులకు మద్దతు తెలుపుతుండడంతో ఎటూ తేల్చ లేని పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. ఈ స్థానాలతోపాటు ఖమ్మం, నల్లగొండ, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ సీట్లకు సంబంధించి.. పార్టీలో ప్రస్తుతమున్న వారిలో కంటే బలమైన నేతలెవరైనా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వస్తారా? అని వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎంపీతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నలుగురు మాజీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో పార్టీపరంగా అంతగా బలం లేనందున.. అన్నీ కుదిరితే వీరిని చేర్చుకుని పార్టీ తరఫున బరిలో నిలపాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. మురళీధర్‌రావుకు దక్కని చాన్స్.. జాతీయ స్థాయిలో పలుకుబడి ఉండి పార్టీలో సీనియర్ నేతగా, మధ్యప్రదేశ్ రాష్ట్రపార్టీ ఇన్చార్జిగా ఉన్న పి.మురళీధర్‌రావుకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో సన్నాహాలు చేసుకోవాలని సూచించిందని, దీనితో ఏడాదిన్నరగా ఆయన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రచారం చేసుకున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ సీనియర్ నేత, బీసీల్లో పలుకుబడి ఉన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరి నుంచి పోటీకి ఉత్సాహం చూపడంతోపాటు టికెట్ ఇస్తే గెలుస్తానని నాయకత్వాన్ని ఒప్పించినట్టు వివరిస్తున్నాయి. ఇక రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల్లో కొందరు అభ్యంతరాలు చెప్పడంతోపాటు పలు సీట్లలో కొత్త పేర్లను ప్రతిపాదించడంతో ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఖరారు పెండింగ్‌లో పడినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పలు సీట్లపై పీటముడి ► ఆదిలాబాద్ సీటు కోసం సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుతోపాటు రమేశ్ రాథోడ్ పేరును, టికెట్ ఇస్తామంటే పార్టీ చేరేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన మాజీ ఎంపీ గోడం నగేశ్ పేరును బీజేపీ పెద్దలు పరిశీలించినట్టు తెలిసింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు సోయం బాపురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ సీటును పెండింగ్ పెట్టారని పార్టీ నాయకులు చెప్తున్నారు. ►మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు దాదాపు ఖరారైనా.. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కూడా ఇక్కడ పోటీకి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పీటముడి పడినట్టు సమాచారం. ► మెదక్ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు వైపు జాతీయ నాయకత్వం కొంత మొగ్గినా.. ఒకరిద్దరు రాష్ట్ర నేతలు అంజిరెడ్డి పేరును ముందుకు తెచ్చినట్టు తెలిసింది. ► పెద్దపల్లి, వరంగల్ ఎంపీ టికెట్లకు హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమైనట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ► ఇక నల్లగొండలో పోటీకోసం రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. మహబూబాబాద్ కోసం ఓ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ► పెండింగ్‌లో ఉన్న ఎనిమిది సీట్లకుగాను రెండో జాబితాలో మరో మూడు, నాలుగు పేర్లను ప్రకటిస్తారని.. మిగతా వాటికి చివర్లో ఖరారు చేయనున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. -
బీజేపీ స్ట్రాటజీ.. తొలి జాబితాపై సర్వత్రా ఆసక్తి!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ సిద్ధమయ్యింది. ఇందుకోసం గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. భేటీ తర్వాత.. శుక్రవారం తొలి జాబితాలో వందకిపైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకు ముందు.. ఇవాళ అనేక రాష్ట్రాల నేతలతో బీజేపీ అధిష్టానం మేధోమథనం జరిపింది. బుధవారం బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో భేటీ జరిగింది. జాబితా తుది కూర్పుపై షా, నడ్డాలు వాళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రకటించబోయే తొలి జాబితాలో.. మూడొంతుల అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే.. 2019లోనూ ఇలానే అగ్రనేతల పేర్ల జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. కానీ, ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక లిస్ట్ ఇచ్చింది. అయితే.. స్ట్రాటజీ ఇలా.. ఈసారి మాత్రం ముందుగానే లిస్ట్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు కారణం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి భిన్నంగా ముందుగానే ప్రకటించాలనుకుంటోంది. తద్వారా ఎన్నికల ప్రచారానికి సమయం దొరుకుతుందనేది బీజేపీ స్ట్రాటజీ. ఉదాహరణకు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ గెలవని 39 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సత్ఫలితాలను రాబట్టింది. అందుకే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తొలి జాబితా కోసం అదే స్ట్రాటజీని ఫాలో కానున్నట్లు స్పష్టమవుతోంది. ఫస్ట్ లిస్ట్‌లో.. 2019 ఎన్నికల్లో గెలవని స్థానాలను కూడా చేర్చాలనే యోచనలో కమల అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ సంఖ్య 130 దాకా ఉండొచ్చని.. తొలి జాబితాలో దక్షిణ ప్రాంతం నుంచి అత్యధిక స్థానాల ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఆయనకు పక్కా.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ నుంచి 6 నుంచి పదిమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ రాములు గురువారం నాడే బీజేపీలో చేరనున్నారు. అయితే.. రేపటి లిస్ట్‌లో ఆయన పేరును కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని.. నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నారని ప్రచారం నడుస్తోంది. -
వయ్‌నాడ్‌లో మహిళా అభ్యర్థిని పోటీకి దింపిన సీపీఐ
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయాన్ని పలు రాష్ట్రాల్లో కొలిక్కి తీసుకుస్తోంది. ఇక.. బీజేపీ సైతం వారం రోజుల్లో మొదటి జాబితాలోనే సుమారు వంది మంది అభ్యర్థులను ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ).. కేరళలో తమ పార్టీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఐ ప్రకంటిచిన జాబితాలో వయ్‌నాడ్ సెగ్మెంట్లో పోటీ చేయనున్న అభ్యర్థి కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత నేత, ఎంపీ రాహుల్‌గాంధీ వయ్‌నాడ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వయ్‌నాడ్ స్థానంలో సీపీఐ.. ఓ మహిళా అభ్యర్థిని బరిలో దించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సతీమణి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకురాలు అన్నే రాజా.. రాహుల్‌గాంధీపై పోటీపడబోతున్నారు. తిరువనంతపురం, మావెలిక్కర, త్రిస్సూర్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది సీపీఐ. తిరువనంతపురం నుంచి పన్నియన్ రవీంద్రన్, మావెలిక్కర నుంచి అరుణ్ కుమార్, త్రిస్సూర్ నుంచి వీఎస్ సునీల్ కుమార్ సీపీఐ అభ్యర్థులుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో రాహుల్ గాంధీ వయ్‌నాడ్ లోససభ నియోజకర్గం నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో సీపీఐ పార్టీ భాగస్వామ్యం పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. -
వారికి డబుల్ ధమాకా.. వీరికి ఝలక్!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాపై ఆ పార్టీలోనే భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పలువురు సీనియర్ నేతలకు సైతం టికెట్ దక్కకపోగా.. ప్రభావవంతమైన మూడు కుటుంబాలకు మాత్రం రెండేసి సీట్లు దక్కాయి. పార్టీలో చురుగ్గా ఉన్న నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డితో సహా భిక్షపతి యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి వంటి నేతలకు టికెట్లు దక్కలేదు. ఇక, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క కుటుంబాలకు రెండేసి టికెట్లు దక్కాయి. మరోవైపు సీనియర్ నేతలుగా ఉన్న జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ముఖేశ్ గౌడ్ తమ వారసులకు టికెట్లు సాధించలేకపోయారు. జానారెడ్డి తన కొడుకు మిర్యాలగూడ టికెట్ కోరుతూ ఢిల్లీలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగా.. సబితారెడ్డి కొడుకు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ లేదా షాద్‌నగర్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పొన్నాలతోపాటు అద్దంకి దయాకర్, పాల్వయా స్రవంతి తదితర నేతలు ఢిల్లీలోనే ఉండి టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓయూ విద్యార్థి నేతలకు సైతం కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు సైతం నిరాశ ఎదురైంది. ఓయూ జేఏసీ నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ అధినాయకత్వం ఊరించింది. కానీ మొదటి జాబితాలో విద్యార్థి నేతలకు అవకాశం కల్పించలేదు. జాబితాలలో తన పేరు లేకపోవడంతో ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులందరికీ వివరిస్తానని.. మహాకూటమికి వ్యతిరేకంగా విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే వినిపిస్తోంది. బీజేపీ నుంచి కంటోన్మెంట్ స్థానంలో బరిలో నిలిచే అవకాశం ఉందని సమాచారం. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని బలమూరి వెంకట్ భావిస్తున్నారు. వరసగా రెండోసారి ఆయన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను ఆశించిన పెద్దపల్లి స్థానంలో విజయరమణారావు పేరు ప్రకటించడంతో వెంకట్ రాజీనామాకు సిద్ధపడుతున్నారు. ఆయనకు మద్దతుగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు, రాష్ట్రకార్యవర్గ నేతలు, కేడర్ రాజీనామా చేసే అవకాశముంది. -
బీజేపీ గోవా తొలి జాబితా విడుదల
పనాజి: గోవాలో మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఆ దిశగా తొలి అడుగు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు 29మందితో తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 17 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉండడం విశేషం. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ ఎన్నికల పర్యవేక్షణకు పార్టీ తరపున నియమితులైన కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ మొత్తం 40 సీట్లలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. గోవా తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న మీడియా ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ ఆ నిర్ణయం పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుందని స్పష్టం చేశారు.